'రాజమౌళికి పద్మశ్రీ, మరి నాకు...?' | Ram Gopal Varma on Rajamouli Padmashri Honor | Sakshi
Sakshi News home page

'రాజమౌళికి పద్మశ్రీ, మరి నాకు...?'

Published Tue, Jan 26 2016 11:01 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

'రాజమౌళికి పద్మశ్రీ, మరి నాకు...?' - Sakshi

'రాజమౌళికి పద్మశ్రీ, మరి నాకు...?'

తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన రాజమౌళికి పద్మశ్రీ ప్రకటించటంపై అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం మరోసారి తన స్టైల్లో  స్పందించాడు. బాహుబలి లాంటి భారీ కళాఖండాన్ని తెరకెక్కించి తెలుగు వారి సత్తా ప్రపంచానికి చాటిన రాజమౌళి, సరైన విధంగా తెరకెక్కిస్తే, ఓ రీజినల్ సినిమా కూడా ఎలాంటి అద్భుతాలను సృష్టించగలదో నిరూపించాడు జక్కన్న.

' రాజమౌళికి పద్మశ్రీ వచ్చింది. కానీ నాకు మాత్రం చిన్న నాటి స్నేహితురాలు పద్మకూడా దక్కలేదు. ఇది బాహుబలియన్ ఫెయిల్యూర్'  అంటూ ట్వీట్ చేశాడు వర్మ. రాజమౌళిపై వర్మ ఎలాంటి విమర్శలు చేయకపోయినా, రాజమౌళికి అవార్డు వచ్చిన సందర్భాన్ని కూడా తన మార్క్ స్టేట్మెంట్తో న్యూస్గా మార్చాటంలో మాత్రం సక్సెస్ అయ్యాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement