ఓ అభిమాని మెగా హీరో సాయిధరమ్ తేజ్‌పై తన ప్రేమను చాటుకున్నాడు. తన కూతురికి తేజ్ చేతుల మీదుగా నామకరణం చేయించాడు. ఇందుకోసం అతను ఏకంగా తొమ్మిది నెలల పాటు వేచిచూశాడు. ఈ విషయం తెలుసుకున్న తేజ్.. తాజాగా చిన్నారికి నామకరణం చేశాడు. ఆ పాపకు తన పేరు కలిసివచ్చేలా.. తేజన్విత అని నామకరణం చేశాడు. అలాగే తేజన్వితకు ఆశీసులు అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, ప్రస్తుతం సాయిధరమ్ తేజ్, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిరోజు పండుగే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తేజ్ పక్కన రాశీ ఖన్నా నటిస్తున్నారు. వచ్చేడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment