'అవి రెండూ జరగలేదు' | Salman Khan opens up about his sex and marriage life | Sakshi
Sakshi News home page

'అవి రెండూ జరగలేదు'

Published Mon, Aug 8 2016 8:18 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

'అవి రెండూ జరగలేదు'

'అవి రెండూ జరగలేదు'

బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్.. పెళ్లి గురించి ఓపెన్ కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మీడియా పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తనదైన స్టైల్లో సెటైర్లు వేసే   సల్మాన్.. ఈసారి కాస్త ఘాటైన సమాధానం ఇచ్చాడు. సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న 'ఫ్రీకీ అలీ' సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సల్మాన్కు.. మీడియా నుంచి పెళ్లి ప్రశ్నలు మొదలయ్యాయి.

సల్మాన్ స్పందిస్తూ.. వివాహం, శృంగారం..ఆ రెండూ నా జీవితంలో జరుగలేదంటూ సెలవిచ్చాడు. సల్మాన్ సమాధానం విని చుట్టూ నవ్వులు విరిశాయి. 50 ఏళ్ల ఈ బ్యాచిలర్ ఇదివరకు ఓసారి 'నేను వర్జిన్' అనే స్టేట్మెంట్తో వార్తల్లో నిలిచాడు. మరోసారి ఓపెన్గా మాట్లాడి 'టాక్ ఆఫ్ ది డే' అయ్యాడు. గత పదేళ్లుగా సల్మాన్ పెళ్లి బాలీవుడ్లో ఆసక్తికర వార్తగా కొనసాగుతుండడం విశేషం.

సల్మాన్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించిన  'ఫ్రీకీ అలీ' చిత్రం సెప్టెంబరు 9న విడుదల కానుంది. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, అమీ జాక్సన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అతి సాధారణ కుటుంబానికి చెందిన అలీ తన ప్రేమను గెలుచుకోవడం కోసం గోల్ఫ్‌ ఛాంపియన్‌ కావడమే ఈ చిత్ర కథ. సల్మాన్ మరో సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ చిత్రంలో ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement