చిన్న బ్రేక్ తర్వాత వస్తున్నా! | Shwetha basu Prasad coming with new movie mixture potlam | Sakshi
Sakshi News home page

చిన్న బ్రేక్ తర్వాత వస్తున్నా!

Published Sun, Oct 9 2016 11:19 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

చిన్న బ్రేక్ తర్వాత వస్తున్నా!

చిన్న బ్రేక్ తర్వాత వస్తున్నా!

‘‘2016.. నాకు లక్కీ ఇయర్. హిందీలో రెండు సినిమాలు చేస్తున్నా. సెటైరికల్ కామెడీ సినిమా ‘మిక్చర్ పొట్లం’తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నా. స్టడీస్ కంప్లీట్ చేయాలని ఆ మధ్య బ్రేక్ తీసుకున్నా. అందుకే సినిమాలకు చిన్న గ్యాప్ వచ్చింది’’ అని శ్వేతా బసుప్రసాద్ అన్నారు. ఆమెతో పాటు జయంత్ భానుచందర్, గీతాంజలి ముఖ్య తారలుగా యంవీ సతీశ్ కుమార్ దర్శకత్వంలో కలపటపు శ్రీలక్ష్మీ ప్రసాద్, కంటే వీరన్న చౌదరి, లంకపల్లి శ్రీనివాసరావు నిర్మిస్తున్న సినిమా ‘మిక్చర్ పొట్లం’. చిత్రీకరణ పూర్తయింది.
 
నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు సతీశ్ మాట్లాడుతూ - ‘‘చింతామణి, కనక మహాలక్ష్మీ తరహాలో శ్వేతా చేసిన ‘సువర్ణ సుందరి’ పాత్ర చరిత్రలో నిలుస్తుంది. అమలాపురం నుంచి షిరిడీ వెళ్లే బస్సులో ఏం జరిగిందనేది కథ. వినోదంతో పాటు సమాజంలో లోపాలను చూపిస్తున్నాం’’ అన్నారు. ‘‘వినోదం, సంగీతం, సందేశం సహా అన్ని వెరైటీలున్న సినిమా కాబట్టి ‘మిక్చర్ పొట్లం’ టైటిల్ పెట్టాం. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత శ్రీలక్ష్మీ ప్రసాద్. శ్వేతాతో కలసి ఓ ముఖ్య పాత్రలో నటించడం నా అదృష్టమని మరో నిర్మాత లంకపల్లి శ్రీనివాసరావు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: యస్.చిరంజీవి, కెమేరా: కళ్యాణ్ సమి, సంగీతం: మాదవపెద్ది సురేశ్.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement