30 ఏళ్ల తర్వాత కమల్ సినిమాలో...? | Sridevi in Kamal Haasan's Drishyam remake? | Sakshi
Sakshi News home page

30 ఏళ్ల తర్వాత కమల్ సినిమాలో...?

Published Thu, Jul 24 2014 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM

30 ఏళ్ల తర్వాత కమల్ సినిమాలో...?

30 ఏళ్ల తర్వాత కమల్ సినిమాలో...?

పదహారేళ్ల వయసు, ఎర్ర గులాబీలు, వసంత కోకిల తదితర చిత్రాల్లో కమల్‌హాసన్, శ్రీదేవి మధ్య కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెండితెరపై ఈ జంట చేసిన మేజిక్‌ను అంత సులువుగా మర్చిపోలేం. ఈ ఇద్దరూ కలిసి నటించిన చివరి చిత్రం హిందీలో వచ్చిన ‘సద్మా’. అది విడుదలై దాదాపు 30 ఏళ్లయ్యింది. కాగా, ఇన్నేళ్ల తర్వాత కమల్, శ్రీదేవి కలిసి ఇప్పుడు ఓ చిత్రంలో నటించనున్నారట. అయితే, జంటగా కాదు. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘దృశ్యం’ తమిళ రీమేక్‌లో కమల్‌హాసన్ నటిస్తున్నారు. ఇందులో ఐపీఎస్ ఆఫీసర్ పాత్రకు శ్రీదేవిని అడిగారట. శ్రీదేవి భర్త బోనీ కపూర్‌కు ఈ చిత్రకథ, పోలీసాఫీసర్ పాత్ర తెగ నచ్చాయట. ఇక... శ్రీదేవి పచ్చజెండా ఊపడమే ఆలస్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement