ప్లీజ్‌ నాపై సానుభూతి చూపకండి: శ్వేతాబసు | swetha basu prasad interview | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌ నాపై సానుభూతి చూపకండి: శ్వేతాబసు

Published Wed, Jan 7 2015 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

శ్వేతాబసు ప్రసాద్‌

శ్వేతాబసు ప్రసాద్‌

తనపై ఎవరూ జాలిపడాల్సిన అవసరం లేదని టాలీవుడ్‌ తార శ్వేతాబసు ప్రసాద్‌ అంటోంది. రెస్య్యూ హోమ్‌ నుంచి విడుదలైన తర్వాత మానసికంగా మరింత బలపడినట్లు ఆమె చెప్పారు. వివాదాల్లో చిక్కుకున్న శ్వేత ఇప్పుడిప్పుడే తన కేరీర్‌పై దృష్టిసారిస్తోంది.  ప్రస్తుతానికి రూట్స్‌ అనే ఓ క్లాసికల్ మ్యూజిక్‌కు సంబంధించిన డాక్యుమెంటరీపై తాను పనిచేస్తున్నట్లు చెప్పారు.  శ్వేతాబసును ఇటీవల 9Xచానల్‌ ఇంటర్వ్యూ చేసింది.

ఇంటర్య్యూలో చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే...
నేను చాలా బాగున్నాను. బలహీనపడాల్సిన పనేముంది.  ఏం జరిగింది?. ఏ జరగలేదు. జీవితంలో కష్టాలు వస్తుంటాయి. పోతుంటాయి. మనం వాటిని దాటేయాలి. కాలం ఎలాంటి గాయాన్నైనా మరిపిస్తుంది. మీరు నమ్మండి జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలను. ఎప్పుడైతే మీరు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందో, అప్పుడే మీకు నిజమైన పరీక్ష. అప్పుడే మీకు అర్ధమవుతుంది జీవితం ఎంత కష్టమైందో.  ఒక్కసారి  ఆ పరిస్థితి నుంచి మీరు గట్టెక్కితే, ఇక మీరు ఎలాంటి స్థితినైనా ఎదుర్కోగలరు. నేను అలాంటి కష్టాలను దాటి వచ్చానని గర్వంగా చెబుతున్నాను.  ఇప్పుడు నేను ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలను.

నాకు ఎవరి సానుభూతి అవసరం లేదు. ప్రతి ఒక్కరూ నాపై విపరీతమైన సానుభూతిని ఒలకబోస్తున్నారు. నాపై అత్యాచారం జరగలేదు. నేను రేప్‌ విక్టిమ్‌ను కాదు. ప్లీజ్‌ నాపై ఇంతగా సానుభూతిని చూపకండి.  నాకు తెలుసు జరిగిన సంఘటన మంచిదికాదని. అది సాధారణమైన విషయం కాదని కూడా తెలుసు. కానీ నాకు అదో ఎక్స్‌పీరియన్స్. నేను జీవితంలో నేర్చుకున్న అతిపెద్ద గుణపాఠం. ఈ సంఘటనకు సంబంధించి ఎవరిపైనా నేను కోపం పెంచుకోలేదు.

సినిమా ఇండస్ట్రీ చెడ్డదేం కాదు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు సంతోషంగా పలకరిస్తారు. నాతో స్నేహంగా ఉంటారు.   కేరీర్‌పై దృష్టి పెట్టాను.  హన్సిల్ మెహతా ప్రాజెక్టు గురించి ప్రస్తుతం నేనేం మాట్లాడను. ఎందుకంటే ఆయన నాకు ఇచ్చిన సినిమా ఆఫర్‌కు సంబంధించి ఇంకా ఏదీ అఫిషియల్‌ కాలేదు. హన్సిల్‌ మెహతా ప్రాజెక్టు కావచ్చు లేక మరేదైనా, నేను ఆడిషన్స్‌కు హాజరవుతాను. నా సొంత టాలెంట్‌పైనే సినిమా అవకాశాలు సాధించుకుంటాను.

నసీరుద్దిన్‌ షా నాకు ఓ సారి మెసేజ్‌ చేశారు. కోల్‌కతాలో ఆయన చేస్తున్న ఐన్‌స్టీన్‌ అనే షో చూడటానికి రమ్మన్నారు. ఆయన దగ్గర నా ఫ్రెండ్‌ పనిచేస్తుంది. నేను సాధారణంగా అందరితో మరోసారి కలుపుగోలుగా ఉండాలని ఆయన సూచించారట.  నేను కూడా ఇప్పుడిప్పుడే అందరితో కలుస్తున్నాను. రూట్స్‌ అనే డాక్యుమెంటరీపై పనిచేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టు కోసం చాలామంది పెద్ద వ్యక్తులు ఒకే వేదికపైకి వచ్చారు. ముఖ్యంగా నాకు రెక్కలున్న సంగతి వారికి తెలియదు. అందుకే నాలో నేను సంతోషపడుతుంటాను. నన్ను చూసి ఏడిచే వారిపై జాలిపడతాను.
 9X చానల్‌ సౌజన్యంతో

Advertisement
Advertisement