ముంబై: పోషకాహార శాస్త్ర పరిభాషలో ప్రోటీన్లుగా పిలిచే మాంసకృత్తులు భారతీయుల్లు చాలా తక్కువట. ఇందులో మాంసహారాన్ని ముట్టుకునే వారితో పాటు ముట్టని వారి కూడా మాంసకృత్తుల లోపంతో భాదపడుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇందుకోసం ఐఎమ్ఆర్బీ ఆధ్వర్యంలో ప్రొడిజీ నిర్వహించిన సర్వేలో పలు ఆశ్యర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. శాఖాహారుల్లో 91 శాతం మందికి ప్రొటీన్లు తక్కువగా ఉంటే, మాంసాహారాన్ని తీసుకునే వారిలో 85 శాతం ప్రొటీన్ల లోపం ఉన్నట్లు ఆ సర్వే తెలిపింది. దీనికోసం పలు నగరాల్లో 1,260 మంది పరీక్షించారు. వీరిలో అధికశాతం మందికి తగిన స్థాయిలో మాంసకృత్తులు లేవని కుంబల్లా హిల్ హాస్పిటల్ న్యూట్రిషయనిస్ట్ నితీ దేశాయ్ స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే 80 శాతం మందికి ప్రొటీన్లు అత్యల్పంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
ఈ సర్వే కోసం 30 ఏళ్ల వయసు నుంచి 55 ఏళ్ల వరకూ వయసున్నపురుషులను, మహిళలను ఎంపిక చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మన శరీరపు బరువులో కేజీకి బరువుకు ఒక గ్రాము ప్రొటీన్లు ఉండాల్సి అవసరముందని ఈ సందర్భంగా దేశాయ్ తెలిపారు. ప్రొటీన్లు తక్కువగా ఉంటే శరీరం తొందరగా అలసటకు గురవుతుందని ఆయన పేర్కొన్నారు.