డెహ్రాడున్ : కేవలం ఆరు రోజుల్లోనే కరోనాను జయించాడు 9 నెలల చిన్నారి. దేశంలోనే అత్యంత చిన్న వయసులో, అతి తక్కువ సమయంలో కోవిడ్ నుంచి బయటపడినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ ఘటన ఉత్తరాఖండ్లో చోటుచేసుకుంది. కరోనా లక్షణాలతో ఏప్రిల్ 17న హాస్పిటల్ లో చేర్పించగా, కరోనా పాజిటివ్ అని తేలింది. తండ్రి ద్వారా చిన్నారికి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. శిశువు తండ్రి తబ్లీగా జమాత్‌కు వెళ్లి రాగా, కరోనా సోకడంతో ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే చిన్నారి మాత్రం ఆరు రోజుల్లోనే ఈ మహమ్మారి నుంచి బయటపడ్డాడు. 48 గంటల వ్యవధితో రెండుసార్లు కరోనా నెగిటివ్ రావడంతో గురువారం చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. చిన్నారి గురించి ఆసుపత్రి డాక్టర్ ఎన్‌ఎస్ ఖాత్రి మాట్లాడుతూ.. నెలల వయసున్న పసికందు కావడంతో ఈ కేసు ఛాలెంజింగ్‌గా తీసుకున్నామని అన్నారు. చిన్నారి తల్లికి కరోనా సోకలేదు. అయినప్పటికీ చిన్నారితో పాటు తల్లి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నామని డాక్టర్లు వివరించారు. బాగా నువ్వుతూ చలాకీగా ఉంటూ చికిత్సకు సహకరించాడని అయితే, ఎక్కువగా మందులు వాడలేదని పేర్కొన్నారు. చిన్నారి కోలుకోవడం సంతోషంగా అనిపించిదని వైద్యబృందం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment