సాక్షి, న్యూఢిల్లీ: సోనియాగాంధీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే సీనియర్ మంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. జేసీ సమాధానం ఆధారంగా ఆయనపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. గురువారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా? అని అడగ్గా ‘ఆయన సోనియాకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు’ అని చెప్పారు.
కాంగ్రెస్‌కు మతిభ్రమించింది.. జేసీ: పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్న తనకే షోకాజ్ నోటీసు ఇచ్చిందంటే కాంగ్రెస్‌కు మతిభ్రమించిందా? అని జేసీ దివాకర్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. తనకి షోకాజ్ నోటీసులిచ్చామని చెప్పడానికి దిగ్విజయ్ ఎవరని నిలదీశారు.
సోనియాను ధిక్కరించినందుకే జేసీకి షోకాజ్: దిగ్విజయ్
Published Fri, Dec 27 2013 3:35 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement