ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఈరోజు ఇక్కడ చేదుఅనుభవం ఎదురైంది. కేజ్రీవాల్ ప్రెస్‌మీట్ జరుగుతుండగా అన్నాహజారే వర్గీయులు వచ్చి ఇంక్ చల్లారు. కేజ్రీవాల్ వర్గంవారితో గొడవపడ్డారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
మొదట కొందరు వ్యక్తులు ప్రెస్‌మీట్‌లోకి దూసుకు వచ్చారు. అన్నాహజారే పేరును దుర్వినియోగం చేస్తున్నారని వారు నినాదాలు చేశారు. కేజ్రీవాల్ మద్దతుదారులు వారితో ఘర్షణకు దిగారు. తరువాత వారిని బయటకు నెట్టివేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చినట్లుగా నిరసనకారులు చెప్పుకున్నారు.
కేజ్రీవాల్ - అన్నా మద్దతుదారుల మధ్య ఘర్షణ
Published Mon, Nov 18 2013 6:36 PM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement