
కాంగ్రెస్‌తో కలసి పోటీ చేస్తాం: పవార్
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ, కాంగ్రెస్ కలసి పోటీ చేస్తాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. సీట్ల సర్దుబాటు విషయంలో బుధవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశం తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. త్వరలో మహారాష్ర్టలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పొత్తుల విషయంలో రెండు పార్టీల రాష్ట్ర నేతలు కొంతకాలంగా చేసుకుంటున్న పరస్పర విరుద్ధమైన ప్రకటనలకు దీంతో తెరపడింది.