విశాఖపట్నం: భారత ఆస్ట్రేలియా దేశాల యుద్ధ నౌకలు ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో శుక్రవారం విన్యాసాలు ప్రారంభించాయి. ఈ సందర్భంగా పెర్త్‌లోని ఫ్రీమేంట్లే పోర్టులో తూర్పు నావికా దళం చీఫ్ రియర్ అడ్మిరల్ సతీష్‌సోనీ అస్ట్రేలియా నావికాదళ అధికారులతో శుక్రవారం భేటీ అయ్యారు.
ద్వైపాక్షిక ఒప్పందాల బలోపేతంలో భాగంగా ఇరుదేశాల నావికా దళాల యుద్ధనౌకలు విన్యాసాల్లో పాల్గొంటుండగా భారత్ తరపున స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన నౌకలు ఐఎన్‌ఎస్ సత్పురా, కమోర్తాలు పెర్త్ చేరుకున్నాయి. ప్రపంచ దేశాలు లుక్ ఈస్ట్, ఏక్ట్ ఈస్ట్ పాలసీ పట్ల ఆసక్తిగా గమనిస్తున్న తరుణంలో ఈ విన్యాసాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.