శ్రీనగర్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నుంచి గట్టి సవాల్ ఎదురైంది. ఈ నెల 1న జమ్మూలో నిర్వహించిన సభలో ఆర్టికల్ 370పై చర్చ జరగాలని మోడీ చేసిన ప్రకటనపై అబ్దుల్లా మరోసారి మండి పడ్డారు. దీనిపై చర్చించేందుకు తాను సిద్ధమేనని, చర్చా వేదిక ఎక్కడైనా, సమయం ఎప్పుడైనా తాను రెడీగా ఉన్నానని వెల్లడించారు. చివరకు అహ్మదాబాద్ రమ్మన్నా వస్తానని గురువారమిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.