పార్లమెంటుకేది భద్రత.. మరోసారి జరగొద్దు: రాష్ట్రపతి | Prez expresses concern over Parliament complex fire | Sakshi
Sakshi News home page

పార్లమెంటుకేది భద్రత.. మరోసారి జరగొద్దు: రాష్ట్రపతి

Published Sun, Mar 22 2015 7:19 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

పార్లమెంటుకేది భద్రత..  మరోసారి జరగొద్దు: రాష్ట్రపతి - Sakshi

పార్లమెంటుకేది భద్రత.. మరోసారి జరగొద్దు: రాష్ట్రపతి

న్యూఢిల్లీ: భారత పార్లమెంటు భద్రత విషయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటుకేది భద్రత.. తనిఖీల సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.  పార్లమెంటు ఆవరణలో అంత పెద్ద మొత్తంలో మంటలు వ్యాపించడం తనకు తీవ్ర ఆందోళన కలిగించిందని, ఇలాంటి ఘటన జరగడం పార్లమెంటు ఆవరణలో ఉన్న భద్రతను ప్రశ్నించేలా చేస్తుందని అన్నారు.

ఆదివారం మధ్యాహ్నం తర్వాత పార్లమెంటు ఆవరణలోని రిసెప్షన్కు సమీపంలోగల పవర్ స్టేషన్కు చెందిన ఏసీ ప్లాంట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించి భారీ అగ్నిప్రమాదం సంభవించిందిజ. ఈ ఘటనలో ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. కానీ భారీ స్థాయిలో అరగంటపాటు మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.

చివరికి పన్నెండు ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చాయి. దీనిపైనే రాష్ట్రపతి స్పందిస్తూ ఇక నుంచి ప్రతి క్షణం పార్లమెంటు ఆవరణం పకడ్బందీ రక్షణతో ఉండాలని, అణువణువు ఎప్పటికప్పుడూ తనిఖీలు చేస్తుండాలని ఆదేశించారు. మంటలు వ్యాపించడానికి గల కారణాలను శోధించి మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని పార్లమెంటు సిబ్బందికి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement