ఉత్తర్‌ప్రదేశ్ : పరీక్షలు సరిగ రాయకుండా ఎక్కడ ఫెయిల్ అవుతామో అని భయపడిన విద్యార్థులు ఏం చేశారో తెలుసా, సమాధానాలు రాసిన పేపర్‌లో రూ.500, రూ.100 నోట్లు పెట్టారు. పిల్లలు రాసిన సమాధానాలను దిద్ది మార్కులెద్దాం అనుకున్న ఉపాధ్యాయులకు ఆ నోట్లు చూసి దిమ్మతిరిగింది. ఈ డబ్బులు తీసుకుని నన్ను పాస్ చేయండి అంటూ రాసి పేపర్ల మధ్యలో నోట్లు పెట్టారు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన ఇంటర్ విద్యార్థులు. ఇంటర్ బోర్డు పరీక్షల సమాధాన పత్రాల ముల్యాకనంలోనే ఈ వింత చోటు చేసుకుంది.
సరిగ్గా పరీక్షలు రాయకుండా విద్యార్థులు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని ముల్యాకనం చేసే ఉపాధ్యాయులు అంటున్నారు. ఏమీ రాకున్న కాపీ కొట్టి పాస్ అవుతున్న విద్యార్థులున్నారు. కానీ వీళ్లు మాత్రం ఏకంగా ఉపాధ్యాయులనే కొనేద్దాం అనుకున్నారు. ఈ విషయంపై ముల్యాకనం చేస్తున్న ఉపాధ్యాయులు స్పందిస్తూ.. తాము విద్యార్థులకు మెరిట్ ఆధారంగానే మార్కులు ఇస్తున్నామని, ఇలాంటి ట్రిక్స్‌కు, పిచ్చి పనులకు మార్కులు ఇవ్వట్లేదని తెలిపారు. విద్యార్ధులు విద్యపై సరిగ్గా దృష్టి పెట్టకుండా, ఇలాంటి పనులు చేయడం వల్ల ఉత్తీర్ణత సాధించడం సాధ్యం కాదని అన్నారు. ఇప్పటికైనా చదువుపై శ్రద్ధ పెట్టి మంచిగా సమాధానాలు రాసి పాస్ కావాల్సిందిగా కోరుకున్నారు. చాలా నోట్లే వచ్చాయని, కానీ మేము వాటికి అమ్ముడుపోమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment