నంబర్ వన్ స్థానంపై సానియా మీర్జా గురి
నంబర్ వన్ స్థానంపై సానియా మీర్జా గురి
Published Tue, Oct 28 2014 4:18 PM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM
హైదరాబాద్: వచ్చే సీజన్ లో టెన్నిస్ పోటీలలో డబుల్స్ విభాగంలో నంబర్ వన్ స్థానంపై సానియా మీర్జా కన్నేసింది. డబ్ల్యూటీఏ టూర్ టైటిల్ చేజిక్కించుకుని ఈ సంవత్సరాన్ని సానియా దిగ్విజయంగా ముగించుకున్న సంగతి తెలిసిందే. విజయాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అభిమానులు తనను ఎక్కువగా ఆశించారు. అంతేకాకుండా తాను విజయం సాధించాలని కోరుకున్నారు కూడా అని సానియా తెలిపారు. నా లక్ష్యానికి చేరువయ్యాను. ప్రపంచ నంబర్ వన్ స్థానం కోసం ప్రయత్నిస్తాను అని సానియా తెలిపారు.
ఈ సంవత్సరం గ్రాండ్ స్లామ్ ను, ప్రపంచ చాంఫియన్ షిప్ ను గెలుచుకోవడం తన లక్ష్యాల్లో భాగమని అని ఆమె అన్నారు. సింగపూర్ లో జింబాబ్వే క్రీడాకారిణీ కార్లా బ్లాక్ తో కలిసి ఇటీవల డబ్ల్యూటీఏ టూర్ టైటిల్, యూఎస్ ఓపెన్, ఆసియా క్రీడల్లో మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. 2014 సంవత్సరం ఎన్నో మధురానుభూతుల్ని పంచిందని సానియా మీర్జా తెలిపారు.
Advertisement
Advertisement