ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్
సిడ్నీ : కళ్లలో పశ్చాత్తాపం.. తప్పు చేశాననే బాధ.. దాన్ని ఎన్నటికీ దిద్దుకోలేననే మానసిక క్షోభ.. అన్నీ కలసి ఆస్ట్రేలియా మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను శాశ్వతంగా క్రికెట్ నుంచి తప్పుకునేలా చేశాయి. అవును. శనివారం మరోమారు మీడియా ముందుకు వచ్చిన వార్నర్ తన తప్పునకు శిక్షగా జీవితంలో ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడబోవడం లేదని వెల్లడించారు.
ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియాకు రాజీనామా చేసినట్లు ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ చెప్పారు వార్నర్. కుటుంబంతో చర్చించిన అనంతరం క్రికెట్ నుంచి శాశ్వతంగా తప్పుకోవాలనే అంశంపై కూడా నిర్ణయం తీసుకుంటానని వివరించారు. తన ప్రవర్తన సరిగా లేదని దీనిపై నిపుణుల సాయం తీసుకుంటానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment