సాక్షి, హైదరాబాద్: బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు రాణించడంతో ఎ- డివిజన్ రెండు రోజుల లీగ్‌లో సలీమ్‌నగర్ జట్టు ఘనవిజయాన్ని సాధించింది. హెచ్‌బీసీసీ జట్టుపై 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. శుక్రవారం 8/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్‌సను ప్రారంభించిన సలీమ్‌నగర్ జట్టు 48 ఓవర్లలో 246 పరుగులు చేసింది. పుష్కర్ (54), జమీరుద్దీన్ (60) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. హెచ్‌బీసీసీ బౌలర్లలో దాస్, భరత్ 3 వికెట్లు తీశారు.
అంతకుముందు తొలి ఇన్నింగ్‌సలో 184 పరుగులు చేసిన హెచ్‌బీసీసీ జట్టు రెండో ఇన్నింగ్‌సలో 21.3 ఓవర్లలో 77 పరుగులకు ఆలౌటై కేవలం 16 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. సలీమ్‌నగర్ జట్టు రెండో ఇన్నింగ్‌సలో 1.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.
ఇతర మ్యాచ్‌ల వివరాలు..
రోహిత్ ఎలెవన్: 251/4 (తన్మయ్ 86 నాటౌట్, అంకుర్ 76 నాటౌట్); అపెక్స్ సీసీ: 54 (శివకాంత్ 8/20), రెండో ఇన్నింగ్‌స: 34/1
క్రౌన్ సీసీ: 55 (సౌరవ్ కుమార్ 5/20), రెండో ఇన్నింగ్‌స 92/4 (రాజా 40); బడ్డింగ్ స్టార్: 226/4 (సన్నీ 80, భరత్ 50, సంజయ్ 33).
డెక్కన్ బ్లూస్: 125, రెండో ఇన్నింగ్‌స:109 (అఖిలేశ్ 33, ఆబిద్ 6/30); బాలాజీ కోల్‌టస్:114 (సచిన్ కులకర్ణి 4/22, సంపత్ 5/33).
నిజాం కాలేజ్: 225 (అన్వేష్ రెడ్డి 100; సుమిత్ 5/49, కేశవులు 3/40), రెండో ఇన్నింగ్‌స 55/1; నేషనల్ సీసీ: 185 (నరేశ్ 53, ఆకాశ్ సింగ్ 37
నాటౌట్; అక్షయ్ 3/65, అన్వేష్ 4/35).