సూర్యకుమార్ బౌలింగ్ శైలి సందేహాస్పదం
బెంగళూరు: కోల్‌కతా నైట్‌రైడర్స్ పార్ట్‌టైమ్ స్పిన్నర్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ శైలి సందేహస్పదంగా ఉందని ఆన్‌ఫీల్డ్ అంపైర్లు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి చాంపియన్స్ లీగ్ ఫైనల్ తర్వాత అతని బౌలింగ్ యాక్షన్‌కు సంబంధించిన వీడియో ఆధారాలను అంపైర్లు రాడ్ టకర్, ధర్మసేన, ఎస్.రవిలు పరిశీలించారు. బంతులు వేసేటప్పుడు సూర్యకుమార్ తన మోచేతిని పరిమితికి మించి వంచుతున్నాడని నిర్ధారణకు వచ్చారు. దీంతో అతని పేరును ‘వార్నింగ్ జాబితా’లో ఉంచారు. ఇందుకు సంబంధించిన నివేదికను తీసుకున్న తర్వాత బీసీసీఐ నిర్వహించే ఏ మ్యాచ్‌లోనూ సూర్యకుమార్ బౌలింగ్ చేయకూడదు.