హైదరాబాద్: సెయింట్ ప్యాట్రిక్స్ బౌలర్లు సుమిత్ కుమార్ (5/72), శశి కుమార్ యాదవ్ (5/50) విజృంభించినా... బ్యాటింగ్ వైఫల్యంతో జట్టు ఓడిపోయింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో స్వస్తిక్ యూనియన్ 118 పరుగుల తేడాతో సెయింట్ ప్యాట్రిక్స్‌పై గెలిచింది. మొదట స్వస్తిక్ యూనియన్ 234 పరుగుల వద్ద ఆలౌటైంది. మోహిత్ (66) రాణించగా, విజయ్ 35, ఈశ్వర్ 28 పరుగులు చేశారు. సుమిత్, శశిలిద్దరూ ఐదేసి వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన సెయింట్ ప్యాట్రిక్స్ 116 పరుగులకే కుప్పకూలింది.
స్వస్తిక్ బౌలర్లలో శివరుద్ర 5, విజయ్ 3, ఈశ్వర్ 2 వికెట్లు పడగొట్టారు. మరో మ్యాచ్‌లో విశాల్ కృష్ణ శతకంతో మహావీర్ జట్టు 235 పరుగుల తేడాతో ఆల్ సెయింట్స్ హైస్కూల్‌పై జయభేరి మోగించింది. తొలుత మహావీర్ 396 పరుగుల భారీస్కోరు చేసింది. సురేశ్ వికాస్ (91) రాణించాడు. ఆల్‌సెయింట్స్ బౌలర్ ముజ్తాబా మొహమ్మద్ 6 వికెట్లు తీశాడు. తర్వాత బరిలోకి దిగిన ఆల్ సెయింట్స్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులే చేయగల్గింది. సాత్విక్ రెడ్డి (48), శివ (32) మెరుగ్గా ఆడారు. ప్రేమ్ సుందర్ 4, విజేందర్ రెడ్డి 2 వికెట్లు తీశారు.