హైదరాబాద్: ఎ డివిజన్ రెండు రోజుల లీగ్‌లో రోహిత్ ఎలెవన్ బౌలర్ తౌసీఫ్ బంతితో విజృంభించాడు. శుక్రవారం జరిగిన రెండో రోజు ఆటలో 4 వికె ట్లు పడగొట్టి బ్రదర్స్ ఎలెవన్ జట్ల బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ ఎలెవన్ జట్టు 85.5 ఓవర్లలో 8 వికెట్లకు 251 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. ఆరిఫ్ (72), ఆరి్‌ఫ్ మొహమ్మద్ (51) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కుదిగిన బ్రదర్స్ ఎలెవన్ తౌసీ్‌ఫ్ ధాటికి 26 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 41 పరుగులు మాత్రమే చేసింది.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
విశాక సీసీ: 161 (లియాఖత్ హుస్సేన్ 37, సాయి అనూప్ 38; శ్రీకిర ణ్ 6/47); సాయి సత్య: 192/5 (సాయి సందీప్ 82, శివ దత్తా 32; షేక్ ఇబ్రహీం 3/45).
టీమ్‌స్పీడ్: తొలి ఇన్నింగ్స్ 166/9 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్ 104/3 (సాగర్ 86 నాటౌట్);
శ్రీచక్ర: 169/9 డిక్లేర్డ్ (అబ్దుల్ ఖురేషి 88; రన్‌ధీర్ కుమార్ 4/47).
డెక్కన్ వాండరర్స్: 251/9 డిక్లేర్డ్; ఉస్మానియా: 104/9 (ఆశిష్ 48, హర్షవర్ధన్ 15), ఫాలోఆన్ 171/7(సిద్ధాంత్ 47, బరణ్ కుమార్ 36 నాటౌట్; అతుల్ వ్యాస్ 3/22).
న్యూబ్లూస్: 219; అవర్స్ సీసీ: 101/2 (అభిలాష్ 37నాటౌట్, రాజేందర్ 38).
బడ్డింగ్ స్టార్: తొలి ఇన్నింగ్స్ 138, రెండో ఇన్నింగ్స్ 75/1 (జునైద్ 51); శ్రీ శ్యామ్: 226 (సయ్యద్ అలీ 82, వినయ్ 35, మాజిద్ 30; ఈశ్వర్ 4/74).
జైభగవతి: 184/8 డిక్లేర్డ్ (తుషార్ 86; శ్రీవాస్ శుభమ్ 4/46); అపెక్స్ సీసీ: 142/2 (కిష్టారెడ్డి 58, శ్రీవాస్ 65).
ఖల్సా సీసీ: 216/7 (రంజిత్ 40, భవేశ్ 57, జితేందర్ 61, ఓంపాల్ 33; సూర్య తేజ 5/44); మెగా సిటీ: 34/8.