చంద్రశేఖర్‌... మనసు ‘బంగారం’ | Honest auto driver returns passenger's valuables in chittoor | Sakshi
Sakshi News home page

చంద్రశేఖర్‌... మనసు ‘బంగారం’

Published Thu, Dec 1 2016 1:45 PM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

చంద్రశేఖర్‌... మనసు ‘బంగారం’ - Sakshi

చంద్రశేఖర్‌... మనసు ‘బంగారం’

పెళ్లి బృందం పోగొట్టుకున్న బంగారం ఇంటికి తీసుకెళ్లి అప్పగించిన ఆటో డ్రైవర్‌

చిత్తూరు (అర్బన్‌): రోడ్డుపై వంద నోటు కనిపిస్తే ఎంచక్కా జేబులో వేసుకుని వెళ్లిపోయే రోజులివి.. అలాంటిది  తన ఆటోలో మరిచిపోయిన రూ.7 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు భద్రంగా తీసుకెళ్లి సొంతదారుకు అప్పగించి.. ఆందోళనతో ఉన్న పెళ్లి ఇంట సంతోషం వెళ్లివిరిసేలా చేశాడు ఆటో డ్రైవర్‌ చంద్రశేఖర్‌.

చిత్తూరు నగరంలోని మిట్టూరుకు చెందిన ప్రభు, ఝాన్సీ దంపతుల కుమార్తె శ్రీమతికి బెంగళూరులో గురువారం వివాహం. బుధవారం రాత్రి రిసెప్షన్‌. కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ బస్సులో బయల్దేరడానికి సిద్ధమయ్యారు. ఇంతలో పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడికి తయారు చేయించిన 18 సవర్ల బంగారు ఆభరణాలు కనిపించలేదు. శ్రీమతి తల్లితండ్రుల్లో టెన్షన్‌ ప్రారంభమయ్యింది. పోలీసులకు ఫిర్యాదు చేసి ఇంటికి వెనుదిరిగారు. బంధువులందర్నీ బస్సు ఎక్కించి పంపించేశారు. బెంగళూరుకు వెళ్లిన తరువాత బంగారు ఆభరణాలు లేవంటే ఎక్కడ పెళ్లి ఆగిపోతుందో అనే ఆందోళన వారిలో ప్రారంభమైంది.

ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ‘‘సార్‌.. ఈ బ్యాగును మీరు నా ఆటోలో మర్చిపోయారు. ఇదిగో తీçసుకోండి..’’ అంటూ చేతిలో పెట్టాడు. పోయిన ప్రాణం ఒక్కసారిగా లేచివచ్చినట్లయ్యిందికి ప్రభుకు. లక్ష్మినగర్‌ కాలనీకి చెందిన చంద్రశేఖర్‌ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బంగారు ఆభరణాలను తీసుకుని ఆటోలో ఎక్కిన శ్రీమతి తల్లి, బంధువులు ఆ బ్యాగును అందులోనే మరచిపోయారు. ఇంటికి భోజనానికి వెళ్లిన చంద్రశేఖర్‌ బ్యాగు తీసి చూడగా ఆభరణాలు కనిపించాయి. వెంటనే మహిళలు తన ఆటో దిగిన ప్రాంతానికి చేరుకుని వాళ్లకు బంగారు ఆభరణాలు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement