గవర్నర్ చేతుల మీదుగా సాలై యోరం ఆడియో | Rosaiah to release Salaiyoram audio | Sakshi
Sakshi News home page

గవర్నర్ చేతుల మీదుగా సాలై యోరం ఆడియో

Published Wed, Jun 3 2015 2:30 AM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM

గవర్నర్ చేతుల మీదుగా సాలై యోరం ఆడియో

గవర్నర్ చేతుల మీదుగా సాలై యోరం ఆడియో

 సాలైయోరం చిత్ర ఆడియోను రాష్ట్ర గవర్నర్ కే.రోశయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఫోటాన్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సమర్పణలో స్మైలీ పిక్చర్స్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మాత మురుగన్ సుబ్బరాయన్ నిర్మిస్తున్న చిత్రం సాలై యోరం. డాక్టరు సెల్వ తంగరాజన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కె.మూర్తికన్నన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కొత్త నటుడు రాజ్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ఎస్.సేతురామన్ సంగీతం అందించారు.
 
  చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఉద యం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో రాష్ట్ర గవర్నర్ కే.రోశయ్య చేతుల మీదుగా జరి గింది. ఆడియో తొలి సీడీని దర్శకుడు పీ.వాసు, ట్రైలర్ సీడీని తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ మోహన్, నటుడు పాండియరాజ్, నిర్మాత అశోక్ లోదా, తెలుగు ప్రముఖులు తెలుగు తెర అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ సాలైయోరం చక్కని సందేశంతో కూడిన చిత్రమన్నారు. ఇలాంటి వాటిని ఆదరిస్తే ముందు ముందు మంచి చిత్రాలు వస్తాయని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement