సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఖరీఫ్ సీజను ముంచుకొస్తున్నా సబ్సిడీ సోయా విత్తనాల జాడ లేకపోవడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. విత్తుకునే సమయం దగ్గర పడుతున్నా.. విత్తన నిల్వలు జిల్లాకు చేరకపోవడంతో ఈసారి విత్తన పంపిణీలో జాప్యం జరిగే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతులు ఏటా జూన్ మొదటి వారం నుంచి సోయాను విత్తుకుంటారు. ఈసారి వర్షాలు సకాలంలోనే కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అభిప్రాయ పడుతోంది. దీంతో రైతులు విత్తుకునే సమయానికి ఈ విత్తనాలు అందే పరిస్థితి కనిపించడం లేదు.
గత ఏడాది కూడా విత్తన సరఫరాలో వ్యవసాయ శాఖ విఫలమైంది. సకాలంలో విత్తనాలు అందక సోయా రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. సబ్సిడీ విత్తనాలు దొరకక ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరలు వెచ్చిం చి విత్తనాలను కొనుగోలు చేశారు. అధికారులు చొరవ చూపని పక్షంలో రైతులు ఈసారి కూడా ఇబ్బందులే ఎదుర్కొనే అవకాశాలున్నాయి. వి త్తనాలు వేసుకునే అదును దాటిపోయే ప్రమాదముందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కాగా ఎన్నికల కోడ్ అమలులో ఉండటం కారణంగా విత్తన సరఫరాకు టెండర్లు పిలవడం, ధర నిర్ణయంలో జాప్యం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
90 వేల క్వింటాళ్ల కేటాయింపులు
జిల్లాలో ఏటా ఖరీఫ్ సీజనులో సుమారు 3.5 లక్షల హెక్టార్లలో సోయా పంట సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా. గతేడాది పత్తిని వేసుకున్న రైతులు సరైన ధర లభించక తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పత్తిని విక్రయిస్తే సాగు ఖర్చులు కూడా రాలేవు. దిగుబడి పడిపోవడం వంటి కారణాలతో పత్తిని సాగు చేసిన రైతులు ఈసారి సోయా వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయి. దీంతో సోయా విస్తీర్ణం పెరగనుంది. ఈసారి ఖరీఫ్ సీజనుకు 1.05లక్షల క్విం టాళ్ల సోయా విత్తనాలు కేటాయించాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిం ది. అయితే ఈ ప్రతిపాదనలను తగ్గించి కేవలం 90వేల క్వింటాళ్లు మాత్రమే జిల్లాకు కేటాయిం చారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని అకోల, నాందేడ్ నుంచి ఈ సోయా విత్తనాలు వస్తుం టాయి. కాగా ఇప్పటివరకు ఒక్క గింజ కూడా ఈ జిల్లాకు చేరలేదు.
రైతులు ముందుగా పూర్తి ధర చెల్లించాలి..
33 శాతం సబ్సిడీపై సోయా విత్తనాలను సరఫరా చేస్తున్నారు. రైతులు మాత్రం ముందుగా పూర్తి ధర చెల్లించి విత్తనాలు కొనుగోలు చేయా లి. ఆ విత్తనాలను విత్తుకున్నట్లు వ్యవసాయ శా ఖ అధికారులు ధ్రువీకరించాక సబ్సిడీ మొత్తా న్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ధర క్వింటాలుకు రూ.7,800లుగా నిర్ణయించారు. రెండు ఎకరాలున్న రైతులకు ఒక బస్తా (30కిలోలు) వి త్తనాలు సబ్సిడీపై ఇస్తారు. రెండు నుంచి ఐదు ఎకరాలున్న రైతులకు రెండు బస్తాలు, ఐదెకరా ల పైన భూమి ఉన్న రైతులకు మూడు బస్తాల చొప్పున ఈ విత్తనాలను పంపిణీ చేస్తారు. కా గా, జిల్లాలో విత్తన పంపిణీ బాధ్యతలను నాలు గు నోడల్ ఏజెన్సీలకు అప్పగించారు. నిర్మల్, భైంసా వ్యవసాయ డివిజన్లలో ఏపీ సీడ్స్ ద్వారా పంపిణీ చేస్తారు. అలాగే ఉట్నూర్, కాగజ్‌నగర్ డివిజన్లలో హాకా ద్వారా, ఆదిలాబాద్, ఖానాపూర్ డివిజన్లలో ఆయిల్‌ఫెడ్ ద్వారా పంపిణీ చేస్తారు. ఇచ్చోడ, చెన్నూరు డివిజన్లలో పంపిణీ బాధ్యతలను మార్క్‌ఫెడ్‌కు అప్పగించారు.
ఇబ్బంది రాకుండా చూస్తాం..
సోయా విత్తనాలు రైతులకు సకాలంలో అందే లా చర్యలు తీసుకుంటున్నాము. ఈనెల 25వ తేదీ వరకు 50శాతం విత్తనాలు జిల్లాకు తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. విత్తనాలు జిల్లాకు చేరిన వెంటనే పంపిణీకి చర్యలు చేపడతాము. ఎన్నికల కోడ్ కారణంగా కొంత జాప్యం జరిగింది.
సోయా నైఆయా
Published Sat, May 10 2014 3:07 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement