తాండూరు రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో చోటుచేసుకున్న అంతులేని అవినీతి, అవకతవకలు చూసి అధికారులు అవాక్కవుతున్నారు. ఇళ్లను పరిశీలించడానికి వెళ్లిన సీఐడీ అధికారులకు సిమెంటు దిమ్మెలు తప్ప ఇంకేమీ కనిపించకపోవడంతో ఖంగుతింటున్నారు. గత రెండుమూడు రోజులుగా జిల్లాలోని పలు మండలాల్లో సీఐడీ అధికారులు పర్యటిస్తూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నారు.
తాజాగా మంగళవారం బషీరాబాద్, గండేడ్ మండలాల్లో పర్యటించిన అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదులు అందచేశారు. బషీరాబాద్ మండలంలో 21 ఇళ్ల విషయంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. మండల కేంద్రంలోని గోసాయి కాలనీలో పేదలకు స్థలాలు కేటాయించి 21 ఇళ్లు నిర్మించామని చెబుతున్న ప్రదేశానికి సీఐ డీ విభాగం డీఎస్పీ జితేందర్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి చేరుకున్నారు.
అయితే అక్కడ మోకాళ్ల లోతు సిమెంటు దిమ్మెలు మినహాయించి ఇంకేమీ కనిపించకపోవడంతో అధికారులు ఆశ్చర్యానికిలోనయ్యారు. లబ్ధిదారులు, మ ద్యవర్తులు, అధికారులు కుమ్మకై ఈ 21 ఇళ్లకు సంబంధిం చి రూ.2.82 లక్షలు స్వాహా చేసినట్లు తేల్చారు. మధ్యవర్తులు తమ పేర్లపై వచ్చిన బిల్లులు కాజేసి మోసం చేశారని పలువురు లబ్ధిదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో... తవ్వినకొద్దీ అక్రమాలు
Published Tue, Aug 12 2014 11:32 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement