మొక్కలు లేవు! | No plants! | Sakshi
Sakshi News home page

మొక్కలు లేవు!

Published Sat, Jul 16 2016 1:48 AM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM

మొక్కలు లేవు! - Sakshi

మొక్కలు లేవు!

హరితహారానికి మొక్కల కొరత
{పజల్లో ఆసక్తి ఉన్నా సరఫరా
చేయలేని స్థితిలో అధికారులు
యంత్రాంగం నిర్లక్ష్య వైఖరే కారణం
చేతులెత్తేసిన ప్రభుత్వ శాఖలు
{పైవేటు నర్సరీల నుంచి  కొనుగోలుకు నిర్ణయం
షార్టు టెండరు పిలిచిన అటవీ శాఖ

 
 
వరంగల్ :  చెట్ల పెంపకంతోనే మానవాళి మనుగడ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరిట ఊరూరా మొక్కలు నాటే కార్యక్రమం మొదలుపెట్టింది. అన్ని వర్గాల వారు ఉత్సాహంగా హరితహారంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు మించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన వస్తోంది. జిల్లా యంత్రాంగం వైఖరి మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. ప్రజలు అడిగిన మొక్కలు సరఫరా చేయలేని స్థితిలో ఉంది. ఈ నెల 8న మొదలైన హరితహారం కార్యక్రమాన్ని నెలాఖరు వరకు కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కానీ, మొక్కల కొరతతో జిల్లాలో హరితహారానికి అడ్డంకులు మొదలయ్యాయి. ప్రజలు అడిగిన మొక్కలు సరఫరా చేసే పరిస్థితిలో జిల్లా యంత్రాంగం లేదు. ప్రభుత్వ శాఖలు ఆర్భాటంగా చేసిన ప్రకటనలకు, పెంచిన మొక్కలకు పొంతన కుదరడం లేదు. తీవ్రమైన మొక్కల కొరత ఏర్పడింది. అధికారుల సమన్వయంలోపం, క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యంతో వచ్చిన ఈ సమస్యను అధిగమించడం ఇప్పుడు జిల్లా యంత్రాంగానికి పెద్ద సమస్యగా మారింది. ఏ శాఖ ఎన్ని మొక్కలు పెంచిందనే విషయంపై ఒక్కసారి కూడా  తనిఖీ చేయని జిల్లా ఉన్నతాధికారులు.. ప్రస్తుత పరిస్థితిపై ఆందోళనతో ఉన్నారు.

తక్షణం మొక్కలు సేకరించాలని ఆదేశించారు. దీంతో అటవీ శాఖ మొ క్కల కొనుగోలు కోసం టెండర్లు పిలిచింది. దాని మ్మ, జామ, నిమ్మ, కరివేప, పనస మొక్కలు తక్షణం సరఫరా చేసే ప్రైవేట్ నర్సరీలు టెండర్లలో పాల్గొనాలని పేర్కొంది. ఈనెల 19 టెండర్ల ప్రక్రియను పూర్తి చేయనుంది. హరితహారం ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమని తెలిసీ.. అవసరమైన మొక్కలు పెంచలేని అటవీ శాఖ, జిల్లా నీటియాజమాన్య సంస్థ(డ్వామా) తీరుపై విమర్శలు వస్తున్నాయి. అయినా ఈ రెండు శాఖలపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

మొక్కలు ఎక్కడ...
హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 3.44 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయిం చారు. వీటిలో 1.60 కోట్ల టేకు మొక్కలు, 1.40 కోట్ల పండ్ల మొక్కలు, సుమారు 30 లక్షల మల్బరీ మొక్కలు ఉన్నట్లు పేర్కొన్నారు. మామిడి, నిమ్మ, జామ, దానిమ్మ, సీతాఫలం వంటి మొక్కలు 1.40 కోట్లు పెంచినట్లు అధికారులు లెక్కలు చెప్పారు. కొటికి పైగా టేకు మొక్కలు పెంచినట్లు  డ్వామా అధికారులు తెలిపారు. మంత్రులు కడియం శ్రీహరి, జోగు రామన్న, జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అధ్యక్షతన జరిగిన పలు సమీక్ష సమావేశా ల్లో... లక్ష్యం మేరకు మొక్కలు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. హరితహారం మొదలయ్యాక అసలు విషయం బయటపడింది. ప్రజల డిమాండ్‌కు అనువుగా మొక్కలు లేవనే విషయం వెల్లడైంది. దీంతో అటవీ శాఖ, డ్వామా అధికారులు చెప్పిన మొక్కల పెంపకం... కాగితాలపై లెక్కలేనని స్పష్టమైంది. అవసరమైన మొక్కలు లేవని గుర్తించి ముందుగానే ప్రైవేటు నర్సరీల నుంచి సేకరించినా హరితహారం కార్యక్రమానికి ఇబ్బంది ఉండేది కాదని పలువురు అధికారులే అభిప్రాయపడుతున్నారు. ఉన్నతాధికారుల ఉదాసీనత... అటవీ శాఖ, డ్వామా శాఖల నిర్లక్ష్యంతో అన్ని శాఖలపై ఇప్పుడు ప్రజల్లో చులకనభావం ఏర్పడుతుందని అంటున్నారు.
 
అడిగిన మొక్కల్లేవు...
 వర్షాలు కురిసే సమయంలో పండ్ల మొక్కలకు, ఇంటి ఆవరణలో పెంచే పూల మొక్కలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అటవీ శాఖ, డ్వామా అధికారులు చెబున్నారు. డిమాండుకు సరిపడా మొక్కలను పెంచడంలో మాత్రం విఫలమయ్యారు. హరితహారం కార్యక్రమంలో ప్రజలు పూర్తి స్థాయి లో భాగస్వాములు కావడంతో అధికారులు వాస్తవ లెక్కలు వెల్లడించక తప్పడం లేదు. మొక్కల లెక్కల విషయంలో అధికారులు మొదటి నుంచీ కొంత గోప్యం పాటిస్తున్నారని ఆరోపణలు వచ్చారుు. అది ఇప్పుడు బహిర్గతమైంది. జిల్లాతో పాటు కడెం, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల నుంచి అధికారులు మొక్కలు తెప్పించే ప్రణాళికలు రూపొందించినా ఇవేమీ అమలుకు నోచుకోలేదు. మొక్కల తీవ్ర కొరతతో... ముఖ్యమంత్రి, మంత్రుల కార్యక్రమాల కోసం అధికారులు మొక్కలు రిజర్వులో ఉంచుకోవాల్సిన పరిస్థితి  ఏర్పడింది.
 
 
3.44 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. వీటిలో 1.60 కోట్ల టేకు మొక్కలు, 1.40 కోట్ల పండ్ల మొక్కలు, సుమారు 30 లక్షల మల్బరీ మొక్కలు ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ, హరితహారం కార్యక్రమం మొదలయ్యాక.. ప్రజల డిమాండ్‌కు సరిపడా మొక్కలు లేవనే విషయం వెల్లడైంది. అటవీ శాఖ, డ్వామా అధికారులు చెప్పిన మొక్కల పెంపకం... కాగితాలపైనేనని స్పష్టమైంది.
 
 
అనూహ్య స్పందన వచ్చింది
హరితహారం కార్యక్రమంపై ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇప్పటివరకు జిల్లాలో 86 లక్షల మొక్కలు నాటినట్లు వివరాలు అందాయి. ప్రజల డిమాండ్ మేరకు మేం మొక్కలు సరఫరా చేయలేక పోతున్నాం. మాకున్న 13 మంది సిబ్బందితో శక్తికి మించి పనిచేస్తున్నాం. అయినా పూర్తి స్థాయిలో అందించలేకపోతున్నాం. అటవీశాఖ ఆధ్వర్యంలో పెంచే మొక్కలు హైబ్రీడ్ రకాలు కాదు. ఆ మొక్కలు హార్టీకల్చర్ వద్దనే దొరుకుతాయి. డిమాండ్ మేరకు మొక్కల సరఫరా కోసం కలెక్టరు అనుమతితో చర్యలు తీసుకుంటాం.
 - శ్రీనివాస్, డీఎఫ్‌ఓ, హరితహారం జిల్లా కన్వీనర్
 
75 ల క్షల టేకు మొక్కలు
డ్వామా ఆధ్వర్యంలో కోటి టేకు మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటివరకు 75 లక్షల మొక్కలు సరఫరా చేశాం. ఆలస్యంగా నాటిన మరో 17 లక్షల మొక్కలు రెండు వారాల్లో అందుబాటులోకి వస్తాయి. జనగామ ప్రాంతంలో పెంచేందుకు మరో ఆరు లక్షల మొక్కలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో వర్షాలు కురియగానే నాటేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
 - శేఖర్‌రెడ్డి, పీడీ, డ్వామా
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement