పుష్కరస్నానం.. మహాభారం | pushkaralu in 2015 | Sakshi
Sakshi News home page

పుష్కరస్నానం.. మహాభారం

Published Thu, Jul 9 2015 4:13 AM | Last Updated on Sat, Aug 25 2018 5:39 PM

pushkaralu in 2015

కోరుట్ల :  జిల్లాలో ఇబ్రహీంపట్నం వద్ద ప్రవేశించే గోదావరినది కాళేశ్వరం దాకా సుమారు రెండు వందల కిలోమీటర్లు ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, సారంగాపూర్, రారుుకల్, ధర్మపురి, రాయపట్నం, వెల్గటూర్ మండలం కోటిలింగాల, రామగుండం, గోదావరిఖని, కమాన్‌పూర్ మండలం సుందిళ్ల, మంథని, కాళేశ్వరంలలో మొత్తం 36 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఎల్లంపల్లి బ్యాక్ వాటర్‌తో కోటిలింగాల వద్ద మాత్రమే గోదావరినది జలకళ సంతరించుకుంది.
 
 ఇక్కడ కూడా కొత్త పుష్కర ఘాట్లకు మూడు కిలోమీటర్ల దూరంలో నీళ్లున్నారుు. పుష్కర పాత ఘాట్ల దగ్గర దాకా నీళ్లున్నప్పటికీ, అవి ఇరుకుగా ఉండడంతో వాటిని మూసివేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. త్రివేణి సంగమమైన కాళేశ్వరం వద్ద ప్రాణహిత నుంచి వచ్చే వరద గోదావరినదిలో కలుస్తోంది. అరుుతే ఇక్కడ కూడా పుష్కర ఘాట్లకు దాదాపు అరకిలోటరు దూరంలోనే ప్రవాహం ఉంది. పైగా ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలతో గుంతలు ఏర్పడి నీళ్ల దక్కరికి చేరుకోకుండా ఉంది.
 
 ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లోని 15 పుష్కర ఘాట్లకు, రాయికల్, సారంగాపూర్ మండలాల్లో ఉన్న రెండు ఘాట్లకు నీరు చేరలేదు. ప్రముఖ ఫుణ్యక్షేత్రమైన ధర్మపురి పుష్కరఘాట్ల వద్ద ప్రతీ రోజు సుమారు 3-5 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నా.. గోదావరిలో నీరు చేరకపోవడం ఇబ్బందికరంగా తయారైంది. రామగుండం, గోదావరిఖని, మంథనిఘాట్లలోనూ నీటి ఒరవడి లేదు. నిండు గోదావరిలో మదినిండా పవిత్రభావంతో మూడు మునకలేస్తేనే పుష్కర స్నానం పుణ్యం చేకూరుతుందన్నది భక్తుల నమ్మ కం. ఆ నమ్మకంతోనే ఎంతో దూరం నుంచి పుష్కర ఘాట్లకు చేరుకునే భక్తులకు ఆయా ఘాట్లలో నీటివసతి లేకుంటే నిరాశే మిగులుతుంది.
 ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదిలితేనే..
 
 పక్షం రోజుల క్రితం జోరుగా కురిసిన వరుణుడు నేడు ముఖం చాటేయడంతో గోదావరి ప్రవాహ ఝరి జాడ లేదు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. మరో పది రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం లేదు. దీనిని బట్టి చూస్తే గోదావరిలో వరద నీరు చేరి నీటి మట్టం పెరిగే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పుష్కర స్నానాల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించింది. జిల్లాకు సమీపంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల నుంచి గోదావరికి నీటిని మళ్లీంచడానికి కసరత్తు చేస్తోంది.
 
 ఈనెల ఒకటో తేదీన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. అందులో సైతం నీళ్లు లేకపోవడంతో కేవలం అర టీఎంసీ నీళ్లే బాసర దాకా వచ్చారుు. ఎస్సారెస్పీలో 90 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 13 టీఎంసీలు మాత్రమే నీళ్లున్నారుు. దీంతో గేట్లు ఎత్తలేని పరిస్థితి. బాబ్లీకి ఎగువనున్న గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి ఐదు టీఎంసీల నీటిని విడుదల చేస్తే... అవి బాబ్లీ నుంచి ఎస్సారెస్పీ ద్వారా బాసర వద్ద నుంచి జిల్లాలో ప్రవేశించి కొంత మేర నీళ్లొచ్చే అవకాశముంటుంది.
 
  గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు మహారాష్ట్ర సర్కారును కోరాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 3 టీఎంసీల నీళ్లున్నారుు. మొత్తం మీద ఎస్సారెస్పీ నుంచి 3 టీఎంసీలు, కడెం ప్రాజెక్టు నుంచి 2టీఎంసీలు, ఎల్లంపల్లి నుంచి 3టీఎంసీలు.. మొత్తం 7టీఎంసీల నీటిని విడుదల చేసి గోదావరికి జలకళ తెచ్చేందుకు సర్కారు సిద్ధమవుతోంది. అరుుతే మహారాష్ట్ర ప్రభుత్వం గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి 5టీఎంసీల నీళ్లిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో మహా సర్కారు నీటి విడుదలకు ఒప్పుకుంటుందా అన్నది సందేహమే.
 
 షవర్  స్నానాలకు ఏర్పాట్లు
 గోదావరిలో పుష్కర ఘాట్ల దాకా నీళ్లు రానిపక్షంలో షవర్ స్నానాలు ఆచరించేలా ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. ధర్మపురి, కాళేశ్వరంతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఈ షవర్లు ఏర్పాటు చేయనున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ధర్మపురి, కాళేశ్వరంల వద్ద గంటకు 20 వేల మంది చొప్పున షవర్ స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేపట్టనున్నారు. అరుుతే షవర్ స్నానాలు చేసేందుకు భక్తులు అంత ఆసక్తి కనబరుస్తారా అనేది సందేహమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement