
నేడు టీడీపీలో చేరనున్న కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. కొంతకాలంగా టీడీపీలో చేరనున్నట్లు ప్రకటనలిచ్చిన కృష్ణయ్య ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన ప్రజాగర్జన సదస్సులో చంద్రబాబుతో పాటు వేదికపై ఉన్నారు. అయితే బీసీ సంఘాల నాయకులతో కలిసి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు టీడీపీలో చేరాలని ఆయన భావించారు. అందుకే శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు బీసీ సంఘాల నేతలు ‘సాక్షి’కి తెలిపారు.