సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతన్నకు శుభవార్త. విత్తనాల కోసం రోజుల తరబడి వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవస్థలు త్వరలో తప్పనున్నాయి. ఇకపై అవసరమైన విత్తనాలను నేరుగా ఆన్‌లైన్లోనే కొనుగోలు చేయవచ్చు. విత్తనాల కొనుగోలుకు సంబంధించిన రాయితీ డబ్బులు కూడా సదరు రైతు బ్యాంకు ఖాతాలో జమకానున్నాయి. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ జిల్లాలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్లో ముందుగా పచ్చిరొట్ట (భూసారాన్ని పెంచేవి) విత్తనాలను విక్రయించనుంది. కార్యక్రమం విజయవంతమైతే అన్ని విత్తనాలు కూడా ఆన్‌లైన్లో విక్రయించేందుకు చర్యలు తీసుకోనుంది.
మీ సేవ కేంద్రాల ద్వారా...
అన్‌లైన్లో విత్తనాలు కొనుగోలు చేయాలనుకున్న రైతులు ముందుగా సమీపంలోని మీ సేవ, ఈ సేవ కేంద్రాల్లో సంప్రదించాలి. కొనుగోలు చేసే విత్తనాలకు సంబంధించి పూర్తిస్థాయి డబ్బులు చెల్లించడంతో పాటు రైతు బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలి. దాంతో వ్యవసాయ కార్యాలయం నుంచి విత్తనాల స్టాకు తీసుకున్న అనంతరం సదరు రైతు బ్యాంకు ఖాతాల్లో రాయితీ డబ్బులు జమ కానున్నాయి.
ప్రస్తుతం పచ్చిరొట్ట విత్తనాలకు మాత్రమే ఈ సదుపాయాన్ని కల్పించింది. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయితే జిల్లావ్యాప్తంగా వ్యవసాయ శాఖ విక్రయించే అన్ని రకాల విత్తనాలకూ ఇదే పద్ధతిని వర్తింపజేస్తామని జేడీఏ విజయ్‌కుమార్ ‘సాక్షి’తో పేర్కొన్నారు.
ఆన్‌లైన్లో విత్తనాల విక్రయం
Published Sat, May 10 2014 12:24 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement