చూపులు కలిపిన శుభవేదిక | Special introductory venue for the wedding reception | Sakshi
Sakshi News home page

చూపులు కలిపిన శుభవేదిక

Published Mon, May 26 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM

చూపులు కలిపిన శుభవేదిక

చూపులు కలిపిన శుభవేదిక

హూడా కాంప్లెక్స్, న్యూస్‌లైన్: సాక్షి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గౌడ, శెట్టిబలిజ వివాహ పరిచయ వేదికకు అపూర్వ స్పందన లభించింది. కొత్తపేటలోని బాబుజగ్జీవన్‌రావ్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు జంటనగరాల నుంచి భారీ సంఖ్యలో యువతీ, యువకులు వారి తల్లిదండ్రులతో సహా హాజరయ్యారు.   

సాక్షి అడ్వర్‌టైజ్‌మెంట్ డిప్యూటీ మేనేజర్ మహేశ్వర్‌రెడ్డి, ఈవెంట్ మేనేజర్ భరత్‌కిషోర్, ప్రముఖ యాంకర్ క్రాంతిలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వధూవరులు, వారి తల్లిదండ్రులు తమ వివరాలను వేదికపై పంచుకున్నా రు. మధ్యవర్తుల ప్రమేయం, ఎలాంటి ఖర్చులేకుండా పరిచయ వేదికలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

సాక్షి ఆధ్వర్యంలో ప్రత్యేక వైబ్‌సైట్‌ను, జిల్లాల వారీగా పరిచయ వేదికలను ఏర్పాటు చేయాలని వారు సూచించారు. కట్న కానుకలు లేకుండా వివాహం చేసుకుంటామని వరులు ముందుకు వచ్చి పేర్కొనడం అభినందనీయం. మరికొందరు వివాహ వేడుక ఖర్చులు కూడా తామే భరిస్తామని పేర్కొన్నారు.
 
 సాక్షికి కృతజ్ఞతలు...
 సాక్షి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా గౌడ, శెట్టిబలిజ వధూవరుల పరిచయ వేదిక ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మంచి సంబంధం నేరుగా ఎంచుకునే వీలు కల్పించినందుకు సాక్షికి కృతజ్ఞతలు.
 - రాగుల స్వప్న, ప్రైవేటు ఉద్యోగిని
 
 నచ్చిన భాగస్వామిని ఎంచుకోవచ్చు...

 పరిచయ వేదికలో మనసుకు నచ్చిన భాగస్వామిని ఎంచుకోవడం సులభం. సాక్షి ఆధ్వర్యంలో పరిచయ వేదికలు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఇలాంటి పరిచయ వేదికలు మరిన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
 - వంగ శ్రీలత, ఖమ్మం
 
 ఏర్పాట్లు బాగున్నాయి..
 పరిచయ వేదిక ఏర్పాటుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారిని ఒకే చోట నేరుగా కలుసుకునే అవకాశం కలిగింది. ఇరు కుటుంబాల వారి వివరాలు, వాస్తవాలు నేరుగా ఒకే రోజు తెలిశాయి. వేదిక ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ప్రతి మూడు నెలలకొకసారి పరిచయ వేదికలు ఏర్పాటు చేస్తే బాగుటుంది.
 - రాయుడు రాంమోహన్‌రావు, వరుడు తండ్రి
 
 చాలా బాగుంది....
 గౌడ, శెట్టిబలిజ ప్రత్యేకంగా వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం అభినందనీయం. పేద, మధ్య తరగతి ఆర్యవైశ్యులకు ఎంతో ఉపయోగపడుతుంది. సులభంగా మంచి సంబంధం ఎంచుకోవడానికి అవకాశం కల్పించిన సాక్షి యాజమాన్యానికి కృతజ్ఞతలు.
 - పీ.ఎల్.ఎన్.ప్రసాద్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఉప్పల్
 

Advertisement
Advertisement