
సాక్షి, కొత్తగూడెం : అర్జున్‌రెడ్డితో తెలుగు సినిమా రంగంలో సంచలనం సృష్టించి, గీతగోవిందం, ట్యాక్సీవాలా లాంటి సూపర్‌హిట్లతో సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనేది ఉపశీర్షిక. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ షూటింగ్ కొత్తగూడెంలోని కార్మిక ప్రాంతాల్లో గత రెండు రోజులుగా జరుగుతోంది.
సోమవారం చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను రుద్రంపూర్‌లోని సెయింట్ జోసెఫ్స్ పాఠశాల, ధన్‌బాద్‌లలో చిత్రీకరించారు. ఈ షూటింగ్‌లో విజయ్ దేవరకొండ పాల్గొనడంతో ఆయనను చూసేందుకు అభిమానులు, ప్రజలు భారీగా తరలి వచ్చారు. పోలీసు బందోబస్తు మధ్య చిత్ర షూటింగ్ కొనసాగింది. మరో నాలుగైదు రోజులపాటు ఈ చిత్రషూటింగ్ జిల్లాలో జరగనున్నట్లు సమాచారం. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి, యశ్ రంగినేని ఈ సినిమాకు నిర్మాతలు. ఇందులో కన్నడ బ్యూటీ రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు.




Comments
Please login to add a commentAdd a comment