పులికోనలో.. ‘ఆది’ చిత్రం
కడప జిల్లా జమ్మలమడుగు- ముద్దనూరు మార్గంలో ఉన్న పులికోనలో ఆదిమానవుల కాలం నాటి అరుదైన చిత్రం (రాక్ పెయింటింగ్)గుర్తించారు. చుట్టూ దుప్పు లు... వాటి మధ్య నర్తిస్తున్న ఓ మహిళ ఉన్న చిత్రాలు గుట్టలోని పడకరాతిపై కనువిందు కనిపించాయి. ఇది దాదాపు 5 వేల ఏళ్లక్రితం సూక్ష్మ శిలాయుగం నాటిదిగా ఈ చిత్రాలపై అధ్యయనాలు చేసిన పాండిచ్చేరి వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ చంద్రమౌళి తెలిపారు. ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపో కండక్టర్ రామకృష్ణారెడ్డి, కంట్రోలర్ కృష్ణలు ఆ ప్రాంతానికి విధినిర్వహణకు వెళ్లినప్పుడు...
విరామ వేళ పులికోన గుట్టల వద్దకు వెళ్లారు. ఆ సమయంలో గుట్ట రాయి ని పరిశీలించేక్రమంలో ఈ రాక్‌పెయింటింగ్స్ వెలుగు చూశాయి. - సాక్షి, హైదరాబాద్