న్యూయార్క్: శరీరానికి ధరించే సరికొత్త పుస్తకాన్ని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రూపొందించారు. సెన్సర్లతో తయారుచేసిన ‘ది గర్ల్ హూ వజ్ ప్లగ్‌డ్ ఇన్’ పేరిట రూపొందించిన ఈ పుస్తకాన్ని నడుముకు ధరిస్తే చదువుతున్నంత సేపూ, అందులోని పాత్రల మనోభావాలకు అనుగుణంగా, ఇందులోని సెన్సర్లు వైబ్రేషన్లు కలిగిస్తాయి.