మళ్లీ గూగుల్ ఆన్‌లైన్ షాపింగ్ ధమాకా | Google India announces Great Online Shopping Festival 2013, starts December 11 | Sakshi
Sakshi News home page

మళ్లీ గూగుల్ ఆన్‌లైన్ షాపింగ్ ధమాకా

Published Tue, Dec 10 2013 1:29 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM

మళ్లీ గూగుల్ ఆన్‌లైన్ షాపింగ్ ధమాకా - Sakshi

మళ్లీ గూగుల్ ఆన్‌లైన్ షాపింగ్ ధమాకా

హైదరాబాద్: ఇంటర్నెట్ సెర్చి దిగ్గజం గూగుల్ తాజాగా మరోసారి భారీ ఆన్‌లైన్ షాపింగ్ వేడుకలకు తెర తీస్తోంది. ఈ నెల 11 నుంచి 13 దాకా మూడు రోజుల(72 గంటలు) పాటు గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్(జీఎస్‌వోఎఫ్) నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా వివిధ ఉత్పత్తులపై 20-80 శాతం దాకా డిస్కౌంట్లు అందించనుంది. ఈసారి జీఎస్‌వోఎఫ్‌లో 200 పైగా ఈ-కామర్స్ కంపెనీలు పాల్గొంటున్నాయని, భారీ ఆఫర్లు అందించనున్నాయని గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ తెలిపారు. ఆటోమొబైల్ సంస్థలు, ఆన్‌లైన్ ట్రావెల్ సైట్లు, టెలికం తదితర రంగాల కంపెనీలు ఇందులో ఉంటాయన్నారు.  గతేడాది జీఎస్‌వోఎఫ్‌కి మంచి స్పందన లభించడంతో ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నట్లు ఆనందన్ వివరించారు.  
 
 టీవీలపై 50 శాతం దాకా, మొబైల్ ఫోన్లపై 40 శాతం మేర, కంప్యూటర్లు..ట్యాబ్లెట్లపై 45 శాతం దాకా, లగ్జరీ వాచీలపై 60 శాతం దాకా, దేశీ రూట్లలో విమాన టికెట్లపై 20 శాతం దాకా, స్పీకర్లు..హెడ్‌ఫోన్లు వంటి ఉత్పత్తులపై 50 శాతం దాకా డిస్కౌంట్లు లభించగలవని ఆనందన్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా 2 కోట్ల మంది ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారని, వచ్చే కొన్నేళ్లలో ఇది 5 కోట్లకు చేరగలదని పరిశ్రమ వర్గాల అంచనా. ఆన్‌లైన్ షాపింగ్ లావాదేవీలు 2017 నాటికి 16 బిలియన్ డాలర్లకు చేరగలవని అంచనా వేస్తున్నట్లు ఆనందన్ వివరించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement