online retailer
-
మీషో మెగా బ్లాక్‌బస్టర్ సేల్: ఒక్కరోజులోనే....
సాక్షి,ముంబై:పండుగ సీజన్సేల్లో ఫ్యాషన్ రీటైలర్ ‘మీషో’ భారీ అమ్మకాలను నమోదు చేసింది. మొదటి రోజే 88 లక్షల ఆర్డర్లను సాధించింది. దీంతో మీషో అమ్మకాలు 80 శాతం పెరిగాయి.ఒక రోజులో కంపెనీ సాధించిన రికార్డ్ సేల్ అని మీషో తెలిపింది. సాఫ్ట్‌బ్యాంక్ నిధులఅందించే ఆన్లైన్ రిటైలర్మీషో తన ఐదు రోజుల హాలిడే సేల్‌లో మొదటి రోజు దాదాపు 87.6 లక్షల ఆర్డర్లు వచ్చాయని, అమ్మకాలు 80శాతం పెరిగాయని శనివారం వెల్లడించింది. ముఖ్యంగా టైర్ 2, 3 , 4 నగరాల్లో మొదటి రోజు దాదాపు 85శాతం ఆర్డర్లు లభించాయని మీషో ఒక ప్రకటనలో నివేదించింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపడం సంతోషంగా ఉందని తెలిపింది. చీరల నుండి అనలాగ్ వాచ్‌లు, జ్యువెలరీ సెట్లు, మొబైల్ కేసులు, కవర్లు, బ్లూటూత్ హెడ్ఫోన్లు, ఛాపర్లు, పీలర్లను రికార్డ్ వాల్యూమ్లలో కొనుగోలు చేశారని కంపెనీ తెలిపింది. ఫ్యాషన్, బ్యూటీ, వ్యక్తిగత సంరక్షణ, కిచెన్,ఎలక్ట్రానిక్ ఉపకరణాలు లాంటివి తొలి రోజు అత్యధికంగా అమ్ముడైన కేటగిరీలుగా ఉన్నాయట. -
రోజీ.. ఓ ‘వజ్రం’లాంటి శునకం!
లండన్: ఇంగ్లాండ్‌లో అలెన్ బెల్ అనే ఓ మాజీ లారీ డ్రైవర్ పంట పండింది. ఉదయం పూట తన రెండు శునకాలతో కలిసి నడకకు వెళ్లిన అతడికి సుమారు రూ. 12 లక్షల విలువైన వజ్రం దొరికింది. అంతరిక్షం అంచుల దాకా వెళ్లి భూమికి తిరిగి వచ్చిన ఆ వజ్రాన్ని పెంపుడు శునకం రోజీ పసిగట్టడం అసలు విశేషం. వాస్తవానికి బ్రిటన్ ఆన్లైన్ రిటైలర్ కంపెనీ ‘77 డైమండ్స్’ వారు ఆగస్టు 7న ఆ వజ్రాన్ని ఆకాశానికి పంపించారు. ఓ రాడ్‌కు అమర్చి, దానిని ప్యాక్ చేసి హీలియం బెలూన్ ద్వారా నింగికి పంపారు. సుమారు లక్ష అడుగుల పైకి వెళ్లిన తర్వాత హీలియం బెలూన్ పగిలిపోయి పారాచూట్ సాయంతో ఆ వజ్రం తిరిగి కొన్ని గంటలకు భూమిని చేరింది. అయితే, ఆ వ జ్రం ఎవరికి దొరికితే వారే తీసుకోవచ్చని కంపెనీవారు ప్రకటించారు. ఆ వజ్రం లింకన్షైర్లోని 60 మైళ్ల ప్రాంతంలో పడవచ్చని క్లూ కూడా ఇచ్చారు. దీంతో ఎంతో మంది వజ్రం కోసం అన్వేషించారు. లింకన్షైర్లోని బ్రాటిల్బై అనే గ్రామానికి చెందిన 75 ఏళ్ల అలెన్ బెల్ కూడా తన శునకాలు రోజీ, డైలన్లతో కలిసి నడకకు వెళుతూ అన్వేషణ మొదలుపెట్టారు. చివరికి డిసెంబరు 23న ఓ చోట ముళ్ల కంచెలో పారాచూట్‌ను పసిగట్టిన రోజీ దానిని బయటికి లాగి యజమానికి చూపించింది. ప్రస్తుతం ఆ వజ్రాన్ని విక్రయించేందుకు అలెన్ సిద్ధమవుతున్నాడు. -
మళ్లీ గూగుల్ ఆన్లైన్ షాపింగ్ ధమాకా
హైదరాబాద్: ఇంటర్నెట్ సెర్చి దిగ్గజం గూగుల్ తాజాగా మరోసారి భారీ ఆన్లైన్ షాపింగ్ వేడుకలకు తెర తీస్తోంది. ఈ నెల 11 నుంచి 13 దాకా మూడు రోజుల(72 గంటలు) పాటు గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్(జీఎస్వోఎఫ్) నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా వివిధ ఉత్పత్తులపై 20-80 శాతం దాకా డిస్కౌంట్లు అందించనుంది. ఈసారి జీఎస్వోఎఫ్లో 200 పైగా ఈ-కామర్స్ కంపెనీలు పాల్గొంటున్నాయని, భారీ ఆఫర్లు అందించనున్నాయని గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ తెలిపారు. ఆటోమొబైల్ సంస్థలు, ఆన్లైన్ ట్రావెల్ సైట్లు, టెలికం తదితర రంగాల కంపెనీలు ఇందులో ఉంటాయన్నారు. గతేడాది జీఎస్వోఎఫ్కి మంచి స్పందన లభించడంతో ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నట్లు ఆనందన్ వివరించారు. టీవీలపై 50 శాతం దాకా, మొబైల్ ఫోన్లపై 40 శాతం మేర, కంప్యూటర్లు..ట్యాబ్లెట్లపై 45 శాతం దాకా, లగ్జరీ వాచీలపై 60 శాతం దాకా, దేశీ రూట్లలో విమాన టికెట్లపై 20 శాతం దాకా, స్పీకర్లు..హెడ్ఫోన్లు వంటి ఉత్పత్తులపై 50 శాతం దాకా డిస్కౌంట్లు లభించగలవని ఆనందన్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా 2 కోట్ల మంది ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారని, వచ్చే కొన్నేళ్లలో ఇది 5 కోట్లకు చేరగలదని పరిశ్రమ వర్గాల అంచనా. ఆన్లైన్ షాపింగ్ లావాదేవీలు 2017 నాటికి 16 బిలియన్ డాలర్లకు చేరగలవని అంచనా వేస్తున్నట్లు ఆనందన్ వివరించారు.