మోడీని చూసి గర్వ పడుతున్నాను: అద్వానీ
2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ఆపార్టీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ ప్రశంసల వర్షం కురిపించారు. గుజరాత్ లోని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేపట్టిన తొలినేత మోడీ అని అద్వానీ అన్నాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోకసభ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిలో కీలక పాత్ర మోడీదేనని ప్రశంసించారు.
చత్తీస్ గఢ్ లోని కోర్బాలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ ను జాతికి అంకితం చేసిన సందర్భంగా అద్వానీ మీడియాతో మాట్లాడారు. మోడీతోపాటు మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్, చత్తీస్ గఢ్ లో రమణ్ సింగ్ ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి కృషి చేశాడు అని అన్నాడు. మోడీ సాధించిన విజయాలను చూసి తనకు గర్వంగా ఉంది అని అన్నాడు.
మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో అసంతృప్తితో రగిలిపోతున్న అద్వానీ.. మోడీని ప్రశంసించడం ఇదే తొలిసారి.