తండ్రి తిట్టాడని.. భవనంపైనుంచి దూకేశాడు! | Teenager jumps off building after father's scolding | Sakshi
Sakshi News home page

తండ్రి తిట్టాడని.. భవనంపైనుంచి దూకేశాడు!

Published Sat, Aug 22 2015 10:04 PM | Last Updated on Fri, Jul 12 2019 3:31 PM

తండ్రి తిట్టాడని.. భవనంపైనుంచి దూకేశాడు! - Sakshi

తండ్రి తిట్టాడని.. భవనంపైనుంచి దూకేశాడు!

న్యూఢిల్లీ:  కన్నతండ్రి తనను తిట్టాడనే మనస్తాపంతో ఓ బాలుడు నాలుగు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని ఘాజియాపూర్ ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం... ఘాజియాపూర్లో రాహుల్ (18) తన తల్లిదండ్రులతో నివాసముంటున్నాడు.

ఏదో విషయంలో తండ్రి అతన్ని గట్టిగా మందలించాడు. దాంతో మనస్తాపం చెందిన రాహుల్ తాను నివసించే నాలుగు అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు.  ఎత్తైన భవనంపై నుంచి దూకడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.  బాలుడ్ని చికిత్స నిమిత్తం దగ్గరల్లోని ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement