కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ తో వైఎస్ జగన్ భేటీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టంలోని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఆదివారం న్యూఢిల్లీలో రాజ్నాథ్తో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. రాజధాని భూ సమీకరణలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ సందర్బంగా వైఎస్ జగన్ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. జగన్ వెంట ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, అవినాశ్రెడ్డి, మిథున్రెడ్డిలు ఉన్నారు.
ఫిబ్రవరి 23 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన కీలక అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. అందులోభాగంగా ఆ పార్టీ ఎంపీలతో కలసి ఆయన శనివారం న్యూఢిల్లీ చేరుకున్నారు. అలాగే కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సురేష్ ప్రభు తదితరులతో వైఎస్ జగన్ భేటీ అవుతారు.