Bobby Simha
-
'సలార్' నటుడికి కోర్టు నోటీసులు.. కారణం అదే?
ఇతడు తెలుగు నటుడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ మధ్య వచ్చిన 'సలార్' మూవీలోనూ గుర్తుంచుకోదగ్గ పాత్రలో అలరించాడు. ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతా బాగానే ఉందనుకునేలోపు.. ఇతడికి ఆలందూర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో అందరూ షాకయ్యారు. నోటీసులు జారీ చేసేంతలా ఇతడు ఏం చేశాడా అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఆలందూర్కు చెందిన జేఎంఏ హుస్సేన్.. బాబీసింహపై కోటి రూపాయలు పరువు నష్టం దావా వేస్తూ ఆలందూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను బాబీసింహ స్నేహితులమని.. చిన్నప్పుడు కలిసి చదువుకున్నామని పేర్కొన్నారు. జమీర్ కాశీం అనే వ్యక్తి.. తన ద్వారా బాబీసింహకు పరిచయమయ్యారని, అతడు భవన నిర్మాణ రంగంలో ఉన్నారని హుస్సేన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే బాబీసింహ.. కొడైక్కానల్‌లో నిర్మించే భవన నిర్మాణ బాధ్యతలను జమీర్ కాశీంకు అప్పగించారని చెప్పాడు. (ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ రిలీజ్.. ఆ విషయంలో అభిమానులు అసంతృప్తి) అయితే 90 శాతం భవన నిర్మాణ పనులను పూర్తి చేయగా.. అప్పటివరకు అయిన ఖర్చుని బాబీసింహా చెల్లించలేదని.. ఈ వ్యవహారంలో వారిద్దరి మధ్య గొడవ జరిగిందని హుస్సేన్ చెప్పాడు. దీంతో తన తండ్రి.. వాళ్లిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించారని.. కానీ ఆ సమయంలో 77 ఏళ్ల తన తండ్రిని బాబీసింహ బెదిరించారని హుస్సేన్ ఆరోపించారు. గతేడాది సెప్టెంబర్ 27న ప్రెస్ మీట్ పెట్టి మరీ తన గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో బాబీసింహపై తగిన చర్యలు తీసుకోవాలని హుస్సేన్.. ఆలందూర్ కోర్టులో పిటిషన్లో వేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన న్యాయస్థానం.. వివరణ కోరుతూ ప్రముఖ నటుడు బాబీసింహకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది. (ఇదీ చదవండి: చిరంజీవికి 'పద్మ విభూషణ్'.. ఈ అవార్డుతో పాటు ఏమేం ఇస్తారు?) -
ప్రకాశ్ రాజ్, బాబీ సింహాపై స్టాలిన్ ప్రభుత్వం చర్యలు
సౌత్ ఇండియాలో ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్, బాబీ సింహా అక్రమ నిర్మాణాల కేసుకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. కొడైకెనాల్ మున్సిపాలిటీలో అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టారన్న ఆరోపణలపై మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. అక్కడ మధురై బెంచ్ చేపట్టిన విచారణ సందర్భంగా స్టాలిన్ సర్కారు ఈ మేరకు వివరణ ఇచ్చింది. కొడైకెనాల్లో సరైన అనుమతులు లేకుండా, నిబంధనలను ఉల్లంఘించి నటులు ప్రకాష్ రాజ్, బాబీ సింహా బంగ్లా నిర్మిస్తున్నారని గతేడాది సెప్టెంబర్‌లో వివాదం తలెత్తింది. కొడైకెనాల్ కొండ ప్రాంతంలోని రైతుల రాకపోకలు కొనసాగించేన దారిలో వారు ఇల్లు నిర్మించారని అక్కడి రైతులు ఫిర్యాదు చేశారు. నటులు ప్రకాష్ రాజ్, బాబీ సింహా నిబంధనలను ఉల్లంఘించి బంగ్లాలు నిర్మిస్తున్నారని పెతుపర గ్రామాధికారి మహేంద్రన్ ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేశారు. విల్పట్టి పంచాయతీ పరిధిలోని ప్రాంతంలో నటుడు ప్రకాష్ రాజ్ 7 ఎకరాల భూమిని, బాబీ సింహా ఒక ఎకరాన్ని కొనుగోలు చేశారు. నటీనటులిద్దరూ నిబంధనలను ఉల్లంఘించి ఆ భూమిలో బంగ్లా నిర్మిస్తున్నారని ఆయన తెలిపారు. కొడైకెనాల్ వంటి కొండ ప్రాంతాలలో బంగ్లాల నిర్మాణానికి తమిళనాడు బిల్డింగ్ పర్మిట్ నిబంధనల ప్రకారం సరైన అనుమతి పొందాలి. అలాగే కొండ ప్రాంతాలలో ప్రకృతి వైపరీత్యాలను నివారించడానికి భవన నిర్మాణ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం అవసరం. అయితే ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్రకాష్‌రాజ్, బాబిసింహలు పెటుప్పరై ప్రాంతంలో బంగ్లా నిర్మించారని తెలుస్తోంది. ఈ విషయమై ఫిర్యాదు చేసినా.. ఇద్దరూ ప్రముఖ నటులు కావడంతో ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్రమ నిర్మాణాల వల్ల కొండచరియలు విరిగిపడి పెద్ద నష్టం వాటిల్లుతుంది. అలాగే కొడైకెనాల్ పెటుప్పరైలో ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా అధునాతన పరికరాలు ఉపయోగించి రాళ్లను పగలగొట్టినందుకు సరైన ప్రభుత్వ అనుమతి లేకుండా ఆధునిక బంగ్లాలు నిర్మించిన నటులు ప్రకాష్‌రాజ్, బాబీ సింహలపై చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యక్తి ఎస్. మహమ్మద్ జునాథ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇది ఇప్పటికే ఉన్న నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని ఆరోపించారు. ఈ నిర్మాణాల వల్ల సమీపంలోని నివాసాలకు ముప్పు ఏర్పడిందని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణకుమార్, విజయకుమార్ ఈ పిటిషన్‌పై వాదనలు విన్నారు. రెండు భవనాల నిర్మాణ పనులను నిలిపివేసినట్లు న్యాయస్థానానికి తమిళనాడు సర్కారు తెలిపింది. ఇద్దరిపైనా లీగల్ యాక్షన్ ప్రారంభించినట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ వివరణను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు- ప్రకాశ్ రాజ్, బాబీ సింహాపై తీసుకున్న చర్యలకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను జనవరి 9కి వాయిదా వేసింది. -
ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి
బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్‌పాండే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రజాకార్’. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. ఈ సినిమాలోని ‘పోతుగడ్డ మీద..’ పాటను విడుదల చేశారు. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో బాబీ సింహా మాట్లాడుతూ– ‘‘భీమ్స్‌గారి సంగీతం, సుద్దాల అశోక్తేజగారి సాహిత్యంలో ఏదో తెలియని భావోద్వేగం ఉంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో కూడా మేం అంతే భావోద్వేగానికి లోనయ్యాం’’ అన్నారు. ‘‘సుద్దాల అశోక్‌తేజ, భీమ్స్గార్లు ఊరికే ఎమోషన్ కాలేదు. మా పూర్వీకుల చరిత్రలో అంతటి ఆవేదన నిండి ఉంది. భీమ్స్‌గారు పాడిన పాట వింటే పోతుగడ్డ మీద పుట్టిన భూమి బిడ్డల ఆత్మ ఘోషిస్తున్నట్లు ఉంటుంది’’ అన్నారు యాటా సత్యనారాయణ. ‘‘సుద్దాల హనుమంత, జానకమ్మల బిడ్డను కాకుంటే నా పాటలో ఇంత ఎమోషన్ ఉండేది కాదు. రజాకార్ ఉద్యమంలో మా అమ్మా నాన్న పాల్గొన్నారు. స్వాతంత్య్రం కోసం వారు నైజాంకు వ్యతిరేకంగా పోరాడారు. రజాకార్ ఉద్యమంలో ్రపాణాలు కోల్పోయిన కమ్యూనిటీ నుంచి వచ్చిన భీమ్స్ ఉండటం నాకు కలిసొచ్చింది. ఈ తరహా సినిమా తీయాలంటే డబ్బులు ఉంటే సరిపోదు.. ధైర్యం కావాలి. ఆ ధైర్యం గూడూరు నారాయణరెడ్డికి ఉంది’’ అన్నారు సుద్దాల అశోక్‌తేజ. ‘‘మా తాతగారు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. తెలంగాణ సమాజం ఎంత కష్టానికి గురైందో, ఎన్ని కన్నీళ్లను చూసిందో... వారందరి స్వరాలకు నేను స్వరాన్ని సమకూర్చానని చె΄్పాలి’’ అన్నారు భీమ్స్ సిసిరోలియో. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అనుష్య త్రిపాఠి, కొరియోగ్రాఫర్ స్వర్ణ, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్ పోతిరెడ్డి అంజిరెడ్డి పాల్గొన్నారు. -
వాల్తేరు వీరయ్య నటుడు బాబీకి స్నేహితుల నుంచే హత్య బెదిరింపులు!
వాల్తేరు వీరయ్య సినిమాలో సాల్మన్‌సీజర్‌గా చిరంజీవితో పోటీపడి నటించిన బాబీ సింహాకు హత్య బెదిరింపులు వచ్చాయి. వాస్తవానికి అతను తెలుగు వాసి, కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కానీ ఆయన తమళనాట సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా కొడైకెనాల్లో తాను నిర్మించాలనుకుంటున్న ఇంటి నిర్మాణ కాంట్రాక్టర్లే బాబీ సింహాను చంపేస్తామని బెదిరించారు. ఆ కాంట్రాక్టర్లు కూడా బాబీ స్నేహితులే కావడం గమనార్హం. కొడైకెనాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనంతరం బాబీ సింహా మాట్లాడుతూ.. 'కొడైకెనాల్లో నేను ఇల్లు నిర్మించాలని అనుకున్నాను.. కానీ బిల్డింగ్ కాంట్రాక్టర్లు నాసిరకం పద్ధతిలో ఇల్లు నిర్మిస్తున్నారు. తమిళనాట రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తి ఉసేన్.. అతను పరిచయం చేసిన బిల్డింగ్ కాంట్రాక్టర్ జమీర్‌తో నటుడు బాబీ సింహా తన ఇంటి నిర్మాణం కోసం కోటి 30 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందుకు సంబంధించిన మొత్తం డబ్బును ఉసేన్, జమీర్‌లు తీసుకుని అదనంగా రూ. 40 లక్షలు కావాలని ఒత్తిడి చేసి తీసుకున్నారు. (ఇదీ చదవండి: జైలర్ సినిమాను తిరస్కరించిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?) అయినా ఇంటి పని పూర్తి అవ్వలేదు. దీంతో మేము కొడైకెనాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అతనికి రాజకీయ నేపథ్యం కారణంగా పోలీసులు చర్యలు తీసుకోలేదు. దీంతో మేము కోర్టుకు వెళ్లి కేసు వేశాము.' అని బాబీ తెలిపాడు. కానీ ఆ కాంట్రాక్టర్లే తిరిగి బాబీ సింహాపై కేసు పెట్టారు. తమను బాబీ బెదిరించారని కాంట్రాక్టర్లు అయిన ఉసేన్, జమీర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదును పోలీసులు స్వీకరించి కేసు నమోదు చేశారని ఆయన తెలుపుతున్నాడు. తాము మొదట ఫిర్యాదు చేసినప్పుడు పోలీసు శాఖ వారు కేసు తీసుకోలేదు. దీంతో కోర్టుకు వెళ్లి పోలీసుల తీరు గురించి వివరించామని బాబీ తరపున ఉన్న లాయర్ తెలిపారు. దీంతో కోర్టు జోక్యం చేసుకోవడంతో సుమారు 10 రోజుల తర్వాత తమ ఫిర్యాదును వెంటనే స్వీకరించారని ఆయన తెలిపారు. ప్రస్తుతం 58 లక్షల 50 వేల వరకు మాత్రమే వారు ఇంటి నిర్మాణం కోసం ఖర్చు చేశారు. పూర్తి నాసిరకంగా ఇంటిని నిర్మించారు. దీంతో తాము సుమారు 1 కోటి 11 లక్షల 50 రూపాయలు మోసపోయామని నటుడు బాబి సింహా తరపు న్యాయవాది తెలిపారు. తాము మోసపోయిన డబ్బును వారి నుంచి తిరిగి ఇప్పించాలని కోర్టును కోరారు. ఇంత జరుగుతున్నా వారు బాబీని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆయన చెప్పారు 'సినిమాలో మీరు విలన్ కావచ్చు కానీ మేం నిజమైన విలన్లమే' అంటూ నటుడు బాబీ సింహాను ఉసేన్ బెదిరించాడని, వేలచ్చేరి శాసనసభ సభ్యుడు అసన్ మౌలానా కనుసన్నల్లోనే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. -
యువతకు సందేశం
‘‘నేటి యువతకు సందేశం ఇవ్వడానికే ‘రజాకార్’ సినిమా తీశారు. ఇలాంటి చిత్రం తీసే ధైర్యం చేసిన మా డైరెక్టర్ సత్యనారాయణకి థ్యాంక్స్’’ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బాబీ సింహా, వేదిక, అనుశ్రేయ త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో యాటా సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రజాకార్’. సమర్ వీర్ క్రియేషన్స్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను రాజాసింగ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ సినిమా టీజర్ చూస్తేనే ఎంతో కోపం వస్తోంది.. ఇక సినిమా చూస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి’’ అన్నారు. ‘‘తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17 మా సినిమాకి కథా వస్తువుగా మారింది. ఆ రోజు జరిగిన విముక్తి పోరాటంతో ఈ సినిమా తీశాను’’ అన్నారు యాటా సత్యనారాయణ. ‘‘ఈ చిత్రం మన చరిత్ర గురించి అందరికీ తెలియజేస్తుందనుకుంటున్నాను’’ అన్నారు గూడూరు నారాయణ రెడ్డి. -
భావి తరాలకు చరిత్ర తెలియాలి
బాబీ సింహా, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, ప్రధాన పాత్రల్లో యాటా సత్యానారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘రజాకర్’. ఈ సినిమా ΄ోస్టర్ లాంచ్ ఈవెంట్లో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌లో 8, మహారాష్ట్రలో 5, కర్ణాటకలో 3 జిల్లాలు హైదరాబాద్ సంస్థానంగా ఉండేవి. ఇవన్నీ ఓ దేశంగా ఉండాలంటూ బ్రిటిష్ ప్రభుత్వం చట్టాన్ని విడుదల చేసిన కారణంగా నిజాం ప్రభువు స్వతంత్య్ర రాజ్యంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతనికి బలంగా దాదాపు 2 లక్షల మంది రజాకార్స్ సైన్యంగా ఏర్పడి, ఆకృత్యాలు చేశారు. ఈ చరిత్ర భావి తరాలకు తెలియాలి. ఇలాంటి చరిత్రతో రూ΄÷ందిన ‘రజాకర్’ చిత్రాన్ని ్ర΄ోత్సహించాలి’’ అన్నారు. ‘‘ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వస్తే, హైదరాబాద్‌కు వచ్చింది సెప్టెంబరు 17న. ఈ చరిత్ర తెలియజేసే ప్రయత్నమే ఈ సినిమా’’ అన్నారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్. ‘‘రజాకార్’ సినిమా చూడక΄ోతే మన బతుక్కే అర్థం లేదు’’ అన్నారు యాటా సత్యనారాయణ. ‘‘తెలంగాణవాదిగా నా హక్కుగా, భారతీయుడిగా భావించి ఈ సినిమా చేశాను’’ అన్నారు నారాయణ రెడ్డి. -
Konaseema Thugs Review: కోనసీమ థగ్స్ మూవీ రివ్యూ
టైటిల్ : కోనసీమ థగ్స్ నటీనటులు: హ్రిదు హరూన్, సింహ, ఆర్ కె సురేష్, మునీష్ కాంత్, అనస్వర రాజన్, శరత్ అప్పని మరియు తదితరులు నిర్మాణ సంస్థ: హెచ్ ఆర్ పిక్చర్స్ – రియా శిబు దర్శకత్వం: బృంద సంగీతం: శామ్ సి ఎస్ సినిమాటోగ్రఫీ: ప్రీయేష్ గురుస్వామి ఎడిటర్: ప్రవీణ్ ఆంటోనీ విడుదల తేది: ఫిబ్రవరి 24, 2023 ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘థగ్స్’. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘కోనసీమ థగ్స్’ పేరుతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. శేషు(హృదు హరూన్) ఒక అనాధ. కాకినాడ రౌడీ పెద్దిరెడ్డి దగ్గర పని చేస్తుంటాడు. అక్కడే ఓ అనాధాశ్రయంలో ఉంటున్న మూగ అమ్మాయి కోయిల(అనస్వర రాజన్)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదామనుకున్న సమయంలో ఓ హత్య కేసులో అరెస్ట్ అవుతాడు. కాకినాడ జైలులో దొర(బాబీ సింహ), మధు(మునీష్ కాంత్)తో పాటు రకరకాల మనుషులు పరిచయం అవుతారు. వీరందరితో కలిసి జైలు నుంచి పారిపోవడానికి శేషు ఒక ప్లాన్ వేస్తాడు. జైలు గదిలో సొరంగం తవ్వి దాని గుండా పారిపోయేందుకు ప్రయత్నిస్తారు? పోలీసుల కళ్లుకప్పి సొరంగం ఎలా తవ్వారు? చివరికి వాళ్లు తప్పించుకున్నారా? లేక దొరికిపోయారా? అసలు శేషు ఒకరిని ఎందుకు హత్య చేశారు? జైలు సిబ్బంది శేషుని ఎందుకు చంపాలనుకుంటుంది? కోయిల, శేషు కలిశారా లేదా? వీరికి చిట్టి ఎలాంటి సహాయం చేశాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కొన్ని సినిమాలలో ఒక్క పాయింట్ చుట్టే కథ తిరుగుతుంది. చెప్పుకోవడానికి కథ కూడా పెద్దగా ఉండదు. కానీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ.. ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి. ఆ కోవలోకే కోనసీమ థగ్స్ మూవీ వస్తుంది. ఈ మూవీ కథంతా జైలులోనే.. కొద్ది మంది పాత్రల చుట్టే తిరుగుతుంది. ఒక క్రూరమైన వాతావరణం ఉండే జైలు నుంచి తప్పించుకునేందుకు హీరో వేసే ఎత్తులు.. అందుకు అవసరమైతే ఎంత దూరమైనా వెళ్లేలా చేసే పరిస్తితులతో ఆద్యంతం ఆసక్తికరంగా కథను తీర్చిదిద్దారు దర్శకురాలు బృందా గోపాల్. కథను నిదానంగా ప్రారంభించి, ప్రేక్షకులు అయోమయానికి గురికాకుండా నేరేట్ చేయడంలో దర్శకురాలు సఫలం అయ్యారు. అయితే శేషు లవ్‌స్టోరీతో పాటు దొర(బాబీ సింహా) ఎందుకు జైలులో పడ్డారో ప్రేక్షకులకు తెలియడం మినహా ఫస్టాఫ్‌లో ఏమీ ఉండదు. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఎస్కేప్ ప్లాన్‌తో విరామానికి ముందు మాత్రమే కథ వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ సెకండాఫ్ మీద ఆసక్తిని పెంచుతుంది. జైలు నుంచి పారిపోవడానికి హీరో చేసే ప్రతి ప్రయత్నం సినిమాటిక్‌గా కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. కామెడీ, రొమాన్స్ ఉన్నప్పటికీ కథను తప్పుదోవ పట్టించకుండా బృందా రాసుకున్న స్క్రీన్‌ప్లే బాగుంది. యాక్షన్స్ సీన్స్ కూడా చాలా రియలిస్ట్‌గా ఉంటాయి. ఫస్టాఫ్‌ని ఇంకాస్త ఆసక్తికరంగా మలిచి, తెలుగు టైటిల్ విషయంలో కాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే సినిమా ఫలితం మరోస్థాయిలో ఉండేది. ఎవరెలా చేశారంటే.. హీరో హ్రిదు హరూన్‌కి ఇది తొలి సినిమా. అయినా కూడా ఎలాంటి బెణుకు లేకుండా చక్కగా నటించాడు. ఎమోషనల్ సీన్స్‌లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు కానీ యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీశాడు. హీరోగా దొర పాత్రలో బాబీ సింహా జీవించేశాడు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొత్తేమి కాదు. డైలాగ్స్ పెద్దగా లేకున్నా.. బాబీ పాత్ర మాత్రం సినిమాకు ప్లస్ అయింది. ఇక కోయిల పాత్రకు అనస్వర రాజన్ న్యాయం చేసింది. పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో చక్కగా నవ్వించింది. దొంగతనం కేసులో జైలుకు వచ్చిన మధుగా మునీష్ కాంత్ తనదైన కామెడీతో నవ్వించాడు. శరత్ అప్పనితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. శామ్ సి ఎస్ సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. ప్రీయేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ అయింది. ఎడిటర్ ప్రవీణ్ ఆంటోనీ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘వసంత కోకిల’ ట్రైలర్
జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు బాబీ సింహా హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వసంత కోకిల’. రమణన్ దర్శకత్వంలో ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కాశ్మీర హీరోయిన్గా నటించింది. నలభై ఏళ్ల క్రితం కమల్ హాసన్, శ్రీదేవి నటించిన సూపర్ హిట్ టైటిల్ ‘వసంతకోకిల’తో ఈ సినిమా రూపొందుతుండటంతో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పాటలు బాగా ఆకట్టుకున్నాయి. చదవండి: కాంతార 2పై కీలక అప్డేట్ ఇచ్చిన రిషబ్ శెట్టి తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి రీలిజ్ చేశారు. కన్నడ ట్రైలర్‌ను స్టార్ హీరో శివరాజ్ కుమార్ లాంచ్ చేశారు. ఇటీవలే బాబీ సింహ వాల్తేరు వీరయ్య సినిమాలో విలన్‌గా మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆర్య ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఫిబ్రవరి 10న ఈ మూవీ తెలుగుతో పాటు మలయాళం, కన్నడలో విడుదల కానుంది. చదవండి: వచ్చే వారం ప్రభాస్-కృతి సనన్ నిశ్చితార్థం? ట్వీట్ వైరల్ -
వాల్తేరు వీరయ్య విలన్ బాబీ సింహా మనోడే!
సాక్షి, మోపిదేవి (అవనిగడ్డ): వాల్తేరు వీరయ్య సినిమా ఫస్టాఫ్‌లో విలన్ క్యారెక్టర్ చేసిన బాబీసింహాని అందరూ తమిళ నటుడు అనుకుంటున్నారు కాని ఆయన మనోడే... కృష్ణాజిల్లా దివిసీమలో మోపిదేవి మండలం కోసూరివారిపాలెం వాసి. ఈ సినిమాలో చిరంజీవితో పోటీపడి విలన్‌గా మెప్పించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరో స్థాయికి ఎదిగాడు. విక్రమ్ సామి తమిళ అనే చిత్రంలో అద్భుతమైన విలనిజం ప్రదర్శించాడు. హీరో విక్రమ్‌తో పోటీపడి నటించి తమిళ ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాలో సాల్మన్‌సీజర్‌గా చిరంజీవితో పోటీపడి చేసిన నటన బాబీసింహాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కోసూరువారిపాలెం నుంచి కోయంబత్తూర్‌కు... మోపిదేవి మండల పరిధిలోని కోసూరువారిపాలెంకు చెందిన లింగం రామకృష్ణ – కృష్ణకుమారి దంపతుల చిన్న కుమారుడే బాబీసింహా. ఆయన తల్లి కృష్ణకుమారి స్వగ్రామం గూడూరు మండల పరిధిలోని తరకటూరు. బాబీసింహా మోపిదేవి ప్రియదర్శిని స్కూల్లో 4 నుంచి 8వ తరగతి వరకూ చదివాడు. బాబీసింహా తల్లిదండ్రులు వ్యవసాయం చేసేందుకు 1996లో తమిళనాడులోని కోయంబత్తూరుకు వలస వెళ్లారు. బాబీసింహా అక్కడే బీసీఏ చదివాడు. అనంతరం సినీరంగంపై ఉన్న మోజుతో కూర్తుపాత్తరాయ్ యాక్టింగ్ స్కూల్లో మూడు నెలలు నటనలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. షార్ట్‌ఫిలింతో గుర్తింపు 2010లో తొలిసారిగా ది ఏంజల్ అనే షార్ట్‌ఫిలింని బాబీసింహా రూపొందించాడు. ఆయన మొత్తం 9 షార్ట్ ఫిల్మ్ లు తీయగా ‘విచిత్తిరిమ్’ అనే షార్ట్ఫిలింకు 2012లో బెస్ట్ యాక్టర్ ఇన్ లిటిల్షోస్ అవార్డు లభించింది. ఈ బుల్లి చిత్రమే ఆయనకు సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. బాబీసింహా జిగర్తంద చిత్రంలో సహాయనటుడిగా చేసిన నటనకు జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్నాడు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడలో ఇప్పటివరకూ 40 సినిమాల్లో నటించాడు. లవ్ ఫెయిల్యూర్ చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి... 2012లో తమిళ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీరంగ ప్రవేశం చేసిన బాబీసింహా అదే సంవత్సరం తెలుగులో లవ్‌ఫెయిల్యూర్ చిత్రంలో నటించాడు. తరువాత సైజ్‌జీరో, రన్ చిత్రాల్లో నటించాడు. తెలుగు వాడైనా తమిళంలోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. తమిళంలో 28 చిత్రాల్లో నటించగా కో–2, ఉరుమీన్, తిరుత్తి పైయిలే సినిమాల్లో హీరోగా నటించాడు. ఇరైవి, మెట్రో, మురిప్పిరి మనమ్, పాంబుసలై చిత్రాల్లో ఆయన నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు. తమిళంలో ఆయన్ను అభిమానులు సింహా అని ముద్దుగా పిలుచుకుంటారు. మలయాళంలో ఐదు చిత్రాల్లో నటించగా ‘కుమ్మర సంబరియం’ చిత్రం మంచి పేరు తీసుకొచ్చింది. హీరోగా నటిస్తూనే ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించి శభాష్ అనిపించుకున్నారు. 2016లో తోటి నటి రేష్మి మీనన్‌ని వివాహం చేసుకున్నాడు. జన్మభూమిపై ఉన్న మమకారంతో 2017లో ఆయన కుటుంబ సమేతంగా వచ్చి మోపిదేవిలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో పాపకు పుట్టు వెంట్రుకలు మొక్కు తీర్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు కుమారుడికి మోపిదేవిలోనే పుట్టు వెంట్రుకలు తీయించారు. ఈ సందర్భంగా స్వగ్రామమైన కోసూరువారిపాలెంలో శుక్రవారం స్థానికులు ఎడ్లబండిపై ఆయన్ను ఊరేగించి అభిమానం చాటుకున్నారు. సుబ్బారాయుడి సేవలో సినీ నటుడు బాబీసింహా మోపిదేవి(అవనిగడ్డ): స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని బాబీసింహా శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు బుద్దు పవన్‌కుమార్ శర్మ తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఏసీ ఎన్ఎస్ చక్రధరరావు స్వామివారి చిత్రపటం, లడ్డుప్రసాదాలు అందజేశారు. చిరంజీవితో నటించడం మర్చిపోలేని అనుభూతి చదువుకునే రోజుల్లో చిరంజీవిని దగ్గరగా చూడాలని ఆశ ఉండేది. వాల్తేరు వీరయ్య సినిమాలో ఆయనతో కలిసి నటించడం మరుపురాని అనుభూతినిచ్చింది. మోపిదేవిలో చదువుకున్న రోజులు ఇంకా గుర్తొస్తూనే ఉన్నాయి. తమిళ ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ఆదరణ మర్చిపోలేను. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తే మరిన్ని సినిమాలు చేస్తాను. ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్ర చేయాలని ఉంది. –బాబీసింహా, సినీహీరో చదవండి: రెండు రోజుల్లోనే రూ.210 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన పఠాన్ కూతుర్ని హీరోయిన్గా చూడాలనుకున్న జమున -
బాబీ సింహ హీరోగా ‘తడై ఉడై’ సినిమా
సాక్షి, చెన్నై: జాతీయ అవార్డు గ్రహీత నటు డు సింహ కథానాయకుడిగా నటిస్తున్న ‘తడై ఉడై’ చిత్రం మంగళవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నటి మిశా నరాంగ్ నాయికగా నటిస్తున్న ఇందులో ప్రభు, సెంథిల్, రోహిణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రం ద్వారా ఎస్ఎస్ రాజేష్ అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ముద్రాస్ ఫిలిం ఫ్యాక్టరీ, ఆరుద్ర పిక్చర్స్ సంస్థల అధినేతలు పి.రాజశేఖర్, రేష్మి సింహా (సింహా భార్య) కలిసి నిర్మిస్తున్నారు. ఎడ్వెర్ట్ ఛాయాగ్రహణంను, ఆదీప్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వైరముత్తు పాటలు రాస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని యూనిట్ వర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు. బహుభాషా నటుడు సింహ ఈ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయం కావడం, చిత్ర టైటిల్ క్యాచీగా ఉండటంతో ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. రెగ్యులర్ షూటింగ్‌ను 5వ తేదీ నుంచి ప్రారంభించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. -
మూడు భాషల వసంత కోకిల
‘కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని..’ పాట చాలామందికి తెలుసు. కమల్‌హాన్, శ్రీదేవి జంటగా రూపొందిన ‘వసంత కోకిల’ సినిమాలోని ఈ పాట ఇప్పటికీ ఎక్కడోచోట వినపడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాని గుర్తు చేయడానికి కారణం తమిళ నటుడు బాబీ సింహా ‘వసంత కోకిల’ పేరుతో ఓ సినిమాలో నటిస్తున్నారు. నేడు బాబీ సింహా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన లుక్‌ని హీరో రానా విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణ సారథ్యంలో నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రమణన్ పురుషోత్తమ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ సింహాకి జోడీగా కాశ్మీర పర్దేశీ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘‘రొమాంటిక్ థ్రిల్లర్ జానర్‌గా ఈ సినిమా రెడీ అవుతోంది’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: రాజేశ్ మురుగేశన్, కెమెరా: గోపీ అమరనాథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సతీష్ సుందర్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్స్: జె. విద్యా సాగర్, యు. దిలీప్ కుమార్, నిర్మాతలు: రజనీ తాళ్లూరి, రేష్మీ సిం. -
సింహా ఇన్ సేతుపతి ఔట్?
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో ‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత రానున్న చిత్రం ‘పుష్ప’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయిక. ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తారు అల్లు అర్జున్. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి, హిందీ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలు చేస్తారనే వార్త వచ్చింది. ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో విజయ్ సేతుపతి కనిపిస్తారని కూడా వినిపించింది. అయితే విజయ్ సేతుపతి స్థానంలో తమిళ నటుడు బాబీ సింహా కనిపించనున్నారన్నది తాజా టాక్. ‘పుష్ప’ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
‘ఏదైనా జరగొచ్చు’ మూవీ రివ్యూ
టైటిల్ : ఏదైనా జరగొచ్చు జానర్ : డార్క్ కామెడీ హారర్ నటీనటులు : విజయ్ రాజా, బాబీ సింహా, పూజా సోలంకి, సాషా సింగ్, వెన్నెల కిశోర్ సంగీతం : శ్రీకాంత్ పెండ్యాల నిర్మాత : సుదర్శన్ హనగోడు దర్శకత్వం : రమాకాంత్ టాలీవుడ్లో విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేసిన సీనియర్ నటుడు శివాజీ రాజా తనయుడు.. విజయ్ రాజాను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా ఏదైనా జరగొచ్చు. తమిళ నటుడు బాబీ సింహా కీలక పాత్రలో నటించిన ఈ సినిమాతో దర్శకుడిగా రమాకాంత్, సంగీత దర్శకుడిగా శ్రీకాంత్ పెండ్యాలలు పరిచయం అయ్యారు. మరి వీరందరికీ ఈ సినిమా బ్రేక్ ఇచ్చిందా..? కథ : జై (విజయ్ రాజా) తన స్నేహితులతో కలిసి ఈజీగా డబ్బు సంపాదించేందుకు ప్లాన్ చేస్తుంటాడు. ఓ ప్రైవేట్ సంస్థలో రికవరీ ఏజెంట్‌గా చేరిన జైకి శశిరేఖ(పూజ సోలంకి) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే శశితో ప్రేమలో పడ్డ జై, ఆమె ఇబ్బందుల గురించి తెలుసుకొని ఎలాగైన సాయం చేయాలనుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా కాళీ(బాబీ సింహా) అనే రౌడీ దగ్గర క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బు పెట్టి సమస్యల్లో చిక్కుకుంటాడు. కాళీ జీవితంలో ఎవరికీ తెలియని ఓ రహస్యం జై అతని స్నేహితులకు తెలుస్తుంది. జైకి తెలిసిన ఆ రహస్యం ఏంటి..? కాళీ నుంచి జై అతని స్నేహితులు ఎలా తప్పించుకున్నారు? అన్నదే మిగతా కథ. నటీనటులు: ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన విజయ్ రాజా పరవాలేదనిపించాడు. కామెడీ, లవ్ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. కాళీ పాత్రకు బాబీ సింహా సరిగ్గా సరిపోయాడు. సీరియస్ లుక్‌లో మంచి విలనిజం చూపించాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఆయన నటన మరింతగా ఆకట్టుకుంటుంది. బేబీ పాత్రలో నటించిన సాషా సింగ్ నటన కాస్త అతిగా అనిపిస్తుంది. హీరోయిన్గా పూజా సోలంకి లుక్స్ పరంగా ఆకట్టుకున్నా నటనతో మెప్పించలేకపోయింది. సెకండ్ హాఫ్‌లో వెన్నెల కిశోర్ తనదైన కామెడీ టైమింగ్‌తో కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : సూపర్ నేచురల్ పాయింట్‌తో కథను రెడీ చేసుకున్న దర్శకుడు ఆ స్థాయిలో సినిమాను తెరకెక్కించటంలో తడబడ్డాడు. ఆసక్తికరంగా సినిమాను ప్రారంభించినా తరువాత రొటీన్ సన్నివేశాలతో బోర్ కొట్టించాడు. హీరో, అతని ఫ్రెండ్స్ డబ్బు కోసం చేసే ప్రయత్నాలు, లవ్ ట్రాక్ అంత ఆసక్తికరంగా అనిపించవు. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో ద్వితీయార్థంపై ఆసక్తికలిగేలా చేసినా, ఆ టెంపోను కంటిన్యూ చేయలేకపోయాడు. అసలు ట్విస్ట్ రివీల్ అయిన తరువాత కూడా కథనం నెమ్మదిగా సాగుతూ విసిగిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో వెన్నెల కిశోర్ కామెడీ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. హారర్ సినిమాలో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కానీ తొలి ప్రయత్నంలో శ్రీకాంత్ పెండ్యాల తన మార్క్ చూపించలేకపోయాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్ : బాబీ సింహా వెన్నెల కిశోర్ కామెడీ మైనస్ పాయింట్స్ : కథా కథనం సంగీతం లాజిక్ లేని సన్నివేశాలు సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
డూప్‌తో కానిచ్చేశారని, నటుడు ఫిర్యాదు
చెన్నై : అగ్నిదేవి చిత్రంలో తనకు బదులు డూప్‌ను నటింపజేశారని నటుడు బాబీసింహా ఆ చిత్ర దర్శక నిర్మాతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్లితే తిగర్ తండా, నేరం, కరుప్పన్, పేట వంటి చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించిన నటుడు బాబీసింహా. ఆయన తాజాగా అగ్నిదేవి అనే చిత్రంలో నటించారు. దీన్ని జాన్‌పాల్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర హీరో బాబీసింహా అగ్నిదేవి చిత్ర దర్శక నిర్మాతపై సెయింట్ థామస్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. అగ్నిదేవి చిత్రంలో తాను ఐదు రోజులే నటించానని, ఆ తరువాత తనకు చెప్పిన కథ కాకుండా వేరే కథను రూపొందిస్తుండటం, తాను నటించిన సన్నివేశాలను చూపించమని అడగ్గా అందుకు నిరాకరించడం, చిత్రం పేరును అగ్నిదేవి అని మా ర్చడం వంటి సమస్యలతో తానా చిత్రం నుంచి వైదొలగినట్లు పేర్కొన్నారు. చిత్రాన్ని ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించారని, పోస్టర్లలో తన ఫొటోలను వాడుతున్నారని తెలిపారు. తాను నటించని చిత్రంలో తనకు బదులు డూప్‌ను నటింపజేశారని పేర్కొన్నారు. అదే విధంగా దీనికి సంబంధించిన కేసు కోవై సివిల్ కోర్టులో విచారణలో ఉందని, అగ్నిదేవి చిత్ర దర్శక నిర్మాత జాన్‌పాల్‌రాజ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాబీసింహా ఫిర్యాదుతో అగ్నిదేవి చిత్ర దర్శక నిర్మాతపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కమిషనర్ నందంబాక్కం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
వెండితెరకు వేలుపిళ్లై
ఎల్టీటీ వ్యవస్థాపకుడు, నాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ జీవితం ఆధారంగా తమిళంలో దర్శకుడు వెంకటేశ్ ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. ఈ బయోపిక్‌లో ప్రభాకరన్ పాత్రలో తమిళ నటుడు బాబీ సింహా కనిపించనున్నారు. ఆల్రెడీ శ్రీలంకలో జరిగిన సివిల్ వార్ ఆధారంగా ‘నీలమ్’ తెరకెక్కించారు వెంకటేశ్. సెన్సార్ వివాదాలతో ఆ సినిమా విడుదల కాలేదు. ఇప్పుడు ప్రభాకరన్ బయోపిక్ తెరకెక్కించడానికి సిద్ధమయ్యారాయన. ‘రేజింగ్ టైగర్’ పేరుతో రూపొందబోయే ఈ బయోపిక్ రెండు పార్ట్స్‌గా తెరకెక్కబోతోంది. ‘‘ఫస్ట్ పార్ట్‌లో ప్రభాకరన్ స్టూడెంట్‌గా ఉన్నరోజులు, ఆ తర్వాత రెబల్‌గా ఎలా మారాడు? లీడర్‌గా ఎలా ఎదిగాడు? అనేది చూపిస్తాం. సెకండ్ పార్ట్‌లో తమిళ ఈలమ్ కోసం జరిగిన యుద్ధాన్ని చూపించదలిచాం. ప్రభాకరన్‌కు దగ్గర పోలికలు బాబీ సింహాలో చూశాను. ఈ పాత్ర చేయడానికి బాబీ ఎటువంటి సంకోచం వ్యక్తం చేయలేదు’’ అన్నారు దర్శకుడు వెంకటేశ్. -
లేడీ విలన్
‘రోజా, అల్లరి ప్రియుడు, గణేశ్’ సినిమాల్లో ఆకట్టుకున్న మధుబాల గుర్తుండే ఉంటారు. అప్పట్లో హీరోయిన్గా అలరించిన ఆమె ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తున్నారు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో హీరోయిన్ తల్లిగా కనిపించారు. ఈసారి ఏకంగా విలన్‌గా మారబోతున్నారు. బాబీసింహా హీరోగా జాన్‌పౌల్ రాజ్, శ్యామ్ సూర్య రూపొందిస్తున్న తమిళం చిత్రం ‘అగ్ని దేవ్’. ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నారు మధుబాల. ‘‘చాలా రోజుల తర్వాత తమిళ చిత్రంలో యాక్ట్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఈ కొత్త క్యారెక్టర్లో కూడా నా బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను’’ అని పేర్కొ న్నారు మధుబాల. -
రజనీ సినిమాలో మరో విలక్షణ నటుడు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కాలా రిలీజ్‌కు రెడీ అవుతుండగా, రజనీ తరువాత చేయబోయే సినిమా పనులు చకచకా జరిగిపోతున్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఇప్పటికే తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్రలో నటించేందుకు అంగీకరించాడు. రజనీ సరసన హీరోయిన్గా ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్‌ను ఫైనల్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లో మరో నటుడు చేరాడు. కోలీవుడ్‌లో విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న బాబీ సింహా, రజనీకాంత్ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు. కాలా రిలీజ్, ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తయిన తరువాత రజనీ కొత్త సినిమా షూటింగ్‌కు హాజరుకానున్నారు. -
మూడు గెటప్‌లలో విలన్
తమిళ సినిమా : తమిళం, మలయాళం భాషల్లో విలక్షణ నటుడిగా రాణిస్తున్న తెలుగు నటుడు బాబీసింహా. స్వయంకృషితోనే ఎదుగుతున్న నటుడీయన. చిన్న పాత్రల నుంచే విలన్, హీరో స్థాయికి చేరుకున్నారు. జిగర్తండా చిత్రంలో విలక్షణ విలనీయంను ప్రదర్శించి జాతీయ అవార్డును గెలుచుకున్న నటుడు బాబీసింహా. ఆ తరువాత హీరోగా అవతారమెత్తారు. ఉరుమీన్ లాంటి కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించినా ఆయన్ని హీరోగా కంటే విలన్‌గానే ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్న విషయాన్ని గ్రహించి, వారి అభీష్టానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. అంతే మళ్లీ నటుడిగా బిజీ అవుతున్నారు. ప్రస్తుతం విక్రమ్ హీరోగా నటిస్తున్న సామి స్క్వేర్ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. ఇది గతంలో విక్రమ్ నటించిన సామి చిత్రానికి కొనసాగింపు అన్నది తెలిసిందే. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీసురేశ్ నాయకి. పులి, ఇరుముగన్ చిత్రాల నిర్మాత శిబుతమీన్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో బాబీసింహా మూడు గెటప్‌లలో కనిపించనున్నారట. దర్శకుడు హరి చిత్రంలో విలన్ పాత్రలు చాలా శక్తివంతంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. సామి చిత్రంలో కోటాశ్రీనివాసరావు విలన్‌గా నటించారు. ఆ చిత్రంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అదే విధంగా సామి స్క్వేర్ చిత్రంలో బాబీసింహా పాత్ర చాలా బలమైందిగా ఉంటుందట. ఈయన నటిస్తే బాగుంటుదనే దర్శక నిర్మాతలతో పాటు నటుడు విక్రమ్ కూడా బాబీసింహాను సంప్రదించారు. సామి స్క్వేర్ చిత్రం తరువాత బాబీసింహా మరోసారి విలన్‌గా బిజీ అయిపోతారంటున్నారు ఆ చిత్ర వర్గాలు. -
ఆ సీన్లలో ఆయన సిగ్గుపడ్డారు.. నేను కాదు!
సాక్షి, సినిమా: నటి అమలాపాల్ మైనా చిత్రంలో కొండవాసిగా నిండుగా దుస్తులు ధరించి నటించి అందరినీ ఆకట్టుకుంది. అంతకు ముందు చిందూ చమవెలి చిత్రంలో మేనమామతో వివాహేతర సంబంధం పెట్టుకుని అందాలు ఆరబోసి వివాదాల్లో చిక్కుందన్న విషయం తెలిసిందే. కాగా మధ్యలో దైవతిరుమగళ్ లాంటి కొన్ని చిత్రాలలో గ్లామర్ విషయంలో కాస్త ఆచితూచి నటించినా తాజాగా మళ్లీ తన గ్లామర్ ప్రతాపాన్ని తిరుట్టుప్పయలే -2 చిత్రంలో చూపింది. బాబిసింహా, ప్రసన్న నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ సంస్థ సుశీగణేశన్ దర్శకత్వంలో నిర్మించింది. ఈ చిత్రం గురువారం తెరపైకి రానుంది. ఇందులో బాబీసింహా పోలీస్ అధికారిగా నటించారు. ఆయనది ఇతరుల సంభాషణలను ఫోన్ ట్రాప్ చేసి విని వారిని బ్లాక్మెయిల్ చేసే పాత్ర అని తెలిసింది. ఇది వివాహేతర సంబంధాల కారణంగా ఎదురయ్యే సమస్యలను ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందట. ఇందులో బాబీసింహా, అమలాపాల్ ల రొమాంటిక్ సన్నివేశాలు మోతాదు మించి ఉంటాయని ప్రచారం జోరందుకుంది. దీనిపై అమలాపాల్ మాట్లాడుతూ.. తిరుట్టుప్పయలే -2 చిత్రంలో రొమాన్స్ సన్నివేశాలలో నటించడానికి బాబీసింహా కాస్త బిడియపడ్డారు గానీ, నేను మాత్రం ఎలాంటి సంశయం లేకుండా నటించానని చెప్పింది. ఈ సన్నివేశాల్లో నటించినందుకు తనకు ఇంత ప్రచారం వస్తుందని ఊహించలేదంటోంది. మూవీ చూసిన తర్వాత ప్రేక్షకులు అమలాపాల్ గ్లామర్ నటనకు ఎలా రియాక్ట్ అవుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. -
ప్రతి ఒక్కరిలో ఓ దొంగోడు..!
‘‘అందరి అమ్మాయిల్లాగే ఆ అమ్మాయికి జీవితంపై మంచి కలలు, ఆశలు, కోరికలు ఉంటాయి. సోషల్ మీడియా కారణంగా ఆ అమ్మాయి జీవితం ఎలా మారింది? అన్నదే ‘దొంగోడొచ్చాడు’ కథాంశం’’ అని కథానాయిక అమలాపాల్ అన్నారు. బాబీ సింహా, అమలాపాల్, ప్రసన్న ముఖ్య పాత్రల్లో ‘మల్లన్న’ ఫేమ్ సుశీ గణేశన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘తిరుట్టుపయలే 2’. కల్పాతి ఎస్.అఘోరమ్ సమర్పణలో కల్పాతి ఎస్. అఘోరమ్, కల్పాతి ఎస్.గణేశ్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మాతలు. ఈ సినిమాని ‘దొంగోడొచ్చాడు’ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకరులతో మాట్లాడారు. అమలాపాల్ మాట్లాడుతూ– ‘‘చాలారోజుల తర్వాత మళ్లీ టాలీవుడ్‌కి రావడం హ్యాపీ. సుశీగారితో ఏడాదికి ఒక సినిమా అయినా చేయాలనుంది. ఆయనతో సినిమా చేస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. విద్యాసాగర్‌తో మలయాళంలో పనిచేసిన రెండు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘సోషల్ క్రైమ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. తమిళంలో ఈ సినిమా నవంబర్ 30న విడుదలవుతోంది. డిసెంబరు రెండో వారంలో తెలుగులో విడుదలవుతుంది’’ అన్నారు బాబీ సింహా. ‘‘అవకాశం రావాలే కానీ.. ప్రతి ఒక్కరిలో ఓ దొంగోడు ఉంటాడు. అలాంటి మనిషి నైజాన్ని చూపించే సినిమా ఇది’’ అన్నారు సుశీ గణేశన్. నటుడు ప్రసన్న, సంగీత దర్శకుడు విద్యాసాగర్ పాల్గొన్నారు. -
మళ్లీ విలన్‌గా బాబీ?
కోలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న నటుల్లో బాబీసింహా ఒకరని చెప్పవచ్చు. లఘు చిత్రాలతో నట జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తరువాత వెండితెరకు పరిచయమయ్యారు. మొదట్లో ప్రతి నాయకుడిగా నటించి గుర్తింపు పొందారు. జిగర్తండా చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకుగానూ జాతీయ అవార్డును గెలుచుకున్న బాబీసింహా ఆ తరువాత కథానాయకుడిగా అవతారమెత్తారు. అయితే హీరోగా పెద్దగా సక్సెస్ కాలేకపోయారనే చెప్పాలి. ప్రస్తుతం బాబీసింహా తిరుట్టుప్పయలే 2, వల్లవనుక్కు వల్లవన్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. వీటిలో వల్లవనుక్కు వల్లవన్ చిత్రానికి ఆయనే నిర్మాత. ఈ యువ నటుడు మళ్లీ విలన్ వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న కరుప్పన్ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించడానికి అంగీకరించినట్లు తెలిసింది. అదే విధంగా హరి దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటించనున్న సామి-2లో ప్రతినాయకుడిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. అయితే ఇందులో విలన్‌గా నటించడానికి బాబీసింహా భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు, అంత పారితోషికం ఇవ్వడానికి దర్శకుడు సుముఖంగా లేరని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత అన్నది త్వరలోనే తెలుస్తుందనుకోండి. మొత్తం మీద బాబీ విలన్‌గా మరోసారి తన సత్తా చాటనున్నారన్న మాట. -
'మెట్రో' మూవీ రివ్యూ
టైటిల్ : మెట్రో జానర్ : క్రైం థ్రిల్లర్ తారాగణం : శిరీష్, బాబీ సింహా, సేంద్రయన్, సత్య, తులసి సంగీతం : జోహన్ దర్శకత్వం : ఆనంద కృష్ణన్ నిర్మాత : సురేష్ కొండేటి, రజనీ తల్లూరి ప్రేమిస్తే, జర్నీ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన సురేష్ కొండేటి మరో తమిళ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం మెట్రో నగరాల్లో జరుగుతున్న చైన్ స్నాచింగ్ ఉదంతాల నేపథ్యంలో ఆనంద కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన మెట్రో తమిళ నాట సంచలనం సృష్టించింది. ఏఆర్ మురుగదాస్, గౌతమ్ మీనన్ లాంటి స్టార్ డైరెక్టర్ల ప్రశంసలు అందుకున్న మెట్రో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా..? కథ : ఆది కేశవ్( శిరీష్), సంతోషం పేపర్లో రైటర్‌గా పనిచేస్తుంటాడు. అమ్మ, నాన్న, తమ్ముడు ఇదే ఆది.. ప్రపంచం. చిన్నప్పటి నుంచి ఉన్నదాంట్లోనే సంతృప్తి పడాలనే మనస్థత్వం ఆదిది. చిన్న ఉద్యోగం చిన్న జీతం.. అయినా అప్పులు లేకుండా ఉంటే హాయిగా నిద్రపడుతుందన్న తండ్రి మాటను ఫాలో అవుతుంటాడు. కానీ ఆది తమ్ముడు, మధు(సత్య) మాత్రం రిచ్‌గా బతకాలనుకుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్‌ను కాస్ట్లీ బైక్ మీద షికారుకు తీసుకెళ్లాలని, ఐఫోన్ చేతిలో పట్టుకొని తిరగాలని కలలు కంటుంటాడు. మధు కోరికను ఆసరాగా తీసుకున్న ఫ్రెండ్స్ అతన్ని తప్పుదోవ పట్టిస్తారు. అప్పటి వరకు ఫ్యామిలీ తప్ప మరో ద్యాస లేని మధు, ఫ్రెండ్స్‌తో కలిసి చైన్ స్నాచర్‌గా మారతాడు. గుణ(బాబీ సింహా) అనే గ్యాంగ్ స్టర్ గ్యాంగ్లోతో కలిసి ప్లాన్డ్గా చైన్స్ స్నాచింగ్‌లు చేస్తుంటాడు. అయితే తాము కష్టపడి కొట్టుకొస్తే గుణ ఎక్కువ షేర్ తీసుకోవటం మధుకు నచ్చదు. అందుకే తనతో పాటు చైన్స్ స్నాచింగ్ పాల్పడే వారితో కలిసి సొంతంగా ప్లాన్ చేసుకొని దొంగతనాలు చేయటం ప్రారంభిస్తాడు. అలా తప్పుదారిలోకి అడుగుపెట్టిన మధు జీవితం చివరకు ఏమైంది. మధు కారణంగా ఆది జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్నదే మిగతా కథ. నటీనటులు : ఆది పాత్రలో శిరీష్ మంచి నటన కనబరిచాడు. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపిస్తూనే తన తల్లి చావుకు పగ తీర్చుకునే హీరోయిజం చూపించాడు. ముఖ్యంగా తెలుగు వారికి దగ్గరయ్యే ఫీచర్స్ శిరీష్‌కు ప్లస్ పాయింట్. సినిమాకు కీలకమైన మధు పాత్రలో నటించిన సత్య నిరాశపరిచాడు. లుక్స్ పరంగా కూడా సత్య ఆ పాత్రకు సరిపోలేదు. హీరోయిన్గా నటించిన రమ్య పాత్ర కేవలం రెండు మూడు సీన్లకే పరిమితమయ్యింది. సినిమా మొత్తం మీద తెలుగు వారికి పరిచయం ఉన్న ఒకే ఒక్క నటి తులసి. ఆమె హీరో తల్లిగా తనకు అలవాటైన పాత్రలో ఆకట్టుకుంది. గ్యాంగ్ స్టర్ పాత్రలో బాబీ సింహా మరోసారి మెప్పించాడు. సాంకేతిక నిపుణులు : క్రైం థ్రిల్లర్ కథాంశాన్ని ఎంచుకున్న దర్శకుడు ఆనంద కృష్ణన్, అందుకు కావాల్సిన గ్రౌండ్ వర్క్ చాలా బాగా చేశాడు. ముఖ్యంగా చైన్స్ స్నాంచింగ్ చేసేవాళ్ల ఆలోచనలు.. వాళ్లు బంగారాన్ని ఎలా మారుస్తారు, అన్న అంశాలను చాలా డిటెయిల్డ్గా చూపించాడు. అదే సమయంలో నేటి యువతరం తప్పుడు మార్గాలకు ఎందుకు ఆకర్షింపబడుతుందో కూడా సింపుల్ సీన్స్‌తో వివరించాడు. దర్శకుడు రాసుకున్న కథను అంతే ఎఫెక్టివ్‌గా తెర మీద చూపించాడు సినిమాటోగ్రాఫర్ ఉదయ్ కుమార్. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్‌లో చేసిన సీన్స్ చాలా బాగా వచ్చాయి. జోహన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమా స్థాయిని పెంచాడు. తెలుగు డబ్బింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథా కథనం బాబీ సింహా క్యారెక్టర్ మైనస్ పాయింట్స్ : స్లో నారేషన్ మధు పాత్ర చేసిన సత్య - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
గొలుసు దొంగల కథతో...
ప్రస్తుతం సిటీల్లో జరుగుతున్న గొలుసు దొంగతనాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మెట్రో’. శిరీష్, బాబీ సింహా, సేంద్రన్, నిషాంత్ ముఖ్య పాత్రల్లో ఆనంద కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో హిట్ అయింది. ఈ చిత్రాన్ని సురేశ్ కొండేటి సమర్పణలో ఆర్ 4 ఎంటర్టైన్మెంట్ పతాకంపై రజని రామ్ తాళ్లూరి ‘మెట్రో’ పేరుతో మార్చి 3న తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో శర్వానంద్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ హిట్ అవ్వాలి. యూనిట్‌కు మంచి పేరు, డబ్బులు తీసుకురావాలి’’ అన్నారు. సురేశ్ కొండేటి మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్, విశాఖపట్నం వంటి మెట్రో నగరాల్లో గొలుసు దొంగతనాల వార్తలు వింటూనే ఉన్నాం. స్నాచర్లు గొలుసులు తెంచుకుపోవడం ఒక్కోసారి మహిళల ప్రాణాల మీదకు తెస్తోంది. ఇటువంటి వాస్తవ సంఘటనలను దర్శకుడు తెరపై చక్కగా ఆవిష్కరించారు. యువ గాయని గీతామాధురి మా చిత్రంలో నటిస్తుండటం విశేషం. ఏ.ఆర్. మురుగదాస్, గౌతమ్ మీనన్ వంటి ప్రముఖ దర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం, తెలుగులోనూ హిట్ అవుతుందనే ధీమాతో ఉన్నాం’’ అన్నారు. -
మార్చి 3న 'మెట్రో' రిలీజ్
ప్రేమిస్తే, జర్నీ, పిజ్జా లాంటి బ్లాక్‌బస్టర్ లను అందించిన ఆర్ 4 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన సినిమా 'మెట్రో'. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న దొంగతనాలు దోపిల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్‌కు, స్టిల్స్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రముఖ గాయని గీతామాధురి అతిథి పాత్రలో నటిస్తుండటం సినిమా మీద మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది. గౌతమ్ మీనన్, ఏ.ఆర్.మురుగదాస్ లాంటి దర్శకులు చిత్ర టైలర్‌ను చూసి యూనిట్ సభ్యులను అభినందించారు. అన్ని ప్రముఖ నగరాలు ఎదుర్కొంటున్న సమస్య నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావటంతో తెలుగులో నేటివిటి సమస్య కూడా ఉండదన్న నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్. శిరీష్, బాబీ సింహా, నిశాంత్ ప్రదాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకు ఆనంద కృష్ణన్ దర్శకుడు. తమిళ నాట 2016 జూన్‌లో రిలీజ్ అయి మంచి విజయం సాధించిన ఈ సినిమాను సురేష్ కొండేటి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.మార్చి 3న రిలీజ్‌కు రెడీ అవుతున్న మెట్రో, ఆర్ 4 ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోమరో సక్సెస్ ఫుల్ చిత్రమవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
ఆగస్ట్ రెండో వారంలో వల్లవనుక్కుమ్ వల్లవన్
జిగర్తండా చిత్రంలో అసాల్ట్ సేతు పాత్రలో అదరగొట్టి జాతీయ అవార్డును కైవసం చేసుకున్న నటుడు బాబీసింహా. అదే విధంగా ఇటీవల తెరపైకి వచ్చి మంచి ప్రేక్షకాదరణ పొందిన కో-2, ఇరైవి చిత్రాలతో తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరైన బాబీసింహా తాజాగా నిర్మాతగా అవతారమెత్తి, కథానాయకడిగా నటిస్తున్న చిత్రం వల్లవనుక్కుమ్ వల్లవన్. తన అసాల్ట్ ప్రొడక్షన్స్ సంస్థ శ్రీతేనాండాళ్ ఫిలింస్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నెడుంశాలై చిత్రం ఫేమ్ షివత, పూజా దేవారియా నాయకిలుగా నటిస్తున్నారు. ముఖ్య పాత్రలో కరుణాకరన్ నటిస్తున్న ఈ చిత్రం ద్వారా విజయ్ దేసింగు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో బాబీసింహా 11 గెటప్‌లలో కనిపించనున్నారట. అదే విధంగా సుమారు 15 ఏళ్ల తరువాత చెన్నై శివారు ప్రాంతం పులికాట్ లేక్ సమీపంలో చిత్రీకరణ జరుపుకున్న చిత్రం వల్లవనుక్కుమ్ వల్లవన్ చిత్రం అని యూనిట్ వర్గాలు తెలిపారు.ఆ ప్రాంతంలో చివరిగా షూటింగ్ జరుపుకున్నది అజిత్ నటించిన సిటిజన్నే నట. ఇలా పలు ప్రత్యేకతలతో కూడిన వల్లవనుక్కుమ్ వల్లవన్ చిత్ర టీజర్‌ను ఆగస్ట్ రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు.