Kichcha Sudeep
-
విలన్‌గా సునీల్ ఎంట్రీ.. టీజర్ అదిరిపోయింది!
రాజమౌళి ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్. ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో మ్యాక్స్ మూవీలో నటిస్తున్నారు. 2022లో విక్రాంత్ రోనా తర్వాత సుదీప్ చేస్తోన్న మూవీ కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కిచ్చా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.టాలీవుడ్ నటుడు సునీల్ విలన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా రిలీజైన టీజర్లో సుదీప్ డిఫరెంట్ లుట్లో కనిపించారు. టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్‌గా సునీల్ లుక్ సైతం ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ద్వారానే సునీల్ శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు.కాగా.. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో వస్తోన్న మ్యాక్స్ మూవీని కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత పవర్ ఫుల్ పాత్రలో కనిపించడంతో.. సుదీప్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.MAX Takes Charge! 💥👿🔗https://t.co/GbhvhNzPAl#MAXManiaBegins with the explosive #MaxTeaser 🔥 #boloMAXii@Max_themovie @theVcreations @Kichchacreatiin @vijaykartikeyaa @AJANEESHB @shivakumarart @shekarchandra71 @ganeshbaabu21 @dhilipaction @ChethanDsouza @saregamasouth…— Kichcha Sudeepa (@KicchaSudeep) July 16, 2024 -
హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో
హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ కావడం ఈ మధ్య కలకలం రేపింది. స్వయంగా అభిమానిని చంపాడనే ఆరోపణలతో ఇతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు ఇంకా కోర్టులోనే ఉంది. అలానే బయటకొస్తున్న ఒక్కో విషయం అందరికీ వరస షాకులు ఇస్తోంది. అయితే దర్శన్ అరెస్ట్ వల్ల కన్నడ ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వచ్చేలా ఉంది. దీంతో అప్రమత్తమైన ప్రముఖ కన్నడ హీరో సుదీప్.. దీంతో ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.'మీడియాలో ఏం చూపిస్తున్నారో మాకు కూడా అంతే తెలుసు. ఎందుకంటే మేం నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అడగలేం కదా! నిజాన్ని బయటపెట్టేందుకు పోలీసులు, మీడియా చాలానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో సందేహం లేదు. హత్యకు గురైన రేణుకా స్వామి కుటుంబానికి, అతడికి పుట్టబోయే బిడ్డకు న్యాయం జరగాలి. ఈ కేసులో న్యాయం గెలవాలి'(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!)'అయితే దర్శన్ అరెస్ట్ అవడంతో నింద అంతా సినిమా ఇండస్ట్రీపై వేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి న్యాయం జరగాలి.. కన్నడ చిత్రపరిశ్రమలో ఎందరో నటులున్నారు. ఇది ఏ ఒక్కరికో ఇద్దరికో సంబంధించనది కాదు. నిందితుడికి శిక్ష పడితే ఫిల్మ్ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటుంది' అని సుదీప్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.ఈ నెల 8న రేణుకా స్వామి అనే వ్యక్తి అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు. ఇతడిని ఎవరు చంపారనే కోణంలో ఆరా తీయగా.. హీరో దర్శన్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తనతో రిలేషన్లో ఉన్న పవిత్ర గౌడని రేణుకాస్వామి ఇబ్బంది పెట్టడంతోనే దర్శన్ కోపం పెంచుకుని రేణుకా స్వామిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు దర్శన్ సహా 11 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది.(ఇదీ చదవండి: కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)
-
స్టార్ హీరో సినిమాకు ఓకే చెప్పిన విజయేంద్ర ప్రసాద్.. పాన్ ఇండియా రేంజ్లో!
టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు కథలు అందించిన రచయిత విజయేంద్రప్రసాద్. మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ఆల్‌టైమ్ హిట్స్‌ను అందించారు. అయితే తాజాగా మరో స్టార్ హీరోకు కథను అందించేందుకు సిద్ధమయ్యారు. శాండల్‌వుడ్ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటిస్తున్న తాజా చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ పనిచేస్తున్నారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి ఆయన ఇప్పటి వరకు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 25 చిత్రాలకు పైగా కథలను అందించారు. తాజాగా కన్నడ హీరో కిచ్చాకు సైతం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ విషయాన్ని సెప్టెంబర్ 2న కిచ్చా సుదీప్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ రివీల్ చేశారు. (ఇది చదవండి: అవార్డులు నాకు చెత్తతో సమానం.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్! ) కిచ్చా సుదీప్ కథానాయకుడుగా ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ ఆర్సీ స్టూడియోస్ భారీ బడ్జెట్లో చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ఆర్.చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. కిచ్చా సుదీప్ మరోసారి కబ్జా దర్శకుడు ఆర్ చంద్రుతో జతకట్టబోతున్నారు. ఈ ముగ్గురు కాంబినేషన్లో ఆర్సీ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఈ సంస్థ నిర్మించిన ఐదు చిత్రాలు వరుసగా తెరపైకి రాబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా కిచ్చ సుదీప్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో పని చేయడానికి ప్రపంచ స్థాయి టెక్నీషియన్లను, నటీనటులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. (ఇది చదవండి: సలార్ రిలీజ్ ఆ నెలలోనే.. వైరలవుతున్న ట్వీట్!) -
కిచ్చా సుదీప్ చేసిన మోసాన్ని బయటపెట్టిన నిర్మాత
కిచ్చా సుదీప్ టాలీవుడ్ వారికి సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమా ఆయనకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఇటీవల విక్రాంత్ రోణాతో తెలుగులో కూడా మెప్పించాడు. తాజాగా ఆయన మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న కిచ్చా46 సంబంధించిన టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. (ఇదీ చదవండి: సమంత మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్ అర్థమేంటి?) తాజాగా సుదీప్‌పై కన్నడ నిర్మాత ఎమ్ ఎన్ కుమార్ పలు ఆరోపణలు చేశాడు. తన బ్యానర్లో సినిమా చేస్తానని రెమ్యూనరేషన్ తీసుకుని మూవీ చేయకుండా మోసం చేశాడని ఆయన తెలుపుతున్నాడు. ప్రాజెక్ట్ కోసం సుదీప్‌కు రూ. 9 కోట్ల రూపాయలు ఇచ్చానని, కానీ డేట్స్ ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడని నిర్మాత ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వద్ద ఫిర్యాదు చేశానన్నారు. సుమారు ఎనిమిదేళ్ల క్రితమే సినిమా చేయడానికి ఇద్దరి మధ్య పరస్పరం అంగీకారం కుదిరనట్లు తెలిపాడు. కానీ ఇప్పటి వరకు డేట్స్ కేటాయించడంలో సుదీప్ విఫలమయ్యారని నిర్మాత పేర్కొన్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి రెమ్యూనరేషన్ రూ. 9 కోట్లతో పాటు.. మరో రూ. 10 లక్షలు తన వంట గది రెనోవేషన్ కోసం సుదీప్ తీసుకున్నాడని చెప్పుకొచ్చాడు. సినిమా కోసం దర్శకుడు నంద కిషోర్‌కి అడ్వాన్స్ చెల్లించడంతో పాటు ఈ చిత్రానికి 'ముత్తట్టి సత్యరాజు' అనే టైటిల్‌ను కూడా ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేశామన్నారు. కానీ తమ బ్యానర్లో సినిమా చేయకుండా ఇప్పుడు, ఒక తమిళ నిర్మాతతో సుదీప్ మూవీ ప్రకటించారు. (ఇదీ చదవండి: 'గురువు' పేరుతో పూనమ్ కౌర్ సంచలన పోస్ట్) తన వద్ద డబ్బు తీసుకున్న తర్వాత ఇప్పటికే వివిధ నిర్మాతలతో సుదీప్ నాలుగు సినిమాలు చేశాడు. కానీ తన బ్యానర్లో చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదన్నారు. దీంతో తాను సుదీప్‌ను సంప్రదించడానికి చాలా రకాలుగా ప్రయత్నించానని, అయితే అతని నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్‌కి సమస్యను తీసుకెళ్లానని, అతను మాట్లాడితే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని నిర్మాత ఎమ్ ఎన్ కుమార్ చెప్పారు. -
కోలీవుడ్‌లో పాన్ ఇండియా మూవీతో ఎంట్రీ ఇస్తున్న కిచ్చా సుదీప్
భారీ చిత్రాల నిర్మాత కలైపులి ఎస్ థాను. ఈయన ఇటీవల నటుడు ధనుష్ కథానాయకుడిగా వరుసగా అసురన్, కర్ణన్, నానే వరువేన్ చిత్రాలు నిర్మించారు. అందులో అసురన్, కర్ణన్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. నానే వరువేన్ చిత్రం మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కాగా తాజాగా కలైపులి ఎస్. థాను తాజాగా తన వి.క్రియేషన్స్ పతాకంపై ఒక పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించనున్నారు. ఈయన ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి తమిళ ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. అదే విధంగా కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించిన కన్నడ చిత్రం విక్రాంత్ రోణా చిత్రం తమిళంలోనూ మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో ఈయన ఇప్పుడు నేరుగా తమిళ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఈయన నటిస్తున్న 46వ చిత్రం అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్ర వర్గాలు బుధవారం వెల్లడించారు. చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు అందులో పేర్కొన్నారు. అంతకు ముందుగా చిత్ర టీజర్ విడుదల చేయనట్లు నిర్మాతలు పేర్కొన్నారు. అయితే ఈ చిత్రానికి దర్శకుడు, కథానాయకి, ఇతర నటీనటులు సాంకేతిక వర్గం వివరాలు వెలువడాల్సి ఉంది. అయితే వెల్ కమ్ టూ బాద్ షా అంటూ నిర్మాత బుధవారం నటుడు కిచ్చా సుదీప్‌ను స్వాగతిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. కాగా నటుడు సూర్య కథానాయకుడిగా వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ అనే భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు నిర్మాత ధాను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఆ చిత్రం ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది. -
ష్.. కిచ్చా సుదీప్ ప్రచారానికి రెస్పాన్స్ ఇది!
Kichcha Sudeepa In Trending.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం.. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడం అటు రాజకీయ, ఇటు సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. కన్నడనాట అందరివాడిగా పేరున్న సుదీప్.. గతంలోలాగే ఈ ఎన్నికల్లో కూడా తటస్థంగా ఉంటారని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా.. రాజకీయాల్లో అడుగుపెట్టకుండానే కాషాయం పార్టీ తరపున ప్రచారం చేస్తానని ప్రకటించడాన్ని విపక్షాలు తట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలో సుదీప్‌పై విమర్శలూ గుప్పించాయి. అయితే.. ఆ విమర్శల సంగతి పక్కనపెడితే మాస్ ఫాలోయింగ్ ఉన్న సుదీప్ ప్రచారంలోకి దిగితే.. అంతే భారీ స్థాయిలో ఆదరణ దక్కుతోంది. ఓవైపు అభిమానుల ఉత్సాహం, మరోవైపు ట్రాఫిక్‌కు అంతరాయం.. ఫలితంగా సెక్యూరిటీ కల్పించడం పోలీసులకు పెను సవాల్‌గా మారింది. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా సుదీప్ చేస్తున్న ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోంది. గురువారం విజయనగర జిల్లా కుడ్లిగి నియోజవర్గంలో సుదీప్ బీజేపీ అభ్యర్థి లోకేష్ వీ నాయక తరపున ప్రచారం నిర్వహించారు. ఆ రోడ్‌షోకి జనం సంద్రల్లా వెల్లువెత్తడం గమనార్హం. రోడ్డుకు ఇరువైపులా మోహరించిన ‘బాద్షా’ సుదీప్ ఫ్యాన్స్.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో సుదీప్ ప్రయాణిస్తున్న వాహనం ముందుకు కదల్లేదు . దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. అంతకు ముందు బుధవారం సాయంత్రం బళ్లారి జిల్లా సండూర్లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. దీంతో ప్రచారాన్ని అర్థాంతంగా ముగించారాయన. ఇది చూసి.. ఇది బీజేపీ ప్రచార ర్యాలీనా? లేక సుదీప్ అభిమానుల ర్యాలీనా? అనే డౌట్లను సోషల్ మీడియా వేదికగా కురిపిస్తున్నారు పలువురు. ఓట్లు రాల్చడం మాటేమేగానీ.. సుదీప్ రాకను పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఆ అభిమానులు షేర్ చేస్తున్న వీడియోలతో.. ఒక్కసారిగా కిచ్చా సుదీప్ #KichchaSudeepa హ్యాష్ ట్యాగ్ ట్విటర్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ಅಭಿಮಾನಿಗಳ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ವೀರಮದಕರಿ ಚಿತ್ರದ ಡೈಲಾಗನ್ನು ಹೇಳಿದ ನಮ್ಮ ಕಿಚ್ಚ ಸುದೀಪ್ ಬಾಸ್...@KicchaSudeep #KicchaSudeep𓃵 #Kiccha46 #KicchaBOSS𓃵 #KarnatakaElection2023 pic.twitter.com/gku0Nw5njI — 𝐊𝐢𝐜𝐜𝐡𝐚 𝐔𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐞™ (@KicchaUniverse) April 27, 2023 ಅಭಿಮಾನಿಗಳ ಅಭಿಮಾನಿ ಕೂಡ್ಲಿಗಿ ಯಲ್ಲಿ@KicchaSudeep #KicchaSudeep𓃵 #KicchaSudeep #Kiccha46 pic.twitter.com/Tzikcc7qX1 — ಕಿಚ್ಚನ ಆರ್ಮಿ ಬಳ್ಳಾರಿ (@KING_KICCHA_G) April 27, 2023 Kiccha Sudeep campaigns for BJP candidate. 🔥🔥 pic.twitter.com/fwDcsPIFXi — News Arena India (@NewsArenaIndia) April 26, 2023 Exclusive Video...🔥 Our Baadshah @KicchaSudeep Anna Road Show in #Kudligi 💥🚩😍#Kiccha46 #KicchaSudeep#KicchaBOSS𓃵 #KicchaSudeep𓃵 pic.twitter.com/IbH2dQDGcv — Abhinaya Chakravarthi Official Team Honnavara™ (@ACOTeamHonnavar) April 27, 2023 ఇదీ చదవండి: నేను బీజేపీకి న్యాయం చేయలేదు -
బొమ్మై నామినేషన్.. హాజరైన నడ్డా, సుదీప్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నామినేషన్ వేశారు. షిగ్గావ్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున బరిలో దిగుతున్న ఆయన.. బుధవారం నామినేషన్ పత్రాలను నిజయోకవర్గపు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ సైతం ఆ సమయంలో బొమ్మై వెంట ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున కిచ్చా సుదీప్ స్టార్ క్యాంపెయినర్‌గా పని చేయనున్న విషయం విదితమే. అయితే తాను రాజకీయాల్లోకి రాకున్నా.. బొమ్మైతో ఉన్న అనుబంధం మేరకు ఈ ఎన్నికల్లో ఆయన తరపున ప్రచారం చేస్తానని సుదీప్ ఇదివరకే ప్రకటించారు. ఇక నామినేషన్ తరవ తర్వాత జేపీ నడ్డా మాట్లాడుతూ కర్ణాటకలో కమల వికాసం ఖాయమన్నారు. మే 10వ తేదీన ఒకే దఫాలో 224 నిజయోకవర్గాలకు పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన ఫలితాలు వెల్లడి అవుతాయి. దేశంలో తొలిసారిగా ఓట్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని వృద్ధులు, వికలాంగుల కోసం తీసుకురానుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇదీ చదవండి: కర్ణాటకలో బీజేపీకి ఊహించని పరిణామం -
‘సినిమావాళ్లు వస్తుంటారు.. పోతుంటారు’
బెంగళూరు: కన్నడ స్టార్ కిచ్చా సుదీప్.. బీజేపీకి మద్దతు ప్రకటించడం అక్కడి సీనీ, రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ ఈ పరిణామంపై స్పందించింది. రాజకీయాలు, సినిమాలు వేరని, అవి ఒకదానిపై మరొకటి ప్రభావం చూపెట్టబోవని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ చెబుతున్నారు. సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడం.. ఎన్నికల్లో ఏమేర ప్రభావం చూపెట్టే అవకాశం ఉందని గురువారం మీడియా నుంచి శివకుమార్‌కు ప్రశ్న ఎదురైంది. ‘‘అది ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోదని నేను భావిస్తున్నా. ఎంతో మంది సినిమావాళ్లు వచ్చారు, వెళ్లారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. అవి ఎలాంటి పరిణామాలు చూపించబోవు. సినిమా వాళ్ల సపోర్ట్‌తో గెలుస్తుందనుకోవడం బీజేపీ భ్రమ’’ అని శివకుమార్ చెప్పారు. ఇదిలా ఉంటే.. నటుడు సుదీప్ బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తన మద్దతు ప్రకటించారు. తాను బీజేపీలో చేరబోనని, ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని, కేవలం బొమ్మైకి మద్దతు ఇచ్చేందుకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు. నాకు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. డబ్బు కోసమో మరే అవసరం కోసమో ఇక్కడికి రాలేదు. కేవలం.. ఒకేఒక వ్యక్తి కోసం వచ్చా. సీఎం మామ(బొమ్మైని ఉద్దేశించి..)తో నాకు వ్యక్తిగతంగా అనుబంధం ఉంది. కేవలం ఆయనకు మద్దతు తెలిపేందుకే వచ్చా. ఆయన చెప్పిన అభ్యర్థిని నేను ప్రచారం చేస్తా. అంతేగానీ నేను రాజకీయాల్లోకి రాను. సినిమాలు తీయడమే నా అభిమానులకు ఇష్టం అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుదీప్‌ను కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆయన నివాసంలో కలిశారు. దీంతో సుదీప్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. అయితే అది రాజకీయ భేటీ కాదని, కేవలం వ్యక్తిగత కారణాలతో కలిశారని సుదీప్ సన్నిహితులు ఆ సమయంలో వెల్లడించారు. అంతకు ముందు సిద్ధరామయ్యతో, జేడీఎస్ కుమారస్వామిని సైతం సుదీప్ పలుమార్లు కలిశారు. మరోవైపు బీజేపీకి సుదీప్ మద్దతు ఇచ్చే అంశాన్ని కన్నడ పార్టీలు, పలువురు సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. తొలుత అది ఉత్త ప్రచారమై ఉంటుందన్న నటుడు ప్రకాష్ రాజ్.. సుదీప్ చేరికపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆపై ట్విటర్లో.. ‘‘డియర్ సుదీప్ గారూ.. అందరూ ఇష్టపడే ఆర్టిస్ట్ గా... మీరు ప్రజల గొంతుక అవుతారని అనుకున్నాను. కానీ మీరు రాజకీయ పార్టీతో మిమ్మల్ని మీరు రంగులు మార్చుకోవాలని ఎంచుకున్నారు. సరే.. ప్రతి పౌరుడు ఇకపై మిమ్మల్ని, మీ పార్టీని ప్రశ్నిస్తుంటాడు. సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి అంటూ ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు చేశారు. Dear Sudeep.. as an artist loved by everyone one.. I had expected you to be a voice of the people. But you have chosen to colour yourself with a political party .. WELL .. Get ready to answer ..every question a citizen will ask YOU and YOUR party .@KicchaSudeep #justasking — Prakash Raj (@prakashraaj) April 6, 2023 The weight you have to carry now .. ನೀವು ಈಗ ಹೊರಲೇಬೇಕಾದ ಬೇರೆ ಬಣ್ಣದ ಲೊಕದ ಭಾರ .. #justasking https://t.co/ygF75aEaJu — Prakash Raj (@prakashraaj) April 6, 2023 ఇక జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. బొమ్మైని గౌరవించడం వల్లే ఆయన తరపున ప్రచారం చేసేందుకు సుదీప్ అంగీకరించారు. అభివృద్ధి విషయంలో బీజేపీ విఫలమైంది. ఎన్నికల్లో గెలవడానికి సినిమా నటులను వాడుకోవాలని బీజేపీ యత్నిస్తోంది. అది వర్కవుట్ కాదు. సినిమా నటులను చూసేందుకు జనం వస్తుంటారు. సెలబ్రిటీలు అన్ని పార్టీలకు ప్రచారం చేస్తారు. అలాగే.. వాళ్లు ఏ పార్టీకి పరిమితం కాదు అని కుమారస్వామి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కర్ణాటకలో సుదీప్‌కు మాస్ ఫాలోయింగ్ ఉంది. నాయక సామాజిక వర్గానికి చెందిన 51 ఏళ్ల సుదీప్ మద్దతుద్వారా తమ పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని బీజేపీ ఆశిస్తోంది. కర్ణాటకలో షెడ్యూల్ కులాల కిందకు వచ్చే నాయక సామాజిక వర్గం.. కళ్యాణ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉంది. ఆ వర్గం ఓటు బ్యాంకుతో పాటు సుదీప్‌కు ఉన్న ఫాలోయింగ్ కూడా తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ రెండో జాబితా విడుదల బనశంకరి: కర్ణాటక అసెంబ్లీకి మే 10వ తేదీన జరగనున్న ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మరో 42 మంది అభ్యర్థులతో గురువారం రెండో జాబితా విడుదల చేసింది. పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య వరుణ సీటుతోపాటు మరో చోటు నుంచి పోటీకి దిగుతారని భావిస్తున్న కోలారు స్థానం ఇందులో లేవు! ముగ్గురు సిట్టింగ్‌లకు టికెట్లు దక్కలేదు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురికీ చోటు దక్కింది. 124 మందితో కాంగ్రెస్ ఇప్పటికే తొలి జాబితా విడుదల చేయడం తెలిసిందే. -
దిగ్భ్రాంతికి లోనయ్యా.. బాధగా ఉంది: ప్రకాష్ రాజ్
బెంగళూరు: సినీ నటుడు, రాజకీయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసే ప్రకాష్ రాజ్.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తోటి నటుడు, కన్నడ స్టార్‌గా పేరున్న సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడంపై ప్రకాష్ రాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిచ్చా సుదీప్ ప్రకటనతో దిగ్భ్రాంతికి గురయ్యా. ఎంతో బాధించింది అని ఓ జాతీయ మీడియాతో పేర్కొన్నారాయన. అంతకు ముందు కిచ్చా సుదీప్ బీజేపీలో చేరతారంటూ వచ్చిన కథనాలను ప్రకాష్ రాజ్ ఖండించారు. అది తప్పుడు వార్త అయ్యి ఉంటుందని బలంగా నమ్ముతున్నా. బీజేపీ ఓటమి భయంతోనే అలాంటి ప్రచారానికి దిగింది. అలాంటి ఉచ్చులో పడడానికి సుదీప్ అమాయకుడేం కాదంటూ ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ, ఆ అంచనాని తలకిందులు చేస్తూ బుధవారం బీజేపీకి మద్దతు ప్రకటించారు సుదీప్. తాను రాజకీయాల్లో చేరబోనంటూనే.. రాబోయే ఎన్నికల్లో కేవలం బీజేపీ తరపున ప్రచారం చేస్తానని సుదీప్ చెప్పారు. సీఎం బసవరాజ్ బొమ్మై తనకు గాడ్‌ఫాదర్ లాంటి వాడని, ఆయన ఏ పార్టీలో ఉన్నా తాను ప్రచారం చేసేవాడినంటూ సుదీప్ నిన్న ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. -
తెలుగులో రిలీజ్ కానున్న మరో కన్నడ హిట్ మూవీ
సుదీప్, అమలాపాల్ జంటగా ఎస్. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హెబ్బులి’. కన్నడలో సూపర్ హిట్టయిన ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది. ఎమ్. మోహన శివకుమార్ సమర్పణలో సి. సుబ్రహ్మణ్యం ఈ నెల 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ట్రైలర్‌ను నిర్మాత సి. కల్యాణ్ రిలీజ్ చేయగా, మొదటి పాటను నిర్మాత ప్రసన్న కుమార్, రెండవ పాటను ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి సత్యనారాయణ విడుదల చేశారు. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ– ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘హెబ్బులి’. కన్నడలో మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని ఫ్యాన్సీ రేటు ఇచ్చి తెలుగులో డబ్ చేసి, రిలీజ్ చేస్తున్నాను’’ అన్నారు. చదవండి: రూమర్లు ఎక్కువ, అవకాశాలు తక్కువ.. పాపం నిధి -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ 'విక్రాంత్ రోణ'
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన చిత్రం విక్రాంత్ రోణ. గ్లామరస్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్గా నటించింది. అనూప్ భండారి డైరెక్ట్ చేయగా మంజునాథ్ గౌడ్ నిర్మించారు. జూలై 28న రిలీజైన ఈ పాన్ ఇండియా మూవీ అంచనాలకు తగ్గట్టుగానే భారీగానే వసూళ్లు రాబట్టింది. కేవలం రిలీజైన నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరింది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజైన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. జీ5 విక్రాంత్ రోణ డిజిటల్ రైట్స్‌ను భారీ మొత్తానికి దక్కించుకుంది. తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ 2 నుంచి జీ 5లో ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక కొద్దిరోజులు ఆగారంటే విక్రాంత్ రోణను ఎంచక్కా కూర్చున్న చోటే వీక్షించేయవచ్చు. The devil will take over @ZEE5Kannada @KicchaSudeep @anupsbhandari @JackManjunath @shaliniartss @ZeeStudios_ #VikrantRonaOnZee5 https://t.co/vjt1XW0ziw — VikrantRona (@VikrantRona) August 25, 2022 ಇದೇ September 2nd ಬರ್ತಿದ್ದಾನೆ ವಿಕ್ರಾಂತ್ ರೋಣ ನಿಮ್ಮ Zee5 ಅಲ್ಲಿ! Stay tuned@KicchaSudeep @anupsbhandari @nirupbhandari @Asli_Jacqueline @neethaofficial @AJANEESHB @williamdaviddop @shaliniartss @shivakumarart @AlwaysJani @ZeeStudios_ @ZeeKannada @RavishankarGow5 @vasukivaibhav#VR pic.twitter.com/MEpDbecYCt — ZEE5 Kannada (@ZEE5Kannada) August 25, 2022 చదవండి: పూరీ దగ్గర సుక్కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడా! పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్లో కీర్తి సురేష్.. ఏ సినిమాలో అంటే -
కిచ్చా సుదీప్‌పై నెట్టింట పుకార్లు.. నిర్మాత క్లారిటీ!
బెంగళూరు: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ’ ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. షియో ఫాంటసీ, యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అనూప్ బండారి దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్‌కు భారీ సన్నాహాలు చేశారు. ప్రమోషన్స్ నేపథ్యంలో హైదరాబాద్, చెన్నై, కొచ్చిలలో ప్రెస్‌మీట్ నిర్వహించాల్సి ఉండగా సుదీప్‌కు ఆరోగ్యం సరిగా లేని కారణంగా అవి వాయిదా పడ్దాయి. దీంతో ఆయనకు కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. తాజాగా దీనిపై విక్రాంత్ రాణ చిత్ర నిర్మాత స్పందించారు. నెట్టింట సుదీప్‌పై వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపడేశారు. జలుబు, జ్వరం లక్షణాలు కనిపించడంతో సుదీప్ పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. ప్రస్తుతం సుదీప్‌కు కరోనా సోకలేదని, క్షేమంగా ఉన్నారని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. చదవండి: Arjun Kapoor: ఏడాది తిరిగేసరికి ఇల్లు అమ్మేసిన హీరో! -
అఖిల్‌ను 'వైల్డ్ సాలే' అన్న హీరోయిన్..
Akhil Agent Teaser Released: అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్ట్ 12న విడుదల కానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్‌గా తరెక్కిన ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను స్టార్ యాక్టర్స్ శివకార్తికేయన్, కిచ్చా సుదీప్ విడుదల చేశారు. ఈ టీజర్లో అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీ, సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అఖిల్‌కు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇచ్చే ఎలివేషన్ బాగుంది. అలాగే యాక్షన్ సీన్స్, 'వైల్డ్ సాలే' అని హీరోయిన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ టీజర్.. అఖిల్ ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉందని చెప్పవచ్చు. కాగా 'ఏజెంట్' చిత్రాన్ని హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సిరీస్ 'బోర్న్' ఆధారంగా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. చదవండి: అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ మొన్న ఆర్జీవీ.. ఇప్పుడు సుశాంత్.. యాంకర్‌పై ఆగ్రహం ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. -
సుదీప్ కెరీర్లో ఇదే బెస్ట్ : రామ్‌గోపాల్ వర్మ
‘‘కన్నడ ఇండస్ట్రీ అంటే ఏదో చిన్న పల్లెటూర్లో సినిమాలు తీస్తున్నారనే ఫీలింగ్ గతంలో ఉండేది. కానీ, ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీకే కాదు.. ఇండియన్ సినిమాకే ఓ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ మధ్య ‘కేజీఎఫ్ 2’ వచ్చింది.. ఇప్పుడు ‘విక్రాంత్ రోణ’ వస్తోంది. సుదీప్ కెరీర్లో ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనుకుంటున్నాను’’ అని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అన్నారు. సుదీప్ హీరోగా జాక్వలైన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘విక్రాంత్ రోణ’. సల్మాన్ ఖాన్ ఫిలింస్ సమర్పణలో జీ స్టూడియోస్, కిచ్చా క్రియేషన్స్, షాలినీ ఆర్ట్స్ బ్యానర్స్‌పై జాక్ మంజునాథ్ నిర్మించిన ఈ సినిమా జూలై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘ఈ సినిమాకు సుదీప్‌గారు పిల్లర్‌గా నిలబడి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్’’ అన్నారు అనూప్ భండారి. ‘‘భారతీయ సినిమా మరిన్ని కొత్త చరిత్రలను సృష్టిస్తుంది’’ అన్నారు నిర్మాత షాలినీ మంజునాథ్. ‘‘విక్రాంత్ రోణ’ చిత్రం కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుంది. ఓ సౌత్ ఇండియన్‌గా ఎంతో గర్వపడుతున్నాను’’ అన్నారు అఖిల్ అక్కినేని. కిచ్చా సుదీప్ మాట్లాడుతూ– ‘‘ఈగ’ వంటి సినిమాను నాకు ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్, రాజమౌళిగార్లకు థ్యాంక్స్. అలాగే నా తెలుగు జర్నీకి ఓ కారణమైన రామ్‌గోపాల్ వర్మగారు ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది. జూలై 28కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. రచయిత విజయేంద్ర ప్రసాద్, ఫైట్ మాస్టర్ విజయ్, గాయని మంగ్లీ తదితరులు పాల్గొన్నారు. -
విక్రాంత్ రోణ ట్రైలర్: ఆ డెవిల్ మళ్లీ వచ్చాడు
కన్నడ హీరో కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విక్రాంత్ రోణ’. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ముఖ్య పాత్రల్లో నటించారు. అనూప్ భండారి దర్శకుడు. జాక్ మంజునాథ్, షాలినీ మంజునాథ్ నిర్మించారు. గురువారం ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజైంది. 'ఆ ఊరే ఒక మర్మమైన ఊరు. ఆ ఊరి ప్రజలు ఏదో ఒక భయంకరమైన కథని దాచాలనుకుంటున్నారు. కథని దాచగలరు, కానీ భయాన్ని దాచలేరు, ఆ కథ మళ్లీ మొదలైంది. ఆ డెవిల్ మళ్లీ వచ్చాడు..' అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. భయం నిండిన ఆ ఊరిలో భయం అంటే ఏమిటో తెలియని ఒకడు వచ్చాడు అంటూ విక్రాంత్ రోణగా సుదీప్ పాత్రను పరిచయం చేశారు. ట్రైలర్ చూస్తుంటే అద్భుతంగా ఉంది. కాగా ఈ సినిమాకు ఓటీటీ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్ (దాదాపు రూ. 100 కోట్లు) ఇచ్చేందుకు ముందుకు వచ్చిందట. కానీ ప్రేక్షకులకు ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి దీన్ని థియేటర్లోనే రిలీజ్ చేస్తున్నట్లు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు డైరెక్టర్ అనూప్. ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజైన ‘రా రా రాక్కమ్మా’ సాంగ్ విశేష ఆదరణ పొందిన విషయం విదితమే! రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ సాంగ్‌ను మంగ్లీ, నకాష్ అజీజ్ పాడారు. ఈ త్రీడీ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో జూలై 28న విడుదలవుతోంది’ చదవండి: -
మంగ్లీ పాడిన మాస్ సాంగ్ 'రారా రక్కమ్మా..' విన్నారా?
సుదీప్ హీరోగా అనూప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విక్రాంత్ రోణ’. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ముఖ్య పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో జాక్ మంజునాథ్, శాలిని మంజునాథ్ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం జూలై 28న విడుదలకానుంది. ఈ చిత్రం నుంచి ‘రా రా రాక్కమ్మా..’ అనే పక్కా మాస్ తెలుగు పాటను బుధవారం విడుదల చేశారు. ‘‘త్రీడీ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఇది. ‘రా రా రాక్కమ్మా’ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, మంగ్లీ, నకాష్ అజీజ్ పాడారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ‘‘రా రా రాక్కమ్మా..’ పాట చిత్రీకరణ సమయంలో ఎంజాయ్ చేశాను. పాన్ ఇండియా లెవల్లో మాస్ ఆడియన్స్‌కు నచ్చే సాంగ్ ఇది’’ అన్నారు జాక్వెలిన్. ఈ చిత్రానికి సహనిర్మాత: అలంకార్ పాండియన్, సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్. చదవండి: విషాదం.. ఉగ్రవాదుల కాల్పుల్లో టీవీ నటి కన్నుమూత Sonali Bendre: క్యాన్సర్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నా -
PM Modi: ప్రధాని కామెంట్లపై కిచ్చా సుదీప్ స్పందన
బెంగళూరు: హిందీ భాషాధిపత్య వ్యవహారం.. రాజకీయంగా ముఖ్యంగా దక్షిణాది నుంచి తీవ్ర అభ్యంతరాలకు కారణం అయ్యింది. ఈ విషయంలో కన్నడ స్టార్ నటుడు సుదీప్, బాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ దేవగన్ మధ్య జరిగిన ట్వీట్ల రచ్చ జరిగింది. ఒకానొక దశలో ఇది ఉద్రిక్తతలకు దారి తీస్తుందేమో అనిపించింది. ఇదిలా ఉంటే.. తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హిందీ భాష ఆదిపత్య రగడపై పరోక్షంగా స్పందించారు. దేశంలోని ప్రతి భాషను బీజేపీ సంప్రదాయ ప్రతిబింబంగానే చూస్తుందని, ప్రతీ భాషను గౌరవిస్తుందని అన్నారు. భాషా ప్రతిపాదికన వివాదాలు ప్రేరేపించే అంశాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని ఎన్డీఏ ఎనిమిదేళ్ల పాలన సందర్భంగా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ తరుణంలో.. ప్రధాని ఇలాంటి ప్రకటన చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు నటుడు కిచ్చా సుదీప్ తెలిపారు. ‘‘ప్రతీ ఒక్కరూ తమ భాషను గొప్పగా భావించాలి. ఆయన(ప్రధాని) ఇలా మాట్లాడటాన్ని గౌరవిస్తున్నా. ఇది అన్ని భాషలకు సంబంధించి విషయం. కేవలం కన్నడ గురించి మాత్రమే నేనేం మాట్లాడలేదు. ప్రతీ భాషను గౌరవించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోదీని కేవలం ఒక రాజకీయవేత్తగా మాత్రమే చూడొద్దు.. ఈ వ్యాఖ్యలతో ఆయన్ని ఒక నేతగా చూడాల్సిన అవసరం ఉంది’’ అని సుదీప్ అభిప్రాయపడ్డాడు. ఏదో చర్చ జరగాలనో, గొడవలు జరగాలనో నేను ప్రారంభించలేదు. ఎలాంటి ఎజెండా లేకుండానే అలా జరిగిపోయింది. నా అభిప్రాయం మాత్రమే వినిపించా. ఇప్పుడు ప్రధాని నోట నుంచి ఇలాంటి ప్రకటన రావడం సంతోషంగా ఉంది అని ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో సుదీప్ చెప్పుకొచ్చాడు. చదవండి: చిచ్చు పెట్టిన ‘హిందీ’ భాష -
హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్, సుదీప్ మధ్య ట్వీట్ల వార్
హిందీ భాషపై కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. హిందీ జాతీయ భాష కాదంటూ సుదీప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో ఆయనకు ఓ వర్గం నెటిజన్ల నుంచి వ్యతిరేకత వస్తోంది. కాగా ఆయన తాజా చిత్రం విక్రాంత్ రోణ ప్రమోషన్లో భాగంగా సుదీప్ కేజీయఫ్ 2పై ప్రశంసలు కురిపిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. ఈ క్రమంలో ఆయన హిందీ భాషపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: పునీత్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న నటి నమ్రత దీంతో సుదీప్ వ్యాఖ్యలపై స్పందించిన స్టార్ హీరో అజయ్ దేవగన్ ఆయనకు కౌంటర్ ఇచ్చాడు. సుదీప్‌ను ట్యాగ్ చేస్తూ ‘హిందీ జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు. హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృ భాషే, జాతీయ భాషే, జనగణమన’ అంటూ సుదీప్‌ను ప్రశ్నించాడు. దీంతో అజయ్ దేవగన్ ట్వీట్‌కు సుదీప్ స్పందిస్తూ.. ‘హలో అజయ్ సార్. నా వ్యాఖ్యలకు అర్థం అది కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని వ్యక్తిగతం కలిసినప్పుడు దీనికి మీకు వివరణ ఇస్తాను’ అని చెప్పుకొచ్చాడు. .@KicchaSudeep मेरे भाई, आपके अनुसार अगर हिंदी हमारी राष्ट्रीय भाषा नहीं है तो आप अपनी मातृभाषा की फ़िल्मों को हिंदी में डब करके क्यूँ रिलीज़ करते हैं? हिंदी हमारी मातृभाषा और राष्ट्रीय भाषा थी, है और हमेशा रहेगी। जन गण मन । — Ajay Devgn (@ajaydevgn) April 27, 2022 అలాగే మరో ట్వీట్లో భారతదేశంలోని అన్ని భాషలపై తనకు గౌరవం ఉందని, ఇక్కడితే ఈ టాపిక్‌ను వదిలేయాలనుకుంటున్నాను అంటూ సుదీప్ వరస ట్వీట్స్ చేశాడు. ‘ఎలాంటి అపార్థాలు చోటు చేసుకోకుండా దీనికి స్పష్టత ఇచ్చినందుకు ధన్యవాదాలు మై ఫ్రెండ్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం అని నా అభిప్రాయం. మనమంత దేశంలోని అన్ని భాషలను గౌరవించాలి’ అంటూ అంటూ సుదీప్ ట్వీట్‌కు అజయ్ రిప్లై ఇచ్చాడు. ఇలా ఇద్దరి మధ్య ట్వీట్ వార్ నెలకొంది. I love and respect every language of our country sir. I would want this topic to rest,,, as I said the line in a totally different context. Mch luv and wshs to you always. Hoping to seeing you soon. 🥳🥂🤜🏻🤛🏻 — Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022 కాగా సుదీప్.. 'ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారు. ఒక చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నా. హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. కానీ ఈరోజు మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయి.' అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. -
కేజీఎఫ్ 2 ఎఫెక్ట్: హిందీ భాషపై కిచ్చా సుదీప్ సంచలన వ్యాఖ్యలు..
Kiccha Sudeep Says Hindi Is No More A National Language: దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన 'ఈగ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. 'ఈగ' సినిమాలో విలన్‌గా మెప్పించి ఎంతో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా పాత్రలో కొత్తదనం ఉంటే చాలు వెంటనే సినిమా చేసేస్తాడు. హీరోగానే కాదు.. కథలో తన ప్రాముఖ్యాన్ని బట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేస్తుంటారు. ‘బాహుబలి’, ‘సైరా: నరసింహారెడ్డి’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి తనదైన నటనతో మెప్పించాడు. ప్రస్తుతం సుదీప్ హీరోగా విక్రాంత్ రోణ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూలై 28న విడుదల కానుంది. ఇదిలా ఉంటే తాజాగా కేజీఎఫ్ 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేశాడు కిచ్చా సుదీప్. ఓ ప్రెస్ మీట్లో సుదీప్ మాట్లాడుతూ 'ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారు. ఒక చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నా. హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. కానీ ఈరోజు మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయి.' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరీ సుదీప్ వ్యాఖ్యలపై బాలీవుడ్ నుంచి ఎవరైనా స్పందిస్తారో చూడాలి. చదవండి: కిచ్చా సుదీప్ 3డీ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే ? Kannada Actor @KicchaSudeep said ,"correct it,Hindi is no more the National Language, its no more a National language"! In a film launch & a huge applause from the crowd & the media. Hope the efforts of Kannada activists are reaching the intended places.👏👏#stophindilmposition pic.twitter.com/qpj06HJseG — ರವಿ-Ravi ಆಲದಮರ (@AaladaMara) April 23, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1531341776.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Vikrant Rona : రూ. 100 కోట్లు ఆఫర్.. అయినా ఓటీటీకి నో
సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘విక్రాంత్ రోణ’. అనూప్ భండారి దర్శకుడు. జాక్ మంజునాథ్, షాలినీ మంజునాథ్ నిర్మించిన ఈ త్రీడీ సినిమాను ఫిబ్రవరి 24న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘మా చిత్రాన్ని 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీలో విడుదల చేయనున్నాం’’ అన్నారు జాక్ మంజునాథ్. అనూప్ భండారి మాట్లాడుతూ– ‘‘మా సినిమాకు ఓటీటీ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్ (దాదాపు రూ. 100 కోట్లు) ఇవ్వడం గొప్ప విషయం. అయితే ప్రేక్షకులకు ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి థియేటర్లోనే రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. -
నా కెరీర్లో ఈ చిత్రం సూపర్ స్పెషల్.. గుర్తుండిపోతుంది: జాక్వలైన్ ఫెర్నాండెజ్
‘‘విక్రాంత్ రోణ’ సినిమాలో భాగమైన ప్రతి క్షణం చాలా ఎగ్జయిట్మెంట్ వేసింది. నా కెరీర్లో ఈ చిత్రం సూపర్ స్పెషల్.. గుర్తుండిపోయే చిత్రమవుతుంది’’ అని హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండెజ్ అన్నారు. ‘ఈగ’ ఫేమ్ కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ’. అనూప్ భండారీ దర్శకత్వంలో జాక్ మంజునాథ్– షాలిని మంజునాథ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్న జాక్వలైన్ పాత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. రాక్వెల్ డీ కోస్టా అలియాస్ గదంగ్ రాక్కమ్మగా ఆమె నటిస్తున్నారు. ముంబై బిల్‌బోర్డ్స్ సహా ఇతర నగరాల్లో ఈ ఫస్ట్‌లుక్‌ను ప్రదర్శించనున్నారు. ‘‘రాబోయే తరాలు గుర్తు పెట్టుకునేలా ఓ సినీ అద్భుతాన్ని సృష్టించే దారిలో ప్రయాణిస్తున్నాం’’ అన్నారు జాక్ మంజునాథ్. ‘‘మా సినిమా ప్రతి అనౌన్స్మెంట్లో ఓ సర్ప్రైజ్ను పరిచయం చేస్తుండటం అద్భుతంగా అనిపిస్తోంది’’ అన్నారు అనూప్ భండారి. ఈ చిత్రానికి సహ నిర్మాత: అలంకార్ పాండియన్, సంగీతం: బి.అజనీశ్ లోక్‌నాథ్, కెమెరా: విలియమ్ డేవిడ్. -
రైనా ఫాలో అయ్యే స్టార్ హీరో ఎవరో తెలుసా?
ముంబై: సురేశ్ రైనా.. టీమిండియా తరపున 15 ఏళ్ల పాటు(2005-2020) అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. జట్టులోకి వచ్చిన అనతి కాలంలోనే మంచి బ్యాట్స్‌మన్‌గా పేరుపొందిన రైనా టీమిండియాకు ఎన్నో కీలక విజయాలు అందించాడు. అంతేగాక రైనాలో మంచి ఫీల్డర్ ఉన్నాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రైనాకు ఆటతో పాటు సినిమాలంటే కూడా ఇష్టమని చాలా ఇంటర్య్వూల్లో పేర్కొన్నాడు. అయితే తాను ఒక్క హీరోను మాత్రమే ఇష్టపడతానని.. అతని సినిమాలు తప్ప వేరేవి చూడడని కొన్ని సందర్భాల్లో రైనా చెప్పుకొచ్చాడు. స్వతహాగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించే రైనా అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తుంటాడు. అతనికి ట్విటర్లో 18.8 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా.. రైనా మాత్రం 894 మందిని మాత్రమే ఫాలో అవుతాడు. ఆ 894 మందిలో కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ కూడా ఉన్నాడు. రైనాకు సుదీప్ అంటే ప్రాణం.. అతని యాక్టింగ్ నచ్చి వీరాభిమానిగా మారిపోయిన రైనా అతని సినిమాలను మిస్ కాకుండా చూస్తాడు. కాగా టీమిండియా తరపున రైనా 18 టెస్టుల్లో 768 పరుగులు, 226 వన్డేల్లో 5615 పరుగులు, 78 టీ20ల్లో 1605 పరుగులు సాధించాడు. టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించి తొలి ఇండియన్ ఆటగాడిగా రైనా రికార్డు సృష్టించాడు. కాగా గతేడాది ఆగస్టు 15న ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే రైనా తన క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పడం విశేషం. కాగా 2011లో ప్రపంచకప్ సాధించిన జట్టులో రైనా సభ్యుడు. ఇక గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌కు దూరంగా ఉన్న రైనా ఈ సీజన్‌కు మాత్రం అందుబాటులోకి వచ్చాడు. ఐపీఎల్ 14వ సీజన్లో సీఎస్కే తరపున 7 మ్యాచ్‌లాడి 123 పరుగులు సాధించాడు. అయితే కరోనా సెగతో లీగ్‌ను బీసీసీఐ మధ్యలోనే రద్దు చేసింది. చదవండి: 'మీరు చేస్తుంది గొప్ప పని.. అది నాకు కోపం తెప్పించింది' -
మహేశ్ చిత్రంలో ‘ఈగ’ విలన్?
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలోని మహేశ్ ఫస్ట్ లుక్ సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31న విడుదలైంది. ప్రస్తుతం మూవీ టైటిల్, మహేశ్ ఫస్ట్ లుక్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక మహేశ్ కొత్త సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడినప్పటినుంచి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (మహేశ్ సర్ప్రైజ్ వచ్చింది.. ట్రెండింగ్‌లో టైటిల్) సినిమా కథ ఇదేనంటూ, హీరోయిన్ కియారా అద్వానీ అంటూ పలు ముచ్చట్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఫిలింనగర్ సర్కిళ్లలో వినిపిస్తోంది. ‘సర్కారువారి పాట’చిత్రంలో హీరో మహేశ్‌ను ఢీ కొట్టబోయే విలన్‌గా కన్నడ స్టార్ సుదీప్‌ను చిత్రబృందం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్రకు ఎంతో ప్రాముఖ్యం ఉందని, ఆ పాత్రకు సుదీప్ అయితేనే బాగుంటుందని పరుశురామ్ భావించాడని, ఇప్పటికే అతడికి కథ కూడా వినిపించాడని తెలుస్తోంది. ఇక ‘ఈగ’ సినిమాతో సుదీప్ తెలుగు అభిమానులకు సుపరిచితమే. ఇటీవలే దబాంగ్-3 చిత్రంలోనూ నెగటీవ్ రోల్ చేసి ఆకట్టుకున్నాడు. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి గాని సుదీప్ నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక లాక్‌డైన్ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో పాటలను ఫైనలైజ్ చేసే పనిలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. అలాగే షూటింగ్‌కు అనుమతులు లభించిన వెంటనే చిత్రీకరణ స్టార్ట్ చేసేందుకు ఓ సెట్‌ను సిద్ధంగా ఉంచాలనే ఆలోచనలో ఉన్నారు టీమ్. ఇక బ్యాంకు మోసాల బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివెంజ్ డ్రామాయే ఈ చిత్రం అని, ఓ బ్యాంకు మేనేజర్ కొడుకుగా మహేశ్ పాత్ర ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. (26 ఏళ్ల వయసులో ఆమెను ఇష్టపడ్డాను) -
‘పహిల్వాన్’ ప్రీ–రిలీజ్ వేడుక