‘మా ΄పొలిటికల్ కెరీర్‌కి ఈ రాత్రి చాలా ఇంపార్టెంట్’ అనే డైలాగ్‌తోప్రారంభం అవుతుంది ‘మ్యాక్స్’ సినిమా తెలుగు ట్రైలర్. సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘మ్యాక్స్’. వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్, ‘అఖండ’ ఫేమ్ శరత్ లోహితస్య ఇతర కీలక పాత్రల్లో నటించారు. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో వి క్రియేషన్ ్స, కిచ్చా క్రియేషన్ ్స సంస్థలపై కలైపులి ఎస్. థాను నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఈ నెల 27న విడుదల కానుంది.
ఏషియన్ –సురేష్ ఎంటర్‌టైన్ మెంట్ సంస్థ తెలుగులో రిలీజ్ చేస్తోంది. తాజాగా ‘మ్యాక్స్’ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఒకవేళ చావు ఎదురొచ్చినా సరే.. మా అబ్బాయి ఒంటరిగా పోరాడతాడు’, ‘ఎవడ్రా.. నిన్ను రావొద్దని చెప్పింది.. దమ్ముంటే రారా’, ‘మ్యాక్స్‌తో మాట్లాడుతున్నప్పుడు మ్యాగ్జిమమ్ సైలెన్ ్స ఉండాలి’ వంటి డైలాగ్స్ ట్రైలర్‌లో ఉన్నాయి. సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: అజనీష్ లోకనాథ్, కెమెరా: శేఖర్ చంద్ర.
Comments
Please login to add a commentAdd a comment