టాటా మోటార్స్ కొత్త ఏస్ మోడల్
ధర రూ.4.31 లక్షలు
ముంబై: టాటా మోటార్స్ కంపెనీ తేలిక రకం వాణిజ్య వాహనం(ఎల్సీవీ) సెగ్మెంట్లో ఏస్ మోడల్ కొత్త వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఏస్ మెగా పేరుతో అందిస్తున్న ఈ ఎల్సీవీ ధర రూ.4.31 లక్షలని టాటా మోటార్స్ తెలిపింది. ప్రస్తుత ఏస్ మోడల్స్ ధర కన్నా ఇది 10-12 శాతం అధికమని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రవి పిషరోడి చెప్పారు. 1 టన్ను కెపాసిటిలో లభిస్తున్న ఈ వాహనం 90 కిమీ.వేగంతో ప్రయాణిస్తుందని, ఈ కేటగిరి లో ఇదే అత్యుత్తమ వేగమని వివరించారు.
అధిక వేగం కారణంగా ఎక్కువ ట్రిప్‌లు వేయవచ్చని, 18.5 కిమీ. మైలేజీని ఇస్తుందని పేర్కొన్నారు. అమ్ముడయ్యే ప్రతీ ఐదు ఎల్సీవీల్లో ఒకటి ఏస్ మోడల్ అని వివరించారు. ఎల్సీవీ వాహనాల కొనుగోళ్లకు రుణా లు లభించడం దుర్లభంగా ఉందని, ఈ సెగ్మెంట్లో అమ్మకాలు తగ్గడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పారు. గతంలో వాహన ధరలో 95 శాతం వరకూ రుణం లభించేదని, ఇప్పుడు 80-85 శాతం రేంజ్‌లోనే రుణం లభిస్తోందని వివరించారు.