'కోహ్లిని కంట్రోల్ చేయాలి'
న్యూఢిల్లీ: టీమిండియాకు 'స్ట్రాంగ్ కోచ్'ను నియమించాల్సిన అవసరముందని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడి అభిప్రాయపడ్డారు. దూకుడు స్వభావంతో మైదానంలో వివాదాలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లిని కంట్రోల్ చేయాలంటే శక్తిమంతుడైన కోచ్ కావాలని పేర్కొన్నారు.
'విరాట్ కు మంచి కోచ్ కావాలి. కోహ్లిని అతడు గైడ్ చేయగలగాలి. కోహ్లి దుండుకు స్వభావాన్ని కోచ్ కంట్రోల్ లో పెట్టగలగాలి. క్రికెట్ లో ఎక్కువ కాలం కొనసాగాలంటే జగడాలమారి వైఖరిని కోహ్లి మార్చుకోవాల్సిన అవసరముంది' అని బేడి అన్నారు.
విరాట్ కోహ్లిని మీడియా నాశనం చేస్తోందని బిషన్ సింగ్ బేడి మండిపడ్డారు. అతడి దూకుడు స్వభావాన్ని ఒక వర్గం అతిగా చూపించడాన్ని ఆయన తప్పుబట్టారు. ధోని రిటైర్మెంట్ ప్రకటించడంతో టీమిండియా టెస్టు కెప్టెన్సీ కోహ్లికి అప్పగించారు.