ఏజీపీఓపై సస్పెన్షన్ వేటు
ప్రగతినగర్ : పౌరసరఫరాల శాఖ సహాయ ధా న్యం కొనుగోలు అధికారి (ఏజీపీఓ) శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ కమిషనర్ రజత్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. కస్టమ్ మి ల్లింగ్ ప్యాడీ (సీఎంపీ) కింద రైసుమిల్లర్లకు సరఫరా చేసే ధాన్యం విషయంలో అక్రమాలు జరి గాయన్న ఆరోపణల నేపథ్యంలో శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. 2013-14 ఖరీఫ్‌కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) చెల్లించేందుకు రైసుమిల్లర్లకు ప్రభుత్వం గడువును జూన్ నుంచి సెప్టెంబర్‌కు పొడిగించగా.. అంతకు ముందు జరిగిన సీఎంపీలో అవకతవకలను కమిషనర్ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన ఆదేశాల మేరకు వారం రోజుల క్రితం కరీంనగర్ డీఎస్ఓ చంద్రప్రకాశ్ నేతృత్వంలో 11 బృందాలు ఏకకాలంలో 38 రైసుమిల్లులపై దాడులు నిర్వహించారుు. అయి తే, చాలా వరకు రైసుమిల్లులలో ధాన్యం, బియ్యం లేకపోగా, గతం లో డిఫాల్టర్లయిన రైసుమిల్లర్లకు సై తం సీఎంపీ కింద ధాన్యం చెల్లించి నట్లు తేలింది. ఇదే సమయంలో డీ ఎస్ఓగా వ్యవహరించిన కొండల్రావు ధీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. ఈ వ్యవహారంపై చంద్రప్రకాశ్ ఇ చ్చిన నివేదిక ప్రకారం శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసినట్లు సమాచారం.