ఏఐపీఏసీ చైర్‌పర్సన్‌గా ఇన్ఫీ నారాయణ మూర్తి
న్యూఢిల్లీ: స్టార్టప్స్, ప్రత్యామ్నాయ పెట్టుబడుల కోసం కొత్త నిబంధనల రూపకల్పనకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గురువారం 18 మంది ప్యానల్‌తో కూడిన ‘ప్రత్యామ్నాయ పెట్టుబడుల సలహా కమిటీ’(ఏఐపీఏసీ)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకులు ఎన్.ఆర్. నారాయణ మూర్తి చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఈ కమిటీలో పరిశ్రమ రంగానికి, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు, స్టార్టప్ ఆర్గనైజేషన్స్‌కు చెందిన ప్రతినిధులతోపాటు సెబీ, ఆర్బీఐ, ఆర్థిక శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు ఉంటారు.