ప్రభుత్వ విప్ అవయవదానం
యాదగిరిగుట్ట: తెలంగాణ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి అవయవదానం చేశారు. నల్లగొండ జిల్లా యాదగిరి గుట్టలో మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన పుట్టిన రోజు సందర్భంగా జీవన్ దాన్ అనే సంస్థకు అవయదానం చేస్తూ సంతకం చేశారు. ఆమె నిర్ణయాన్ని పలువురు అభినందించారు. గొంగిడి సునీత 2014లో తొలిసారి ఆలేరు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.