చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
అల్లాదుర్గం రూరల్, న్యూస్‌లైన్ : చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పటేల్ చెరువులో మునిగి అల్లాదుర్గానికి చెందిన మత్స్యకారుడు బోయిన భూమయ్య (50) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన భూమ య్య బుధవారం సాయంత్రం చేపలు పట్టేందుకు పటేల్ చెరువుకు వెళ్లాడు. అయితే అక్కడ చేపల వేటలో నిమగ్నమైనా భూమయ్య పంచె (దోతి) చెరువులో ఉన్నా పొదల్లో ఇరుక్కుపోయింది.
దీంతో ఈత రాక నీట మునిగి మృతి చెందాడు. ఎంతసేపైనా భూమయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యు లు అక్కడికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. అయినా ఫలితం లేకుండా పో యింది. గురువారం ఉదయం మత్స్య కారులంతా కలిసి చెరువులో దిగి వెతగ్గా భూమయ్య మృతదేహం బయటపడిం ది. భూమయ్య కుమారుడు బేత య్య ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించినట్లు ఎస్ఐ చెప్పారు. బాధితుల కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.