మార్కెట్లోకి మారుతీ ఆల్టో కె10 ప్లస్
ధర రూ.3.40 లక్షలు
న్యూఢిల్లీ: దిగ్గజ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తాజాగా ఆల్టో కె10 ప్లస్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ. 3.40 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. రెగ్యులర్ వీఎక్స్ఐ వేరియంట్‌తో పోలిస్తే తాజా కొత్త ఎడిషన్‌లో ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్‌లో పది అదనపు ఫీచర్లు పొందుపరిచామని కంపెనీ పేర్కొంది.
ఇక ఆల్టో కె10 ప్లస్‌లో 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, 5 స్పీడ్ మ్యానువల్/ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, ఫ్రంట్ పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, ప్లాస్టిక్ డోర్ ప్రొటెక్టర్స్ వంటి పలు ప్రత్యేకతలున్నాయి. కాగా తాజా ఎడిషన్ కేవలం వీఎక్స్ఐ వేరియంట్ రూపంలో మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది.