Ambiance
-
26నే శ్రీరామ నవమి
నెల్లిమర్ల రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఈ నెల 25నా లేక 26న జరపుకోవాలా? అనే విషయంపై సందిగ్ధం వీడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ రెండు రోజుల్లో ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరుతూ దేవాదాయశాఖకు ఆదేశాలు జారీ చేసింది. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు రామతీర్థం దేవస్థానం అర్చకుల నుంచి వివరణ సేకరించారు. అర్చకులు పంచాంగాలను చూసి ఈ నెల 25న నవమి ఉన్నప్పటికీ అష్టమి కలిసి రావడంతో కల్యాణం జరిపించేందుకు శుభం కాదని స్థానాచార్యులు నరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు సాయిరామాచార్యులు తదితరులు దేవాదాయశాఖకు వివరణ ఇచ్చారు. ఆగమ శాస్త్రాల ప్రకారం ఆ రోజున శ్రీరాముని కల్యాణం నిర్వహించకూడదని లిఖిత పూర్వకంగా తెలియజేశారు. 26వ తేదీ ఉదయం 5.30కు నవమి పోయి దశమి వస్తుందని సూర్యోదయం తరువాత స్వామివారి వేడుకను జరుపుకోవచ్చునని అర్చకులు చెబుతున్నారు. ఆ సూచనల మేరకు దేవాదాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపి, 26నే రామతీర్థంలో కల్యాణాన్ని జరుపుతున్నట్లు తమ నివేదికలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం 26నే సెలవు దినంగా ప్రకటిస్తూ శుక్రవారం అధికారిక జీఓను జారీ చేసింది. అష్టమితో కూడిననవమి చేయరాదు ఆదివారం నవమితో పాటు అష్టమి కూడా కలిసి వచ్చింది. ఆగమ శాస్త్రాల ప్రకారం స్వామివారి కల్యాణాన్ని ఆ రోజు నిర్వహించడం మంచింది కాదు. 26వ తేదీ ఉదయం 5.30 గంటలకే నవమి పోయి దశమి వస్తుంది. సూర్యోదయమైన తరువాత దశమి నాడు కల్యాణ వేడుకను నిర్వహించవచ్చు. ఇదే విషయాన్ని దేవదాయశాఖకు తెలియజేశాం. ఆ నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం 25నుంచి 26వ తేదీకు మార్చింది.– సాయిరామాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు, రామతీర్థం -
అతి పే...ద్ద సినిమా : నిడివి 720 గంటలు
మన సినిమాలు రెండు నుంచి రెండున్నర గంటల నిడివితో ఉంటాయి. అదే హాలీవుడ్ సినిమాలయితే గంటన్నర లోపే. కానీ ఒకే సినిమా కొన్ని రోజుల పాటు కొనసాగితే ఎలా ఉంటుంది. అలాంటి సినిమా ఉంటుందన్న ఆలోచన కూడా మనకు రాదు. కానీ త్వరలో ఓ పే...ద్ద సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఏకంగా 30 రోజులపాటు ఏకధాటిగా చూడాల్సిన సినిమా వెండితెరపై రానుంది. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజంగా నిజం. స్వీడిష్ డైరెక్టర్ అండర్స్ వెబర్గ్ ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 20 ఏళ్ల పాటు విజువల్ ఆర్ట్స్ రంగంలో అనుభవం ఉన్న అండర్స్, 2020లో రీటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇన్నేళ్ల కెరీర్ లో అందరూ మాట్లాడుకునేలా ఏది చేయలేకపోయానని భావిస్తున్న అండర్స్, సుదీర్ఘమైన సినిమాను రూపొందించేందుకు నిర్ణయించుకున్నాడు. 'ఆంబియన్స్', పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మూకీ సినిమాగా రూపొందిస్తున్నారు. డైలాగులు లేకుండా తెరకెక్కుతున్న ఈసినిమాను తన చివరి చిత్రంగా 2020లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా డ్యూరేషన్ 720 గంటలు, అంటే సరిగ్గా 30 రోజులు. ఇప్పటికే 400 గంటల షూటింగ్ను పూర్తి చేశారు. 2018లో 72 నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్ను విడుదల చేయనున్నారు. 100 మంది నటులతో తీసే ఈ సినిమాను 2020లో ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేసి, కేవలం ఒక షో మాత్రమే వేస్తారట. ఆ తరువాత మరెవూ ప్రదర్శించడానికి వీలు లేకుండా సినిమా కాపీలను తగులబెట్టాలని భావిస్తున్నాడు. ఆయనే నిర్మాత కూడా కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ కాపీలను తగులపెట్టాలన్న ఆలోచనపై పెద్ద ఎత్తు విమర్శలు వినిపిస్తున్నాయి.