అమరుల కుటుంబాలకు అండ
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
88 మంది కుటుంబాలకు సాయం అందజేత
అందని వారు దరఖాస్తు చేసుకోవచ్చు..
హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలను ప్ర భుత్వం ఆదుకుంటుందని డిప్యూటీ సీఎం కడి యం శ్రీహరి అన్నారు. ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో ప్రభుత్వం బుధవారం ఆర్థిక సహాయం అందించింది. సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, గిరిజన సంక్షేమ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీర చందూలాల్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అరూరి రమేశ్, శంకర్‌నాయక్ పాల్గొని అమరుల కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మా ట్లాడుతూ ఏ ఆశయం కోసమైతే రాష్ట్రాన్ని కోరుకున్నారో ఆ ఆశయం, లక్ష్యం నెరవేరినప్పుడే వారికి నిజమైన నివాళి అర్పించిన వారమవుతామన్నారు. ప్రత్యేక రాష్ర్టంలో అభివృద్ధి జరుగుతుందని, సమస్యలు, ఇబ్బందు లు తొలగుతాయని భావించి బలిదానాలు చేసుకున్నారని గుర్తు చేశారు.
ఆ కుటుంబాలను ఆదుకోవడం మన బాధ్యత అని అన్నా రు. రూ.10లక్షల సహాయంతోపాటు కుటుం బంలోఒకరికి ఉద్యోగం, మూడెకరాల భూమి, పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. వీరి త్యాగాలు భావితరాలకు తెలిసేలా స్మృతి వనాలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. మొదటి విడతలో ఎంపిక కాని అమరుల కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎఫ్ఐఆర్, పత్రికలలో వచ్చిన కథనాలతో కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కేసీఆర్ పార్టీపరంగా పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. సహాయానికి ఎంపిక కాని అమరుల కుటుంబాలు పెద్ది సుదర్శన్‌రెడ్డికి కూడా వివరాలు అందించవచ్చన్నారు. గిరిజన సంక్షే మ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీ ర చందూలాల్ మాట్లాడుతూ అమరవీరుల కుటుంబాలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటామన్నారు. బంగారు తెలంగాణలో అమరుల కుటుంబాలు బాధపడొద్దని, వారిని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకునేందుకు ముందుకు వచ్చిందన్నారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ వచ్చిందన్నారు. కాగా, సమావేశం ప్రారంభం కాగానే జాబితాలో పేర్లు లేని అమరుల కుటుంబ సభ్యులు వేదికపైకి చేరుకొని తమను విస్మరించారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో కలెక్టర్ వాకాటి కరుణ, డీఆర్వో శోభ తదితరులు పాల్గొన్నారు. తొలుత అమర వీరుల స్థూపానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
జాబితాలో చేర్చాలని వినతి
హన్మకొండ అర్బన్: ‘రాష్ట్రం కోసమే మా బిడ్డ లు ప్రాణత్యాగం చేశారు.. జై తెలంగాణ అం టూ వచ్చే రైలుకు ఎదురెళ్లి ప్రాణాలు ఆర్పిం చారు. వారి త్యాగాల ఫలితంగా రాష్ట్రం వచ్చింది కానీ.. వారి పేర్లు తెలంగాణ అమరవీరుల జాబితాలో చేర్చకపోవడం వారి అవమానించడమే’ అంటూ ఆమరవీరుల కుటుం బ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు అమరుల కుటుంబ సభ్యులు బుధవారం కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ రా పోలు ఆనందభాస్కర్‌కు తమ గోడు వెళ్లబోసుకుని వినతిపత్రం ఇచ్చారు. డిప్యూటీ సీఎం శ్రీహరి, కలెక్టర్ కరుణకు వినతిపత్రాలు సమర్పించారు. తమ విషయంలో ప్రభుత్వం వెం టనే నిర్ణయం ప్రకటించాలని కోరారు. కలెక్టరేట్‌కు వచ్చిన వారిలో అమరవీరులు సంగ పరమేశ్వర్, శంకర్, వెల్దండి సుమన్, బండ్లోజు శేషువర్మ, పెండ్యాల రాజయ్య, చుక్క రంజిత్, ఆరెల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఉన్నారు.